E-Paper
Advertisement

Gandipet Reservoir: గండిపేట చెరువులో సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలు.. వాటర్ ట్యాంకర్ల మాఫియా పనేనా?

Gandipet Reservoir: గండిపేట చెరువులో సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలు.. వాటర్ ట్యాంకర్ల మాఫియా పనేనా?
Advertisement

Gandipet Reservoir: హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల మాఫియా రెచ్చిపోతుందా? ఈసారి వర్షాలు ఎక్కువగా పడడంతో కొత్త స్కెచ్ వేసిందా? హైదరాబాద్ చుట్టూ లేక్‌లను కలుషితం చేసే పనిలో పడ్డాయా? అర్ధరాత్రి వేళ సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను నేరుగా చెరువు నీటిలోకి వదులుతున్నారా? అవుననే స్థానికవాసులు.

గండిపేట చెరువులో సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలు

Advertisement

హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల్లో వాటర్ మాఫియా రెచ్చిపోతోంది. కొందరు గండిపేట చెరువును నాశనం చేస్తున్నారు. నగర ప్రజలకు మంచినీరు అందిస్తున్న గండిపేట రిజర్వాయర్‌లో సెప్టిక్‌ ట్యాంకుల ద్వారా మల-మూత్ర విసర్జన వ్యర్థాలను కలుపుతున్నారు. ఈ వ్యవహారం ఎప్పటి నుంచి జరుగుతుందో తెలీదు. బుధవారం రాత్రి గండిపేటలో స్థానికులు సెప్టిక్‌ ట్యాంకును రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని జలమండలి అధికారులకు అప్పగించారు. ఇద్దర్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వారిపై స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

మొయినాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని గండిపేట రిజర్వాయర్ వద్ద ఉస్మాన్‌ సాగర్‌ FTL 428వ పాయింట్ వద్ద జరిగింది. TG 11-T1833 నెంబర్‌ గల సెప్టిక్ ట్యాంక్, చెరువులో వ్యర్థాలను పారబోస్తూ కనిపించింది. సెప్టిక్‌ ట్యాంక్‌ వాహనం డ్రైవర్ రమావత్ శివనాయక్.. వాటిని వదులుతూ కనిపించారు. చుట్టుప్రక్కల వారికి దుర్వాసన రావడంతో బయటకు వచ్చారు. సెప్టిక్‌ ట్యాంక్‌ వాహనం డ్రైవర్‌ని నిలదీశారు. అనంతరం అతన్ని పట్టుకున్న స్థానికులు..  జలమండలి అధికారులు-పోలీసులకు సమాచారం ఇచ్చారు.  వెంటనే ఘటనా స్థలానికి జలమండలి అధికారులు చేరుకున్నారు.

Advertisement

పోలీసుల అదుపులో ఇద్దరు.. వాటర్ ట్యాంకర్ల మాఫియా పనేనా?

సెప్టిక్ ట్యాంకర్‌కి వాటర్ బోర్డు, GHMC లోగో ఉన్నట్లు గుర్తించారు. హిమాయత్‌నగర్‌ ప్రాంతం నుంచి వ్యర్థాలను తీసుకొచ్చి ఇక్కడ వదులుతున్నట్లు చెప్పాడు. సెప్టిక్ ట్యాంక్ వాహనాన్ని సీజ్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలు తాగే నీళ్లలో ఇలాంటి వ్యర్థాలు పారపోయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాగే నీళ్లలో వ్యర్థాలు అన్‌లోడ్‌ వ్యవహారంపై HMWSSBని స్థానికులు తిట్టి పోస్తున్నారు. ఉస్మాన్‌సాగర్‌లో అధికారులు దగ్గరుండి పారబోయిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ALSO READ:  కుప్పకూలిన మానేరు చెక్ డ్యామ్.. కొట్టుకుపోయిందా? కూల్చారా?

దీనివెనుక వాటర్ ట్యాంకర్ల మాఫియా ప్రమేయముందని వాదన లేకపోలేదు. ఈ ఏడాది వర్షాలు భారీగా కురిశాయి. ఎప్పుడు నగర శివారు ప్రాంతాలు నవంబర్ నుంచి వాటర్ ట్యాంకులను ఆశ్రయిస్తుంటారు. ఈసారి డిసెంబర్ నెల వచ్చినా ట్యాంకర్ల కావాలని ఏ ఒక్కరూ అడగలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చెరువుని కలుషితం చేస్తే తమ వ్యాపారాలకు డోకా ఉండదని భావించి ఈ విధంగా చేస్తున్నారని అంటున్నవాళ్లూ లేకపోలేదు. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో చూడాలి.

 

Related News

రేవంత్ రెడ్డి కేవలం రిబ్బన్ కటింగ్ సీఎం మాత్రమే!- పాడి కౌశిక్ రెడ్డి

తెలంగాణ పాఠశాల విద్యలో సంచలన మార్పులు.. ఇకపై వారి చేతుల్లోనే మార్కులు!

ఒకటి రెడ్డి.. మరొకటి బీసీ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వ్యూహం ఫలించేనా?

తెలంగాణ విద్యుత్ వినియోగదారులకు బంపర్ ఆఫర్..11 కేవీ కనెక్షన్లపై సరికొత్త నిబంధనలు!

నర్సింగ్ కౌన్సిల్ ఖాతాల్లో కోట్ల రూపాయలు.. మరి ఆ డబ్బంతా ఏమైనట్లు?

మోడీని ఎదుర్కొనే దమ్ములేక ఈసీ, ఈవీఎంలపై నిందలా? కాంగ్రెస్‌పై బండి సంజయ్ ఫైర్!

ఎమ్మెల్సీ బరిలో ఆ ఇద్దరు నేతలు.. రేవంత్ రెడ్డి మార్క్ మాస్టర్ ప్లాన్!

రాహుల్ కాదు కదా.. ఆయన జేజమ్మ వచ్చినా మోడీని ఏమీ చేయలేరు: ఈటల రాజేందర్

Big Stories

Advertisement
×