E-Paper
Advertisement

Health Tips: ప్రసవం తర్వాత మళ్లీ మునుపటిలా స్ట్రాంగ్‌ అవ్వాలా? అమ్మమ్మల కాలం నాటి ఆ లడ్డూ రహస్యం ఇదే!

Health Tips: ప్రసవం తర్వాత మళ్లీ మునుపటిలా స్ట్రాంగ్‌ అవ్వాలా? అమ్మమ్మల కాలం నాటి ఆ లడ్డూ రహస్యం ఇదే!
Advertisement

Health Tips: బిడ్డకు జన్మనివ్వడం అనేది స్త్రీ జీవితంలో ఒక పునర్జన్మ వంటిది. ప్రసవం తర్వాత తల్లి శరీరం చాలా బలహీనపడుతుంది. నిద్రలేని రాత్రులు, హార్మోన్ల మార్పులు, ఒళ్లు నొప్పులు, వీటికి తోడు మారుతున్న వాతావరణం వల్ల వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యలు కొత్త తల్లులను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈ సమయంలో తల్లికి కేవలం ఆహారం సరిపోదు.. శరీరానికి లోపలి నుండి వెచ్చదనాన్ని, పోషకాలను ఇచ్చే బలం కావాలి. అదే మన బామ్మల కాలం నాటి అద్భుతమైన పోషకాహారం ‘పంజీరీ లడ్డూ’. ఈ మ్యాజిక్ లడ్డూ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, తయారీ విధానం.. వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పంజీరీ లడ్డూ ప్రయోజనాలు:

⇒ ప్రసవం తర్వాత కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి, ఎముకల బలానికి, తల్లి పాలు పెరగడానికి ఇది ఎంతో సహాయపడుతుంది.

Advertisement

⇒ పంజీరీ లడ్డులోని డ్రై ఫ్రూట్స్, నెయ్యి శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చి చలికాలం వచ్చే ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి.

⇒ ఈ మ్యాజిక్ లడ్డూ జ్ఞాపకశక్తిని పెంచడంతో పాటు కంటి చూపు మెరుగుపడటానికి దోహదపడుతుంది.

Advertisement

⇒ ప్రతిరోజూ ఒక లడ్డూ తినడం వల్ల అలసట తగ్గి, రోజంతా ఉత్సాహంగా ఉండేలా ఉండవచ్చు.

⇒ ఈ పంజీరీ లడ్డులోని పోషకాలు తల్లితో పాటు బిడ్డకు కూడా ప్రయోజనం చేకూరేలా చేస్తుంది.

Also Read: కంటి ఆరోగ్యాన్ని కాపాడే నల్లని ఎండు ద్రాక్ష.. ఆ సూపర్ బెనిఫిట్స్ ఏంటో మీరూ తెలుసుకోండి!

కావాల్సిన పదార్థాలు:

గోధుమ పిండి – 2 కప్పులు
పెసర పప్పు పొడి – 1 కప్పు
నెయ్యి – 1 నుండి 1.5 కప్పులు
బెల్లం తురుము – రుచికి తగినట్లు
బాదం, జీడిపప్పు, పిస్ మిశ్రమం – అర కప్పు
మఖానా పొడి – 1 కప్పు
ఎండు కొబ్బరి తురుము – అర కప్పు
యాలకుల పొడి – 1 టీస్పూన్

తయారీ విధానం..

ముందుగా ఒక మందపాటి కడాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో గోధుమ పిండి, పెసర పప్పు పొడి వేసి సుమారు 45 నిమిషాల నుండి గంట పాటు సన్నని సెగపై దోరగా వేయించాలి. కమ్మని సువాసన వచ్చి, రంగు మారే వరకు కలుపుతూనే ఉండాలి. పిండి బాగా వేగాక.. దానిలో ముందుగానే వేయించి పొడి చేసుకున్న మఖానా, ఎండు కొబ్బరి తురుము, డ్రై ఫ్రూట్స్ ముక్కలను వేసి బాగా కలపాలి. స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని కాసేపు పక్కన పెట్టాలి.

మిశ్రమం కొంచెం చల్లారిన తర్వాతే బెల్లం తురుమును కలపాలి. బెల్లం, యాలకుల పొడి పిండిలో బాగా కలిసేలా కలిపి, మీకు నచ్చిన పరిమాణంలో లడ్డూలు చుట్టుకోవాలి. ఈ లడ్డూలను గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకుంటే నెల రోజుల పాటు తాజాగా ఉంటాయి. రోజూ ఉదయం లేదా రాత్రి పడుకునే ముందు ఒక లడ్డూ తింటే బాలింతల ఆరోగ్యానికి ఎంతో మంచిది.

Also Read: గర్భిణీలు నువ్వులు తింటే అబార్షన్ అవుతుందా? ఈ ఒక్క విషయం తెలిస్తే మీ భయం మొత్తం పోతుంది!

 

 

Related News

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

Big Stories

Advertisement
×