E-Paper
Advertisement

ఆఫీస్‌లో ఏసీ మరీ ఎక్కువైందా? బీపీ పెరుగుతుందట.. తస్మాత్ జాగ్రత్త!

ఆఫీస్‌లో ఏసీ మరీ ఎక్కువైందా? బీపీ పెరుగుతుందట.. తస్మాత్ జాగ్రత్త!
Advertisement

Office AC Health Risks: ఎండల నుంచి తప్పించుకోవడానికి ఆఫీసులో ఏసీ ఉండటం మంచిదే. కానీ.. ఆ ఏసీ మీ శరీరాన్ని గడ్డకట్టేలా చేస్తోందా? చాలా ఆఫీసుల్లో టెంపరేచర్ 18 లేదా 20 డిగ్రీలు ఉంటుంది. ఇలా విపరీతమైన చల్లదనంలో గంటల కొద్దీ గడపడం వల్ల కేవలం జలుబు, దగ్గు మాత్రమే కాదు.. సైలెంట్‌గా మీ బీపీ కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలికి వణికిపోతూ పని చేయడం వల్ల గుండె ,రక్తనాళాలపై భారం పడుతుందని అంటున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఆఫీస్ ఏసీ చల్లదనం.. మీ రక్తపోటుకు శత్రువా?

Advertisement

బయట ఎండలు మండిపోతున్నాయని ఆఫీసులో ఏసీ టెంపరేచర్‌ను తగ్గిస్తుండటం సాధారణమే. అయితే.. ఈ గడ్డకట్టే చలిలో పని చేయడం వల్ల మన శరీరం అనేక అంతర్గత మార్పులకు లోనవుతుంది. అందులో ప్రధానమైనది ‘వాసోకన్స్ట్రిక్షన్.

బీపీ ఎందుకు పెరుగుతుంది?

Advertisement

మన శరీరం అతి తక్కువ ఉష్ణోగ్రతలకు గురైనప్పుడు, లోపల ఉన్న వేడి బయటకు పోకుండా ఉండేందుకు రక్తనాళాలు కుంచించుకుపోతాయి. దీని వల్ల రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడి.. గుండె ఎక్కువ ఒత్తిడితో రక్తాన్ని పంప్ చేయాల్సి వస్తుంది. ఫలితంగా బీపీ అకస్మాత్తుగా పెరుగుతుంది. ఇప్పటికే బీపీ సమస్య ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరంగా మారుతుంది.

ఏసీ వల్ల కలిగే మరికొన్ని అనారోగ్య సమస్యలు:

కీళ్ల నొప్పులు, స్టిఫ్నెస్: ఏసీ గాలి నేరుగా శరీరంపై పడటం వల్ల కండరాలు బిగుసుకుపోతాయి. ముఖ్యంగా మెడ నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఉన్నవారికి ఈ చల్లదనం నరకం చూపిస్తుంది.

చర్మం, కళ్ల పొడిబారడం: ఏసీ గాలి గదిలోని తేమను పీల్చేస్తుంది. దీని వల్ల చర్మం పొడిబారి దురదలు రావడం, కళ్లు మంట పుట్టడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

తక్కువ రోగనిరోధక శక్తి: అతి చల్లదనం వల్ల శరీర మెటబాలిజం మందగిస్తుంది. ఇది మిమ్మల్ని తరచుగా వైరల్ ఫీవర్లు, సైనస్ సమస్యలకు గురి చేస్తుంది.

ఆఫీస్‌లో మీరు పాటించాల్సిన జాగ్రత్తలు:

ఆఫీసు ఏసీ సెట్టింగ్స్ మార్చడం మీ చేతుల్లో లేకపోవచ్చు. కానీ మిమ్మల్ని మీరు కాపాడుకోవడం మాత్రం మీ చేతుల్లోనే ఉంది.

లేయర్డ్ క్లోతింగ్ : ఆఫీసుకి వెళ్లేటప్పుడు పలచని బట్టలకు బదులు, పైన వేసుకోవడానికి ఒక స్వెటర్ లేదా బ్లేజర్ వెంట తీసుకెళ్లండి. దీని వల్ల చల్లని గాలి నేరుగా చర్మానికి తగలదు.

క్రమం తప్పకుండా వాకింగ్: ప్రతి గంటకు ఒకసారి సీటులో నుంచి లేచి కాసేపు నడవండి. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడి, రక్తనాళాలు కుంచించుకుపోకుండా ఉంటాయి.

గోరువెచ్చని నీరు తాగండి: ఏసీలో ఉన్నప్పుడు దాహం తక్కువగా ఉంటుంది. కానీ డీహైడ్రేషన్ వల్ల కూడా బీపీ పెరిగే అవకాశం ఉంది. అందుకే గంటకోసారి గోరు వెచ్చని నీరు తాగడం మంచిది.

Also Read: డీప్ ఫ్రై చేయడానికి బెస్ట్ వంట నూనెలు ఇవే.. డాక్టర్లు సూచిస్తున్న 4 ఆప్షన్స్!

సీటు మార్చుకోండి: ఏసీ వెంట్ నేరుగా మీ తల మీద లేదా వెనక భాగంలో ఉండేలా చూసుకోకండి. అవసరమైతే సీటు మార్చమని అడగండి.

సరైన ఉష్ణోగ్రత ఎంత?
అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం.. పని ప్రదేశాల్లో ఉష్ణోగ్రత 24°C నుండి 25°C మధ్య ఉంటే అది మాన శరీరానికి సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది కరెంట్ ఆదా చేయడమే కాకుండా.. ఉద్యోగుల పనితీరును కూడా పెంచుతుంది.

ఏసీ ఇచ్చే సౌకర్యం మనల్ని రోగాల పాలు చేయకూడదు. ఆఫీసులో చలికి వణికిపోతూ పని చేయడం గొప్ప విషయం కాదు. అది మీ ఆరోగ్యానికి సంకేతం కూడా కాదు. మీ బీపీ స్థిరంగా ఉండాలంటే చల్లదనానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

Related News

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

ఉదయం ఫ్రెష్‌గా లేవాలంటే రాత్రి ఎప్పుడు పడుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు?

చాణక్య నీతి.. ఈ 6 సందర్భాల్లో మౌనంగా ఉండటమే తెలివైన నిర్ణయం

తెల్లని బట్లలు పాతబడి పసుపుపచ్చగా మారుతున్నాయా? మళ్లీ మెరిసిపోయే తెల్లదనం కోసం టిప్స్

ఫైనాన్షియల్ మాస్టర్స్.. ఈ 3 తేదీల్లో పుట్టినవారు ఏ బిజినెస్ చేసినా సూపర్‌హిట్

కడుపు బరువుగా అనిపిస్తుందా? భోజనం తర్వాత పైనాపిల్ తింటే చాలా ప్రయోజనాలు

నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? రోజూ ఈ వ్యాయామం చేస్తే మంచి గాఢనిద్ర మీ సొంతం

Zomatoలో ఈ టేస్టీ ఫుడ్స్ ఇక దొరకవ్..ఎందుకంటే ?

Big Stories

Advertisement
×