E-Paper
Advertisement

కడుపులో ఇన్ఫెక్షనా? నోరోవైరస్ సంకేతాలను గుర్తించండి ఇలా!

కడుపులో ఇన్ఫెక్షనా? నోరోవైరస్ సంకేతాలను గుర్తించండి ఇలా!
Advertisement

Norovirus Symptoms: ప్రస్తుత కాలంలో రకరకాల వైరస్‌లు మన ఆరోగ్యాన్ని సవాల్ చేస్తున్నాయి. అందులో ఒకటి ‘నోరోవైరస్’. దీనిని సాధారణంగా ‘స్టమక్ ఫ్లూ’ అని పిలుస్తారు. కానీ దీనికి సాధారణ ఫ్లూ (ఇన్ఫ్లుఎంజా)కి ఎటువంటి సంబంధం లేదు. ఇది చాలా మొండి వైరస్, ఒక్కసారి ఇంట్లో ఎవరికైనా వస్తే.. కుటుంబం మొత్తానికి వేగంగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా కలుషిత నీరు, ఆహారం ద్వారా సంక్రమించే ఈ వైరస్ వల్ల వచ్చే లక్షణాలు మనిషిని చాలా నీరసపరుస్తాయి. దీని పట్ల అవగాహన పెంచుకోవడం ద్వారా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

నోరోవైరస్ లక్షణాలు:
నోరోవైరస్ శరీరంలోకి ప్రవేశించిన 12 నుంచి 48 గంటల లోపు లక్షణాలు కనిపిస్తాయి. ప్రధాన లక్షణాలు ఇవే..

Advertisement

తీవ్రమైన విరేచనాలు: ఎలాంటి రక్తం పడకుండా నీళ్ల విరేచనాలు అవుతాయి.

వాంతులు, వికారం: ఆహారం తీసుకోలేకపోవడం, నిరంతరం వికారంగా అనిపించడం.

Advertisement

కడుపు నొప్పి: కడుపులో తిమ్మిర్లు వచ్చినట్లుగా లేదా విపరీతమైన నొప్పి కలగడం.

జ్వరం: తక్కువ స్థాయిలో జ్వరం, చలి రావచ్చు.

శరీర నొప్పులు: కండరాలు, తల నొప్పిగా అనిపించడం.

డీహైడ్రేషన్ (నిర్జలీకరణం): వాంతులు, విరేచనాల వల్ల శరీరంలోని నీరు తగ్గిపోయి నాలుక ఎండిపోవడం, మూత్రం తక్కువగా రావడం, తలతిరగడం వంటి డీహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తాయి. చిన్న పిల్లలు, వృద్ధులలో ఇది ప్రమాదకరంగా మారవచ్చు.

కారణాలు వ్యాప్తి :
నోరోవైరస్ వ్యాపించడానికి ప్రధాన కారణాలు ఇక్కడ ఉన్నాయి.

కలుషిత ఆహారం, నీరు: ఈ వైరస్ ఉన్న వ్యక్తి ఆహారం వండినా లేదా నీటిని తాకినా.. ఆ ఆహారం తీసుకున్న వారికి వైరస్ సోకుతుంది. ముఖ్యంగా సరిగ్గా ఉడికించని సముద్ర ఆహారం వల్ల కూడా ఇది వస్తుంది.

వ్యక్తుల మధ్య సంబంధం: బాధితుడిని తాకడం, వారు వాడిన వస్తువులను ఉపయోగించడం వల్ల సులభంగా వ్యాపిస్తుంది.

కలుషిత ఉపరితలాలు: వైరస్ ఉన్న వ్యక్తి తాకిన డోర్ హ్యాండిల్స్, టేబుల్స్, లేదా బట్టలపై ఈ వైరస్ చాలా కాలం బతికే ఉంటుంది. మనం వాటిని తాకి, చేతులు కడుక్కోకుండా ఆహారం తీసుకుంటే అది శరీరంలోకి చేరుతుంది.

నివారణ, చికిత్స :
నోరోవైరస్‌కు ప్రత్యేకమైన యాంటీ-వైరల్ మందులు లేవు. యాంటీబయోటిక్స్ ఈ వైరస్‌పై పనిచేయవు.

ఓఆర్ఎస్ (ORS): శరీరానికి కావలసిన లవణాలు, నీటిని అందించడానికి ఓఆర్ఎస్ నీళ్లు తాగాలి.

విశ్రాంతి: శరీరం వైరస్‌తో పోరాడటానికి తగినంత విశ్రాంతి అవసరం.

తేలికపాటి ఆహారం: గంజి, పెరుగు అన్నం వంటి సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి.

నివారణ మార్గాలు:

చేతుల పరిశుభ్రత: ఆహారం తినే ముందు.. టాయిలెట్‌కు వెళ్లి వచ్చిన తర్వాత చేతులను సబ్బుతో కనీసం 20 సెకన్ల పాటు కడుక్కోవాలి. కేవలం హ్యాండ్ శానిటైజర్లు నోరోవైరస్‌ను పూర్తిగా చంపలేవు.

పండ్లు,కూరగాయలు కడగడం: పండ్లను తినే ముందు ఉప్పు నీటితో శుభ్రంగా కడగాలి.

ఆహారాన్ని బాగా ఉడికించడం: ఆహారాన్ని అధిక ఉష్ణోగ్రత వద్ద ఉడికించడం వల్ల వైరస్ చనిపోతుంది.

అప్రమత్తత: ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారి బట్టలను విడిగా ఉతకాలి మరియు ఇంటిని డిసిన్ఫెక్టెంట్స్‌తో శుభ్రం చేయాలి.

నోరోవైరస్ సాధారణంగా రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుంది. కానీ.. నిర్లక్ష్యం చేస్తే డీహైడ్రేషన్ వల్ల ప్రాణాపాయం కలగవచ్చు. పరిశుభ్రత పాటించడం ఒక్కటే ఈ వైరస్ నుంచి తప్పించుకోవడానికి ఉన్న మార్గం. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి.. పరిసరాలను, చేతులను శుభ్రంగా ఉంచుకుందాం.

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×