E-Paper
Advertisement

Beetroot Mask: ఇన్‌స్టంట్‌ గ్లో కోసం బీట్‌రూట్ మాస్క్.. ఇలా వాడితే ముఖంపై ట్యాన్ మాయం

Beetroot Mask: ఇన్‌స్టంట్‌ గ్లో కోసం బీట్‌రూట్ మాస్క్.. ఇలా వాడితే ముఖంపై ట్యాన్ మాయం
Advertisement

Beetroot Mask: బీట్‌రూట్ కేవలం ఆరోగ్యానికే కాదు.. చర్మ సౌందర్యానికి కూడా ఒక అద్భుతమైన వరం. ముఖ్యంగా ఎండ వల్ల కలిగే ట్యాన్ తొలగించడంలో ఇది చాలా ప్రభావ వంతంగా పనిచేస్తుంది. బీట్‌ రూట్‌లో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని శుభ్రపరిచి.. సహజమైన మెరుపును అందిస్తాయి. ట్యాన్ తొలగించడానికి ఉపయోగపడే ఉత్తమ మైన బీట్‌ రూట్ మాస్క్‌ల గురించి  వివరంగా తెలుసుకుందాం.

1. బీట్‌రూట్, పెరుగు మాస్క్ :
పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. బీట్‌ రూట్ నలుపును తగ్గిస్తుంది.

Advertisement

కావలసినవి:
2 చెంచాల బీట్‌రూట్ జ్యూస్
1 చెంచా చిక్కని పెరుగు

తయారీ: ఒక గిన్నెలో ఈ రెండింటినీ బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు పట్టించి 20 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత చల్లని నీటితో కడిగేయండి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే ట్యాన్ త్వరగా తగ్గుతుంది.

Advertisement

2. బీట్‌రూట్, శనగపిండి మాస్క్:
శనగపిండి చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించడానికి సహాయ పడుతుంది.

కావలసినవి:
2 చెంచాల బీట్‌రూట్ పేస్ట్
1 చెంచా శనగపిండి
కొద్దిగా నిమ్మరసం

తయారీ: బీట్‌రూట్ తురుమును మెత్తగా చేసి.. అందులో శనగపిండి, నిమ్మరసం కలపండి. ఈ ప్యాక్‌ను ముఖానికి రాసి.. 15 నిమిషాల తర్వాత ముఖంపై రుద్దుతూ కడిగేయండి. ఇది చర్మాన్ని లోతుగా శుభ్ర పరుస్తుంది.

3. బీట్‌రూట్, తేనె మాస్క్ :

పొడి చర్మం ఉన్న వారికి ఇది చాలా మంచిది. తేనె చర్మానికి తేమను అందిస్తుంది.

కావలసినవి:
2 చెంచాల బీట్‌రూట్ రసం
1 చెంచా స్వచ్ఛమైన తేనె

తయారీ: జ్యూస్, తేనెను బాగా కలిపి ముఖానికి అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఇది ట్యాన్ తొలగించడమే కాకుండా చర్మాన్ని కోమలంగా ఉంచుతుంది.

బీట్‌రూట్ మాస్క్ వల్ల కలిగే ఉపయోగాలు:
పిగ్మెంటేషన్ నివారణ: బీట్‌రూట్‌లోని ‘బీటాలైన్స్’ చర్మంపై ఉన్న నల్లటి మచ్చలను, పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తాయి.

సహజమైన మెరుపు: రసాయనాలు లేని పద్ధతిలో ముఖానికి గులాబీ రంగు మెరుపును ఇస్తుంది.

యాంటీ ఏజింగ్: చర్మంపై ముడతలు రాకుండా కాపాడుతుంది.

జిడ్డు చర్మం: జిడ్డు చర్మం ఉన్నవారికి ఇది అధిక జిడ్డును తొలగించి చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.

Also Read: చలికాలంలో బెల్లం తింటే.. ఏం జరుగుతుందో తెలుసా ?

కొన్ని జాగ్రత్తలు:
బీట్‌రూట్ సహజ సిద్ధమైనదే అయినప్పటికీ.. కొందరికి పడకపోవచ్చు. కాబట్టి ఉపయోగించే ముందు చేతిపై ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది.

మాస్క్ వేసుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి.

ఈ మాస్క్‌లు వేసుకున్న తర్వాత నేరుగా ఎండలోకి వెళ్లకపోవడం మంచిది.

బీట్‌రూట్‌ను కేవలం పైపూతగా మాత్రమే కాకుండా.. జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి జరిగి లోపలి నుంచి చర్మం కాంతివంతంగా మారుతుంది.

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×