E-Paper
Advertisement

PMFME Scheme: గ్రామీణ యువతకు గుడ్ న్యూస్.. మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు రూ.15 లక్షల వరకు సబ్సిడీ

PMFME Scheme: గ్రామీణ యువతకు గుడ్ న్యూస్.. మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు రూ.15 లక్షల వరకు సబ్సిడీ
Advertisement

PMFME Scheme: కేంద్ర ప్రభుత్వం గ్రామీణ యువత స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు అద్భుతమైన స్కీమ్ ను అమలు చేస్తుంది. ప్రధాన మంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల పథకం(పీఎంఎఫ్ఎంఈ) కింద ఆహార ప్రాసెసింగ్ యూనిట్లకు రూ.15 లక్షల వరకు సబ్సిడీ అందిస్తున్నారు. జూన్ 29, 2020న కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పీఎంఎఫ్ఎంఈ స్కీమ్ ను ప్రారంభించింది. ఈ పథకంలో చిన్న తరహా సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి, అభివృద్ధికి కేంద్రం ఊతం అందిస్తుంది.

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ముఖ్యంగా అసంఘటిత రంగంలోని సంస్థల మధ్య పోటీతత్వాన్ని పెంచేందుకు, ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. రైతు ఉత్పత్తి సంస్థలు, స్వయం సహాయక బృందాలు(డ్వాక్రా గ్రూపులు), సహకార సంస్థలకు ఈ పథకం ద్వారా సబ్సిడీతో భారీ రుణాలు ఇస్తున్నారు.

ఈ పథకం ముఖ్య ఉద్దేశం

Advertisement

1. మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలు, రైతు సహకార సంస్థలు, స్వయం సహాయక బృందాలు, సహకార సంస్థలకు రుణాలు కల్పించడం
2. బ్రాండింగ్ & మార్కెటింగ్‌ను సపోర్ట్ చేస్తూ చైన్ సిస్టమ్ తో ఏకీకరణ
3. ఇప్పటికే ఉన్న 2,00,000 సంస్థలను ఒకే గొడుగు కింద తీసుకురావడం
4. సాధారణ ప్రాసెసింగ్ సౌకర్యాలు, ల్యాబ్ లు, నిల్వ, ప్యాకేజింగ్, మార్కెటింగ్, ఇంక్యుబేషన్ వంటి సాధారణ సేవలు కల్పించడం
5. ఆహార ప్రాసెసింగ్ సంస్థల సిబ్బందికి శిక్షణ ఇచ్చి స్కిల్స్ పెంచడం
6. వృత్తిపరమైన, సాంకేతిక మద్దతుకు కల్పించడం

2020-21 నుండి 2024-25 వరకు ఐదు సంవత్సరాలలో రూ.10,000 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో భరిస్తాయి. ఈ పథకం కింద 2 లక్షల సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లకు సబ్సిడీలతో రుణ సదుపాయం అందిస్తున్నారు.

Advertisement

కొత్త యూనిట్ / అప్‌గ్రాడేషన్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహాయం అందిస్తాయి. ఇందులో 35% వరకు సబ్సిడీ (₹15 లక్షల వరకు) లభిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ యువత, చిన్న, మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, వ్యక్తులు, డ్వాక్రా గ్రూపులు, రైతు ఉత్పత్తి గ్రూపులు, సహకార గ్రూపులకు రుణ సదుపాయం కల్పిస్తారు.

పీఎంఎఫ్ఎంఈ పథకం దరఖాస్తుకు అవసరమైన డాక్యుమెంట్లు

  • ఆధార్ కార్డు
  • బ్యాంక్ పాస్‌బుక్
  • ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వివరాలు
  • ప్రాజెక్ట్ రిపోర్ట్
  • ఫొటోలు, ఇతర వివరాలు

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×