E-Paper
Advertisement

Dream Jobs: ఉద్యోగం కంటే స్వేచ్ఛ ముఖ్యమా ? కార్పొరేట్ లైఫ్‌ను వదిలేసి, సంతోషాన్ని వెతుక్కుంటున్న యువత

Dream Jobs: ఉద్యోగం కంటే స్వేచ్ఛ ముఖ్యమా ? కార్పొరేట్ లైఫ్‌ను వదిలేసి, సంతోషాన్ని వెతుక్కుంటున్న యువత
Advertisement

Dream Jobs: మన జీవితంలో “డ్రీమ్ జాబ్ ” అనేది ఒక ఉన్నతమైన లక్ష్యం. ఆ స్థానాన్ని చేరుకోవడానికి సంవత్సరాల తరబడి శ్రమించి, కష్టపడతాం. అయితే.. ఇటీవల కాలంలో యువత, అనుభవజ్ఞులైన నిపుణుల్లో ఒక కొత్త ధోరణి కనిపిస్తోంది. తమ కలల ఉద్యోగంలో చేరిన తర్వాత, దాన్ని వదిలేస్తున్నారట. ప్రత్యేకంగా అమెరికా, యూరప్ వంటి అభివృద్ధి చెందిన దేశాలలోని కార్పొరేట్ రంగంలో ఈ ట్రెండ్ బాగా పెరిగింది. ఒక ఉద్యోగి, ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా.. లేదా సరైన వివరణ ఇవ్వకుండా అకస్మాత్తుగా ఉద్యోగాన్ని వదిలివేయడాన్ని, లేదా ఇంటర్వ్యూలలో పాల్గొని ఆఫర్ పొందిన తర్వాత స్పందించకపోవడాన్ని జాబ్ ఘోస్టింగ్ అంటారు. ఎంతో కష్టపడి సాధించుకున్న కలల ఉద్యోగాలను యువత ఎందుకు వదులుకుంటున్నారు ? దీనికి గల కారణాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఉద్యోగాలను వదిలేయడానికి గల ప్రధాన కారణాలు:

Advertisement

1. బర్న్‌అవుట్, మానసిక ఆరోగ్యం:
అధిక జీతాలు, ప్రతిష్ట ఉన్న కంపెనీల్లో ఉద్యోగం అంటే దానికి తగ్గట్టుగా పని ఒత్తిడి, ఎక్కువ గంటలు పనిచేయాల్సి ఉంటుంది. డ్రీమ్ జాబ్ పొందిన తర్వాత, ఉద్యోగులు ఆశించిన దాని కంటే ఎక్కువ ఒత్తిడిని అనుభవిస్తున్నారు. ఈ తీవ్రమైన ‘బర్న్‌అవుట్’ కారణంగా.. డబ్బు కంటే మానసిక ఆరోగ్యం ముఖ్యమని భావించి, వారు ఆ జాబ్ వదిలేస్తున్నారు.

2. వ్యక్తిగత విలువలు:
కంపెనీలో చేరేముందు ఆ సంస్థ యొక్క లక్ష్యాలు, సంస్కృతి గొప్పగా ఉంటాయని ఊహించుకుంటారు. కానీ.. ఆచరణలో కంపెనీ విలువలు, నైతిక ప్రమాణాలు లేదా ఉద్యోగుల పట్ల వారి వైఖరి సరిగా లేకపోతే.. తాము భావించిన ‘కల’ వాస్తవంలో బాగా లేదని గ్రహించి, వెంటనే జాబ్ వదిలేస్తున్నారు.

Advertisement

3. మెరుగైన అవకాశాలు, ఫ్లెక్సిబిలిటీ:
అనుకున్న ఉద్యోగం నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణాలలో ఒకటి, ఆ ఉద్యోగం అందించని మెరుగైన వర్క్-లైఫ్ బ్యాలెన్స్, ఫ్లెక్సిబిలిటీ మరొక కంపెనీలో లభించడం. రిమోట్ వర్క్, ఎక్కువ సెలవులు, లేదా తమ అభిరుచులకు ప్రాధాన్యతనిచ్చే ఉద్యోగాలు దొరికినప్పుడు, పాత ఉద్యోగాన్ని వదులుకోవడానికి కూడా యువత వెనుకాడటం లేదు.

Also Read: మోడ్రన్ ప్రేమాయణం..పెళ్లి కాకుండా కలిసి జీవించడం ఎంతవరకు సేఫ్?

4. సొంత ఇష్టాలు:
కొంతమంది ఉద్యోగులు ఆ స్థాయిని చేరుకున్న తర్వాత, తాము నిజంగా దేని కోసం ప్రయత్నించామో.. అది తమకు సంతృప్తిని ఇవ్వడం లేదని గ్రహిస్తారు. జీవితంలో డబ్బు లేదా పదవి కంటే తమ అభిరుచి లేదా స్వయం ఉపాధి ముఖ్యమని తెలుసుకుని, సాహసోపేతంగా ఆ ఉద్యోగాన్ని వదిలేసి కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు.

వెనక్కి తిరిగి చూడకపోవడానికి కారణం:
ఈ ఉద్యోగులు తమ నిర్ణయం గురించి బాధపడకుండా ఉండటానికి కారణం. వారి కొత్త మార్గాలు వారికి స్వేచ్ఛ, మానసిక సంతృప్తి, వారి జీవితంపై పూర్తి నియంత్రణను ఇవ్వడమే. ఆర్థిక భద్రత కంటే వ్యక్తిగత స్వేచ్ఛ ముఖ్యమనే భావన వారిని ముందుకు నడిపిస్తోంది.

Related News

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

Big Stories

Advertisement
×