E-Paper
Advertisement

IAF: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 340 ఉద్యోగాలు.. ఇంటర్, డిగ్రీ పాసైతే అప్లై చేసుకోవచ్చు, డోంట్ మిస్

IAF: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 340 ఉద్యోగాలు.. ఇంటర్, డిగ్రీ పాసైతే అప్లై చేసుకోవచ్చు, డోంట్ మిస్
Advertisement

IAF: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. ఇంటర్ లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నెలకు ప్రారంభ వేతనమే రూ.రూ.56,100 ఉంటుంది. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం, వయస్సు, పోస్టులు – వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

వాయుసేనలో ఉన్నత ఉద్యోగాలకు ఉద్దేశించిన ఎయిర్‌ఫోర్స్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (ఏఎఫ్‌ క్యాట్‌ – 01/2026)కు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. ప్రతి ఆరు నెలలకూ ఏఎఫ్‌ క్యాట్‌ ప్రకటన విడుదల అవుతుంది. ఎంప్లాయిమెంట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం.. కోర్సు జనవరి 2027లో ప్రారంభం అవ్వనుంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్‌ 17 నుంచి డిసెంబర్‌ 14 తేదీల్లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. 2026 జనవరి 31న ఏఎఫ్‌క్యాట్‌ పరీక్ష జరగనుంది.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 340

ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్‌ క్యాట్‌) 01/ 2026, ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

Advertisement

 ఏఎఫ్‌క్యాట్‌ ఎంట్రీ: ఫ్లయింగ్/ గ్రౌండ్‌ డ్యూటీ (టెక్నికల్‌)/ గ్రౌండ్‌ డ్యూటీ (నాన్‌- టెక్నికల్‌)
 ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ: ఫ్లయింగ్

విద్యార్హత: ఫ్లయింగ్‌ బ్రాంచ్, ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ పోస్టులకు 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. ఇంటర్‌/ప్లస్‌ 2లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ల్లో 50 శాతం చొప్పున మార్కులు తప్పనిసరి వచ్చి ఉండాలి. ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ విభాగం పోస్టులకు ఎన్‌సీసీ సీనియర్‌ డివిజన్‌ సి సర్టిఫికెట్‌ ఉండాలి.

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 నవంబర్ 17

దరఖాస్తుకు చివరి తేది: 2025  డిసెంబర్ 14

ఎగ్జామ్ తేదిం 2026 జనవరి 31

గ్రౌండ్ డ్యూటీ – టెక్నికల్ బ్రాంచ్ లో ఏరోనాటిక్ ఇంజినీర్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.  సంబంధిత లేదా అనుబంధ బ్రాంచీల్లో 60 శాతం మార్కులతో బీటెక్‌/బీఈ ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులవుతారు. ఇంటర్‌/+2లో ఫిజిక్స్, మ్యాథ్స్‌ల్లో 50 శాతం మార్కులు తప్పనిసరి ఉండాలి

గ్రౌండ్‌ డ్యూటీ – నాన్‌ టెక్నికల్‌ బ్రాంచ్‌ లో విపన్‌ సిస్టం, అడ్మినిస్ట్రేషన్, లాజిస్టిక్స్, అకౌంట్స్, ఎడ్యుకేషన్, మీటీయరాలజీ విభాగాల్లో పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. ఇంటర్‌ మ్యాథ్స్, ఫిజిక్స్‌ల్లో 50 శాతం మార్కులతోపాటు ఏదైనా డిగ్రీలో 60 శాతం మార్కులతో పాసై ఉండాలి.

వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు. 2027 జనవరి 1 నాటికి ప్లయింగ్ బ్రాంచ్ ఉద్యోగాలకు 20 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్/ నాన్ టెక్నికల్) బ్రాంచ్ ఉద్యోగాలకు 20 నుంచి 26 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.56,100 నుంచి రూ. 1,77,500 జీతం ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.550 ఫీజు ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: ఉద్యోగాన్ని బట్టి ఆన్ లైన్ ఎగ్జామ్, స్టేజ్ -1, స్టేజ్-2  పరీక్షలు, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించి శిక్షణకు ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

నోటిఫికేషన్ కీలక సమాచారం: 

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 340

దరఖాస్తుకు చివరి తేది: డిసెంబర్ 14

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×