Mutton Benefits: సాధారణంగా మధ్యతరగతి కుటుంబాల్లో అయితే ఆదివారాల్లో మాత్రమే నాన్‌వెజ్ వండుతుంటారు. ఇంకొంచెం డబ్బున్నవాళ్లయితే.. వారంలో మూడు సార్లు చికెన్, మటన్.. ఇలా వారికి ఇష్టమైనది తెచ్చుకుని కుక్ చేసుకుని తింటారు. ఈ క్రమంలో చాలామంది తక్కువ ధరకు వస్తుంది కదాని నెలలో ఎక్కువసార్లు చికెన్ లేదా చేపలు తెచ్చుకోవడానికే ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఈ రెండింటి కంటే కాస్త ఖరీదైనా సరే.. వారంలో రెండుసార్లు మటన్ తలకాయ కూర తింటే ఎన్నోరకాల ఆరోగ్య ప్రయోజాలను పొందవచ్చని చెబుతున్నారు న్యూట్రిషియన్స్.
ముఖ్యంగా మేక తలకాయ కూరలో అనేక పోషకాలు ఉండటంతో.. ఇవి మన శరీరానికి బలం, రోగనిరోధక శక్తి, ఎముకలకు బలం, మెటబాలిజం పెంపు కోసం ఉపయోగపడతాయి. 100 గ్రాముల తలకాయ కూర తింటే సుమారు 200 క్యాలరీలు, 30 గ్రాముల ప్రోటీన్, 20 గ్రాముల కొవ్వులు లభిస్తాయి. అంతేకాదు.. తలకాయ కూరలో శరీరానికి అవసరమైన ప్రోటీన్, విటమిన్ B12, ఐరన్, ఫాస్పరస్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉండటంతో ప్రధానమైన 7 రకాల దీర్ఘకాలిక జబ్బులుకు చెక్ పెట్టవచ్చట.
Also Read: శీతాకాలంలో బరువు పెరగకుండా ఉండాలంటే.. తప్పకుండా పాటించాల్సిన 4 రూల్స్ ఇవే!
తలకాయ కూరలో జింక్, విటమిన్ B12 ఉంటాయి. ఇవి శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్‌ను బలపరుస్తాయి. దీని వల్ల శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతాయి. అంతేకాదు.. తలకాయ కూరలోని పోషకాలు మన శరీరానికి కావాల్సిన ఇమ్యూనిటీని కూడా అందిస్తాయి.
తలకాయ కూరలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిలను పెంచి రక్తహీనత సమస్యలను దూరం చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది. అందుకే వారానికి రెండు సార్లు తలకాయ కూర తింటే.. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
మటన్‌లోని కాల్షియం, ఫాస్ఫరస్ కీళ్లను, ఎముకలను దృఢంగా ఉంచుతయాని చెబుతున్నారు వైద్య నిపుణులు. వారంలో రెండుసార్లు తలకాయ కూర తీసుకోవడం వలన వయసు పైబడిన వాళ్లలో ఉన్న కీళ్ల నొప్పులు కూడా తగ్గిపోతాయి.
తలకాయ కూరలోని గ్లూకోసమైన్, కాండ్రాయిటిన్, ప్రోటీన్, హెల్దీ కొవ్వులు మన శరీరానికి శక్తి అందించడమే కాక.. మెటబాలిజం, సెల్ ఫంక్షన్ కోసం ఉపయోగపడతాయి. దీంతో రోజంతా శరీరం ఉత్సాహంగా ఉంటుంది.
మేక తలకాయ కూరలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. దీనిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె రోగాల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. వారానికి రెండు సార్లు కూర తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే తలకాయ కూరను వారంలో రెండుసార్లు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా మేక తలకాయలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షించడంలో ఉపయోగపడతాయి.
తలకాయ కూరలోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, క్యాన్సర్ కారకాలను నిరోధించడంలో సహాయపడతాయి. అలాగే మేక తలకాయలో ఉండే పోషకాలు క్యాన్సర్ కణాలను అణచివేయడంలో కీలకంగా వ్యవహరిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read: డైట్ ఫాలో అవుతున్నా బరువు తగ్గడం లేదా? రాత్రి 11 తర్వాత పడుకోవడమే కారణమంటున్న నిపుణులు!