E-Paper
Advertisement

స్టేజ్‌పై నవ్వులు పూయించిన ఆ కమెడియన్ జీవితంలో ఇన్ని కష్టాలా ? ఓటీటీలోకి ఆసక్తికరమైన డాక్యుమెంటరీ

స్టేజ్‌పై నవ్వులు పూయించిన ఆ కమెడియన్ జీవితంలో ఇన్ని కష్టాలా ? ఓటీటీలోకి ఆసక్తికరమైన డాక్యుమెంటరీ
Advertisement

Norm Macdonald Documentary OTT : ప్రేక్షకులను నవ్వించడం అనేది తెరపై కనిపించినంత సులువు కాదు. ఒక హాస్యనటుడు కొన్ని నిమిషాల్లోనే వందల మందిని నవ్వించగలడు. కానీ ఆ నవ్వుల వెనుక ఎంత సాధన, పరిశీలన, వ్యక్తిగత అనుభవం ఉంటాయో చాలామందికి తెలియదు. మరీ ముఖ్యంగా తనదైన శైలితో ఇతరుల కంటే భిన్నంగా నవ్వించే వ్యక్తి జీవితం ఎలా సాగిందో తెలుసుకోవాలంటే, ఆయన చేసిన ప్రదర్శనలు మాత్రమే కాదు… ఆయన ప్రయాణం, ఎదురైన అడ్డంకులు, కళపై ఉన్న పట్టుదల గురించి కూడా తెలుసుకోవాలి. అలాంటి ప్రత్యేకమైన హాస్యనటుడి జీవితాన్ని తెరపైకి తీసుకొస్తున్న డాక్యుమెంటరీ ‘నార్మ్‌ ది టేల్‌ ఆఫ్‌ నార్మ్‌ మాక్‌డొనాల్డ్‌’ (Norm The Tale of Norm Macdonald). మరి ఈ ఇంట్రెస్టింగ్ డాక్యుమెంటరీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది ? అనే వివరాల్లోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

నార్మ్‌ మాక్‌డొనాల్డ్‌ రెగ్యులర్ గా వినిపించే పంచ్‌లతోనే నవ్వులు పంచే హాస్యనటుడు కాదు. నెమ్మదిగా మాట్లాడటం, మాటల మధ్య విరామాలు ఇవ్వడం, ఊహించని మలుపుతో కామెంట్స్ ను ముగించడం ఆయన ప్రత్యేకత. ముఖ్యంగా సాటర్డే నైట్‌ లైవ్‌ కార్యక్రమంలో చేసిన ప్రదర్శనలు, వీకెండ్‌ అప్‌డేట్‌లో వార్తలను వ్యంగ్యంగా చెప్పిన తీరు ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. ఆయన హాస్యంలో కొన్నిసార్లు అమాయకత్వం కనిపిస్తే, మరికొన్నిసార్లు ఎదుటి వారికి వెంటనే అర్థం కాని వ్యంగ్యం దాగి ఉండేది.

Advertisement

ఈ డాక్యుమెంటరీ నార్మ్‌ జీవితాన్ని కేవలం విజయాల జాబితాను చూపించడానికి ప్రయత్నించదు. ఆయన ఎదుగుదల, వృత్తిలో ఎదురైన మార్పులు, తనకంటూ ఒక ప్రత్యేకమైన హాస్యశైలిని నిలబెట్టుకోవాలనే పట్టుదల వంటి అంశాలను ఆయన జ్ఞాపకాల ద్వారా తెరపై ఆవిష్కరించారు. పాత దృశ్యాలు, వ్యక్తిగత ఫొటోలు, అభిమానులు, స్నేహితులు అందించిన అరుదైన వీడియోలతో ఈ చిత్రాన్ని రూపొందించారు. అందువల్ల ప్రేక్షకులకు ఒక ప్రముఖుడి గురించి బయటి వ్యక్తులు చెప్పే కథలా కాకుండా, ఆయన జీవితాన్ని ఆయన స్వరంలోనే అర్థం చేసుకునే అవకాశం దీని ద్వారా లభించింది.

ఓటీటీలో తెలుగులో ఉందా ?

‘నార్మ్‌ ది టేల్‌ ఆఫ్‌ నార్మ్‌ మాక్‌డొనాల్డ్‌’ అక్టోబర్‌ 16 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో విడుదల కానుంది. ఈ డాక్యుమెంటరీ నిడివి సుమారు 2 గంటల 6 నిమిషాలు ఉంటుంది. తెలుగు డబ్బింగ్‌ ఆడియో అందుబాటులో లేదు. ‘జడ్‌ అపాటో’ (Judd Apatow) దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీలో నార్మ్‌ మాక్‌డొనాల్డ్‌ కెరీర్‌తో పాటు, ఆయన హాస్యం ఎందుకు ఇతర హాస్యనటులకు కూడా ప్రత్యేకంగా అనిపించేదో తెలుసుకునే అవకాశం ఉంది.

Advertisement

కొందరు హాస్యనటులు పెద్దగా హావభావాలు చూపిస్తూ ప్రేక్షకులను నవ్విస్తారు. నార్మ్‌ మాత్రం సాధారణంగా చెప్పిన మాటలోనే నవ్వును పంచేవారు. ఆ శైలి ఆయనకు ఎలా ఏర్పడింది ? ప్రేక్షకులతో ఆయనకు ఉన్న అనుబంధం ఎలా పెరిగింది ? అనే అంశాలు ఈ జీవితకథను ఆసక్తికరంగా మారుస్తాయి. నార్మ్‌ మాక్‌డొనాల్డ్‌ హాస్యాన్ని ఇంతకుముందు ఆస్వాదించినవారికే కాకుండా, ఒక కళాకారుడి జీవిత ప్రయాణాన్ని అర్థం చేసుకోవాలనుకునేవారికి కూడా ఈ డాక్యుమెంటరీ ఆసక్తికరంగా ఉండవచ్చు.

Tags

Related News

30 ఏళ్ల క్రితం మాయమైన చేపల పడవ మళ్లీ ప్రత్యక్షం…. మైండ్ బెండింగ్ మిస్టరీ

చదువుకున్న స్కూల్‌కే టీచర్‌గా… పిల్లలతో ఈ మాజీ స్టూడెంట్ పడుతున్న కష్టాలు చూస్తే నవ్వులే నవ్వులు

భర్తనే నమ్మలేని పరిస్థితి… అమెరికా రాజకీయాల్లో మరో భారీ కుట్ర… ఓటీటీలో తాజా సీజన్ రచ్చ

బర్త్‌డే పార్టీకి వెళ్లి తుఫానులో… ఒక్కొక్కరి నిజ స్వరూపం చూస్తే మైండ్ బ్లాక్… గూస్‌బంప్స్ తెప్పిస్తున్న డార్క్ కామెడీ

ఫ్రెండ్స్‌తో కలిసి కేఫ్‌ మొదలుపెడితే… మన ఫ్రెండ్స్ గ్యాంగ్‌ని గుర్తుచేసే మలయాళం కామెడీ సిరీస్ తెలుగులో

కోమా నుంచి లేచాక ఎదుటివాళ్ల మనసులోని మాటలు వినిపిస్తే ? కడుపుబ్బా నవ్వించే మలయాళ సూపర్ హిట్ కామెడీ డ్రామా

బంగారు లాకెట్‌తో మొదలైన చిక్కులు… కోర్టును షేక్ చేసే మత్స్యకారుడి పోరాటం… ఓటీటీలో తెలుగులో ఎమోషనల్ డ్రామా

Big Stories

Advertisement
×