E-Paper
Advertisement

నాన్-స్టిక్ పాన్లకు గుడ్‌బై చెప్పి.. ఈ 3 రకాల పాత్రలను వాడండి!

నాన్-స్టిక్ పాన్లకు గుడ్‌బై చెప్పి.. ఈ 3 రకాల పాత్రలను వాడండి!
Advertisement

cookware: ప్రస్తుతం ప్రతి ఒక్కరి వంటగదిలోనూ ‘నాన్-స్టిక్’ పాత్రలు ఒక భాగమైపోయాయి. నూనె తక్కువ పడుతుందని.. వంట చేయడం సులువుగా ఉంటుందని చాలా మంది దోశల పెంకులు, కడాయిల కోసం వీటినే వాడుతున్నారు. అయితే.. ఈ నాన్-స్టిక్ పాత్రల వెనక తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పాటు క్యాన్సర్ భయాలు కూడా దాగి ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నాన్-స్టిక్ కోటింగ్ వల్ల కలిగే నష్టాలు ఏంటి? వాటి స్థానంలో మన ఆరోగ్యాన్ని కాపాడే ఎలాంటి సురక్షితమైన ప్రత్యామ్నాయ పాత్రలను వాడాలి. వాటి ధరల వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నాన్-స్టిక్ పాత్రల వల్ల అసలు ముప్పు: 
నాన్-స్టిక్ పాత్రలపైన ఆహారం అంటుకోకుండా ఉండటానికి ఒక ప్రత్యేకమైన రసాయన కోటింగ్ వేస్తారు. దీన్నే మనం సాధారణంగా ‘టెఫ్లాన్’ కోటింగ్ అంటాం.

Advertisement

టెఫ్లాన్ రసాయనాలు: గతంలో వీటి తయారీలో PFOA అనే ప్రమాదకరమైన కెమికల్ వాడేవారు. ఇప్పుడు కంపెనీలు దాన్ని మార్చినప్పటికీ.. పాత పాత్రల్లో లేదా బాగా స్క్రాచ్ పడిన (గీతలు పడిన) పాత్రల నుంచి ఈ రసాయనాలు మనం తినే ఆహారంలోకి ఈజీగా కలిసిపోతాయి.

అధిక వేడి వద్ద ప్రమాదం: నాన్-స్టిక్ పాన్‌ను గ్యాస్ స్టవ్‌పై పెట్టి చాలా ఎక్కువ వేడి చేసినప్పుడు, ఆ కోటింగ్ నుంచి విషపూరితమైన వాయువులు విడుదలవుతాయి. ఇది దీర్ఘకాలంలో థైరాయిడ్, లివర్ సమస్యలు, కొన్ని రకాల క్యాన్సర్లకు దారితీసే ప్రమాదం ఉందని పరిశోధనల్లో తేలింది.

Advertisement

స్పూన్ల గీతలు: ఇనుప గరిటెలు వాడటం వల్ల కోటింగ్ ఊడిపోయి, మనం వండే కూరల్లో కలిసి కడుపులోకి వెళ్తుంది.

నాన్-స్టిక్ పాత్రలకు బెస్ట్ ప్రత్యామ్నాయాలు:
మీరు మీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే నాన్-స్టిక్ పాత్రలను మెల్లగా పక్కన పెట్టి, కింద చెప్పిన సాంప్రదాయ, సురక్షితమైన పాత్రలను వాడటం అలవాటు చేసుకోండి.

1. కాస్ట్ ఐరన్ పాత్రలు – ఎప్పటికీ ది బెస్ట్!
మన అమ్మమ్మల కాలంలో వాడిన ఇనుప పాత్రలే ఆరోగ్యానికి అత్యంత సురక్షితమైనవి. ఒకసారి వీటిని కొంటే తరతరాలుగా వాడుకోవచ్చు.

లాభాలు: కాస్ట్ ఐరన్ పాత్రలలో వండటం వల్ల ఆహారంలో సహజంగానే ఐరన్ శాతం పెరుగుతుంది. ఇది రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. వీటిని సరిగ్గా మెయింటెన్ చేస్తే నాన్-స్టిక్ లాగే అస్సలు అంటుకోవు.

2. స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు – మోడరన్ అండ్ సేఫ్
ప్రస్తుతం మార్కెట్లో ‘ట్రై-ప్లై’ స్టీల్ పాత్రలకు విపరీతమైన క్రేజ్ ఉంది. వీటి మధ్యలో అల్యూమినియం, పైన కింద స్టీల్ లేయర్స్ ఉండటం వల్ల వంట అడుగంటదు. సమానంగా వేడెక్కుతుంది.

లాభాలు: స్టీల్ పాత్రల వల్ల ఎలాంటి కెమికల్స్ వంటల్లో కలవవు. వీటిని క్లీన్ చేయడం చాలా ఈజీ, లైఫ్ లాంగ్ మన్నుతాయి.

3. మట్టి పాత్రలు–స్వచ్ఛమైన రుచి
ఆరోగ్యానికి 100% గ్యారెంటీ ఇచ్చేవి కేవలం మట్టి పాత్రలే. సాంబార్, పప్పు లేదా నాన్-వెజ్ కూరలను మట్టి పాత్రల్లో వండితే ఆ రుచే వేరు.
లాభాలు: ఇవి ఆహారంలో ఉన్న పోషకాలను నశించకుండా కాపాడతాయి. శరీరానికి చలవ చేస్తాయి.

Related News

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

ఉదయం ఫ్రెష్‌గా లేవాలంటే రాత్రి ఎప్పుడు పడుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు?

చాణక్య నీతి.. ఈ 6 సందర్భాల్లో మౌనంగా ఉండటమే తెలివైన నిర్ణయం

Big Stories

Advertisement
×