Poonam Kaur -Trivikram Srinivas: సినీ నటి పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె సినిమాల ద్వారా గుర్తింపు సంపాదించుకోవడం అంటే కూడా వివాదాస్పద పోస్టుల ద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. కేవలం సినిమాలకు సంబంధించిన విషయాలు గురించి మాత్రమే కాకుండా రాజకీయాల గురించి కూడా ఈమె మాట్లాడుతూ సంచలన పోస్టులు చేస్తుంటారు. ఇక ఈమె టాలీవుడ్ డైరెక్టర్ శ్రీనివాస్ గురించి నిత్యం చేసే పోస్టులు సంచలనంగా మారుతూ ఉంటాయి.
తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) గురించి పూనమ్ కౌర్(Poonam Kaur) చేసిన పోస్ట్ పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి పూనం కౌర్ పోస్ట్ చేస్తూ.. ఒకప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలలో కనిపించిన వినోదం, మాటల చమత్కారం కనిపించడం లేదంటూ ఈమె తెలియజేస్తూ.. నీలో ఫన్ లేదు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఆ స్థానానికి మళ్లీ నువ్వు వెళ్లలేవు అంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్టులో భాగంగా ఈమె త్రివిక్రమ్ పేరును ప్రస్తావిస్తూ చేయడం విశేషం.
ఇక ఈ పోస్ట్ తో పాటు పూనమ్ కౌర్ మరొక పోస్ట్ కూడా చేశారు. ఈ పోస్టులో భాగంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక నటి కోసం తన భార్యపై చేయి చేసుకుంటే ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. అయితే అతను ఎవరు అనేది మాత్రం ఈమె ప్రస్తావించకపోయినా, ఈ పోస్టులో గురూజీ అంటూ ప్రస్తావించడంతో కచ్చితంగా ఈ పోస్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ఉద్దేశించి చేసిందని తెలుస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇండస్ట్రీలో అందరూ గురూజీ అంటూ పిలుస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే పూనం సైతం గురూజీ అని ప్రస్తావించడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ఈ పోస్ట్ చేశారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి మరి ఈమె ఎవరిని ఉద్దేశించి పోస్ట్ చేశారనేది తెలియాల్సి ఉంది.
పూనమ్ కౌర్ గతంలో పలు సినిమాలలో హీరోయిన్గా నటించినప్పటికీ అనంతరం ఈమె కొన్ని సినిమాలలో హీరో చెల్లెలు పాత్రలలో కూడా నటించి సందడి చేశారు అయితే ఈమె నటించిన సినిమాలు పెద్దగా గుర్తింపును తీసుకురాలేదు. ఇక ఈమె సినిమాల కంటే కూడా ఇలాంటి వివాదాస్పదమైన పోస్టుల ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. గత కొంతకాలంగా త్రివిక్రమ్ శ్రీనివాసుని ఉద్దేశించి ఇలాంటి సంచలమైన పోస్టులు ఎన్నో చేసినప్పటికీ తాజాగా ఈమె చేసిన పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో కూడా చర్చలకు కారణం అవుతుంది.ఇక త్రివిక్రమ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన వెంకటేష్ హీరోగా ఆదర్శ కుటుంబం సినిమాకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికీ విడుదల కావాల్సి ఉండదు కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతుంది.
Also Read: రజినీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. జైలర్ 3 పై అఫీషియల్ అప్డేట్!