E-Paper
Advertisement

Health Tips: ఈ సమస్యలు ఉన్నవారు యాపిల్ పండు అస్సలు తినకూడదు.. ఎందుకంటే ?

Health Tips: ఈ సమస్యలు ఉన్నవారు యాపిల్ పండు అస్సలు తినకూడదు.. ఎందుకంటే ?
Advertisement

Health Tips: యాపిల్ పండు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ప్రతీ రోజు ఉదయాన్నే ఒక్క యాపిల్ పండు తింటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను నివారించవచ్చని నిపుణులు చెబుతుంటారు. అంతేకాదు శరీరంలోని అనేక కణాల అభివృద్ధికి కూడా యాపిల్ పండు తోడ్పడుతుంది. అయితే ఇందులో ఉండే మూలకాలు ముఖ్యంగా పొటాషియం, ఫైబర్ వంటివి శరీరానికి అంది చాలా రకాల జీర్ణ సమస్యలను నివారించేందుకు సహయపడతాయి. మరోవైపు యాపిల్ పండులో పెక్టిన్ వంటి ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. అందువల్ల తరచూ యాపిల్ పండును తీసుకోవడం వల్ల మధుమేహం, రక్తపోటు, గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించవచ్చు. ఇక అనేక వ్యాధులను కూడా క్షీణింపజేందుకు యాపిల్ పండు ఎంతో తోడ్పడుతుంది.

అయితే ఎన్ని పోషక గుణాలు కలిగి ఉన్నా కూడా కొన్ని పండ్లు కానీ, కూరగాయలు కానీ అందరి ఆరోగ్యానికి మంచివి కాదు. కొన్ని రకాల సమస్యలతో బాధపడుతున్న సమయంలో కొన్ని రకాల పండ్లను తీసుకుంటే అవి అనారోగ్యానికి దారి తీస్తాయి. అందులో ప్రస్తుతం యాపిల్ పండును కూడా కొన్ని సమస్యలతో బాధపడేవారు తీసుకోవడం మూలంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. యాపిల్ పండును ఎప్పుడో ఒకసారి తీసుకోవడం వల్ల మంచిదే కానీ. క్రమం తప్పకుండా యాపిల్ పండు తినడం వల్ల ఆరోగ్యం క్షీణించే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. అయితే ఆ సమస్యలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

 

మధుమేహం :

Advertisement

షుగర్ పేషెంట్లు యాపిల్ పండును అస్సలు తినకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. యాపిల్ లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల యాపిల్ పండును తీసుకుంటే రక్తంలోని చక్కెర స్థాయిలను పెంచే అవకాశం ఉంటుంది.

ఊబకాయం :

అధిక బరువు వంటి సమస్యతో బాధపడే వారు కూడా యాపిల్ పండును తీసుకోవడం మంచిది కాదు. యాపిల్ పండులో కేలరీలు, చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల యాపిల్ పండును అస్సలు తీసుకోకూడదు.

జీర్ణక్రియ :

యాపిల్ లో ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల జీర్ణక్రియ వ్యవస్థకు చాలా మేలు చేస్తుందని అనుకుంటారు. కానీ యాపిల్ పండు జీర్ణ సంబంధింత సమస్యలకు దారి తీస్తుంది. కడుపు నొప్పి, తిమ్మిరి, గ్యాస్ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

అలర్జీ :

అలర్జీలు వంటి సమస్యలు ఉన్నవారు యాపిల్ పండును తీసుకోవడం అస్సలు మంచిది కాదు. యాపిల్ చర్మంపై దురద, వాపులు, దద్దుర్లు వంటి సమస్యలు కనిపిస్తే తినడం మానేయాలి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

Big Stories

Advertisement
×