E-Paper
Advertisement

MSVPG Film: మన శంకర వరప్రసాద్ గారి ఇంటిని చూశారా? ఇంద్ర భవనమే.. హోమ్ టూర్ వీడియో వైరల్!

MSVPG Film: మన శంకర వరప్రసాద్ గారి ఇంటిని చూశారా? ఇంద్ర భవనమే.. హోమ్ టూర్ వీడియో వైరల్!
Advertisement

MSVPG film: చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మన శంకర్ వరప్రసాద్ గారు(MSVPG). ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. జనవరి 12వ తేదీ విడుదలైన ఈ సినిమా కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసి లాభాల బాటలో పయనిస్తోంది. ఇప్పటికే 200 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టడంతో చిత్ర బృందం అలాగే అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవికి ఇలాంటి సూపర్ హిట్ పడటంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇంటి సెట్ కోసం రూ.5 కోట్లు…

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక విషయం ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఏదైనా ఒక సినిమా చేయాలి అంటే ప్రత్యేకంగా ఆ కథకు అనుగుణంగా సెట్ వేస్తూ ఉంటారు. ఇక మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా కోసం కూడా అద్భుతమైన ఇంటిని సెట్ గా వేసినట్టు తెలుస్తోంది. ఈ ఇంటి సెట్ కోసం ఏకంగా ఐదు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినట్టు సమాచారం. ఇలా ఈ ఇంటి సెట్ కోసం ఉపయోగించిన వస్తువులన్నీ కూడా నిజమైన వస్తువులు కావడం విశేషం. ఈ ఇంటికి సంబంధించిన ఒక హోమ్ టూర్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఇంద్ర భవనం లాంటి సెట్ ..

Advertisement

ఈ వీడియో చూస్తుంటే మాత్రం కేవలం సినిమా కోసమే ఇంద్ర భవనం లాంటి సెట్ వేశారని స్పష్టమవుతుంది. ఎంతో అందంగా ఈ ఇంటి సెట్ ను తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మరోసారి ఈ చిత్ర బృందంపై ప్రశంసలు కురిపిస్తూ చాలా అద్భుతంగా సెట్ వేశారంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో మేజర్ పార్ట్ షూటింగ్ మొత్తం ఈ హౌస్ లోనే జరగడంతో రియల్ ప్రాపర్టీస్ ఉపయోగించి ఈ హౌస్ ఏర్పాటు చేశారని తెలుస్తోంది. వెంకటేష్, చిరంజీవి మధ్య వచ్చే సన్నివేశాలతో పాటు మీసాల పిల్ల అనే పాటను కూడా ఇక్కడే చిత్రీకరించారు.

Advertisement

ఇలా సినిమాలో ఎక్కువ శాతం షూటింగ్ ఈ ఇంటిలోనే జరిగిందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో చిరంజీవికి జోడిగా నయనతార నటించారు. అలాగే విక్టరీ వెంకటేష్ సైతం ఈ సినిమాలో క్యామియో పాత్రలో నటించిన సంగతి తెలిసిందే . ఇలా వెంకటేష్ ఈ సినిమాలో నటించడం సినిమాకు మరింత ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకొని వారం రోజులలోనే 290 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి ఆల్ టైం రికార్డును సాధించింది.

Also Read : Eesha Rebba: స్ట్రెస్ ఎక్కువంటే తాగుతాను.. ఆల్కహాల్ అలవాటుపై హీరోయిన్ ఓపెన్ కామెంట్స్

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×