BigTV English

 Personal Loan: నిరుద్యోగులకు కూడా పర్సనల్ రుణాలు.. ఎలా పొందవచ్చంటే?

 Personal Loan: నిరుద్యోగులకు కూడా పర్సనల్ రుణాలు.. ఎలా పొందవచ్చంటే?

Personal Loan While Unemployed: ఆర్థిక అవసరాల కోసం బ్యాంకుల్లో లోన్ తీసుకోవడం సహజమే. అప్పు తీసుకోవడంతో అనవసర భారం పడుతుంది. ఇది ఆదాయ వనరులపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అయితే ఉద్యోగులకు, వ్యాపారస్తులు ఏ బ్యాంకులైన రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. కానీ నిరుద్యోగులకు లేదా ఉద్యోగం కోల్పోయిన వ్యక్తులు రుణాలు పొందేందుకు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అయితే నిరుద్యోగులు కూడా రుణాలు పొందేందుకు అవకాశం ఉంటుంది.


పర్సనల్ లోన్ ఇచ్చే లెండర్లు తమ డబ్బును తిరిగి పొందుతారు. ఉద్యోగస్తులు రుణాలు ఇచ్చిన సంస్థలకు నెలవారీగా ఈఎంఐ తదితర రూపాల్లో చెల్లిస్తారనే నమ్మకంతో ఇస్తుంది. అయితే నిరుద్యోగులకు రుణాలు ఇచ్చేందుకు స్థిర ఆదాయం ఉన్న మిత్రులను లేదా కుటుంబ సభ్యులను గ్యారంటీగా పెట్టుకొని ఇస్తుంది. దీంతో నిరుద్యోగులు కూడా రుణాలు పొందేందుకు అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం బ్యాంకులు వివిధ రకాల రుణాలు ఇస్తున్నాయి. ముఖ్యంగా కారు, ఆభరణాలు, ఆస్తులను తనఖా పెట్టుకుని తక్కువ వడ్డీ రేట్లకు పర్సనల్ రుణాలు అందజేస్తున్నాయి. అయితే ఇటీవల కారుపై పర్సనల్ లోన్ ఇచ్చే ట్రెండ్ విపరీతంగా పెరిగింది. బ్యాంకులు మీ కారు బీమా పేపర్‌పై రాసిన ఐడీవీ కంటే ఒకటిన్నర రెట్లు వరకు అధిక రుణాలు అందిస్తున్నాయి. ఇలా నిరుద్యోగులు కూడా రుణాలు పొందేందుకు అవకాశం ఇచ్చింది. అయితే నెలవారీగా ఈఎంఐ చెల్లిస్తూ రుణాలను పూర్తిచేయాల్సి ఉంటుంది.


నిరుద్యోగులు పర్సనల్ లోన్ తీసుకునేందుకు మరో అవకాశం కూడా ఉంది. స్థిర ఆదాయం ఉన్న స్నేహితుడిని గ్యారెంటర్‌గా చేస్తే సులువుగా లోన్ పొందవచ్చు. అతనితో పాటు మీరు కూడా దరఖాస్తు చేస్తే తప్పనిసరిగా రుణాలు ఇచ్చందుకు బ్యాంకులు ముందుకొస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో డిఫాల్ట్ చేసిన సమక్షంలో హామీదారుడు లేదా తోటి దరఖాస్తుదారుడు ఈఎంఐతోపాటు లోన్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా ట్రస్ట్ పై బ్యాంకుల నుంచి పర్సనల్ లోన్ పొందవచ్చు.

నిరుద్యోగులకు రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వ పథకాలు కూడా ఉన్నాయి. నిరుద్యోగ శాతం పెరుగుతున్న సమయంలో అందరికీ ఉపాధి కల్పించాలనే ఉద్ధేశంతో ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇటీవల తీసుకొచ్చిన ముద్రా లోన్ స్కీమ్ ప్రధాన ఉద్దేశం.. నిరుద్యోగులకు లోన్ అందించి వ్యాపారపరంగా అభివృద్ధి చేయడమే. ఈ పథకం కింద ఓ వ్యక్తి రూ.50 వేల నుంచి రూ.50 లక్షల వరకు రుణాలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.

Also Read: బంగారం కొంటున్నారా..? తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే!

ఇదిలా ఉండగా, రుణాల విషయంలో బ్యాంకుల నియామాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అధిక క్రెడిట్ స్కోర్, తక్కువ లోన్ ఇవ్వడం వంటి విషయాలను పరిశీలించాలని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సార్లు నియమ నిబంధనలు పాటించకపోతే అధిక వడ్డీ రేట్లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో కొంతమందికి వెసులుబాటు అవకాశం కల్పిస్తుంది.

Related News

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Big Stories

×