E-Paper
Advertisement

Winter weight gain: శీతాకాలంలో బరువు పెరగకుండా ఉండాలంటే.. తప్పకుండా పాటించాల్సిన 4 రూల్స్ ఇవే!

Winter weight gain: శీతాకాలంలో బరువు పెరగకుండా ఉండాలంటే.. తప్పకుండా పాటించాల్సిన 4 రూల్స్ ఇవే!
Advertisement

Winter weight gain: రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతల వల్ల వాతావరణం చల్లగా మారిపోతుంది. దీంతో ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టాలంటేనే వణికిపోతున్నారు. ఈ క్రమంలో చలిని తట్టుకునేలా, శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు రకరకాల ఫుడ్ రెసిపీలను ట్రై చేసి తినేస్తున్నారు. ఇక్కడ తినడం సమస్య కాదు.. తిన్న తర్వాత శరీరానికి కావాల్సిన వ్యాయామాన్ని అందింకపోవడమే సమస్య. సాధారణంగా వింటర్ సీజన్లో చాలామంది వ్యాయామాలు చేయకుండా ఇంట్లోనే ఉంటారు. దీంతో అధిక బరువును నియంత్రించుకోవడం కష్టంగా మారుతుంది.

కొంతమంది చలిలో బయటికి వెళ్లడం వలన జలుబు, దగ్గు, కీళ్లు పట్టేయడం, చర్మం పొడిబారడం, శ్వాసకోశ సంబంధిత సమస్యలు.. చుట్టుముడతాయని కారణాలు చెబుతుంటారు. అయితే శరీరానికి తగిన శ్రమ లేకపోతే ఈ సమస్యలు మరింత పెరుగుతాయే తప్ప తగ్గవనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. చలికాలంలో బరువు పెరగడానికి గల ప్రధాన కారణాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Also Read: కివీ పండు తొక్కలో ఇంత ఆరోగ్యం దాగుందా? వామ్మో.. ఈ విషయం తెలియక ఇన్నిరోజులూ పడేశాం కదరా!

శారీరక శ్రమ లేకపోవడం:

తీవ్రమైన చలి కారణంగా ఉదయాన్నే లేచి వ్యాయామం చేయడానికి శరీరం సహకరించదు. తద్వారా మీ బాడీ ఫిట్‌నెస్‌ అదుపు తప్పుతుంది. ఇలాగే కొన్నిరోజులు కొనసాగితే.. శరీరంలో ఉన్న క్యాలరీలు కొవ్వుగా మారుతాయి. తద్వారా సులభంగా, వేగంగా బరువు పెరిగిపోతారు. కాబట్టి.. బరువు నియంత్రణలో ఉంచుకోవాలంటే.. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా అవసరం అంటున్నారు వైద్య నిపుణులు.

విటమిన్ D లోపం:

Advertisement

ఎండాకాలం అయినా చలికాలం అయినా సరే మన శరీరానికి విటమిన్ డి చాలా అవసరం. చలి కారణంగా బయటికి రాకపోతే.. ‘సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్‌’ సమస్య బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. ఇది కూడా ఓ రకమైన డిప్రెషన్‌ లాంటిది. దీంతో తరచూ ఆకలి వేస్తుంటుంది. దీంతో మోతాదుకు మించి ఆహారం తీసుకోవడం వంటివి చేస్తుంటాం. ఈ చిన్న చిన్న అలవాట్లే బరువు పెరిగేందుకు ప్రధాన కారణవుతాయి. అందుకే.. ఉదయం ఎండ లేకపోయినా.. రోజులో ఏదో ఒక సమయంలో కాసేపు ఎండలో ఉండటం చాలా మంచిది. దీంతో బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.

రొటీన్ లైఫ్‌స్టైల్:

ఎక్కువగా మహిళల్లో ఏర్పడే హార్మోన్ల అసమతుల్యత వల్ల వాళ్లు వేగంగా బరువు పెరుగుతుంటారు. దీనికి తోడు చలికాలంలో చోటుచేసుకునే మార్పులు కూడా హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. దీంతో బరువు తగ్గే ప్రక్రియ నెమ్మదించడంతో పాటు ఆహారం తినాలనే పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి.. హార్మోన్లను సమతులంగా ఉంచుకోవడానికి జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు ఎంతో ముఖ్యమని సూచిస్తున్నారు.

మిడ్ నైట్ క్రేవింగ్:

సాధారణంగా శీతాకాలం పగలు కంటే రాత్రి ఎక్కువ సమయం ఉంటుంది. ఈ నేపథ్యంలో రాత్రి భోజనం త్వరగా ముగించేస్తుంటాం. ఇక రాత్రి పడుకునే సమయానికి లేదా పడుకున్నాక అర్ధరాత్రి ఆకలేస్తుంటుంది కొన్నిసార్లు. అలాంటప్పుడు ఏదిపడితే అది తినేయకుండా.. తేలికైన ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా బిస్కట్స్‌, చిప్స్‌, పాప్‌కార్న్, కుకీస్‌, చాక్లెట్స్‌‌కు దూరంగా ఉండాలి. ఈ హాబిట్స్ కూడా వెయిట్ గైన్‌కు కారణం అవుతాయని చెబుతున్నారు ఫిట్నెస్ నిపుణులు. అర్ధరాత్రి ఆకలేసినప్పుడు పండ్లు, నట్స్‌, డ్రైఫ్రూట్స్ వంటివి తీసుకుంటే బరువు నియంత్రణలో ఉంటుంది.

Also Read: సాంబార్ లేనిదే సంక్రాంతి పండగ అసంపూర్ణం.. ఇంట్లో అద్భుతంగా తయారు చేసుకునే సింపుల్ పద్ధతి!

 

 

Related News

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

Big Stories

Advertisement
×