E-Paper
Advertisement

White Hair Tips: ఈ చిన్న చిట్కా.. మీ తెల్లజుట్టును శాశ్వతంగా నల్లగా మార్చేస్తుంది తెలుసా?

White Hair Tips: ఈ చిన్న చిట్కా.. మీ తెల్లజుట్టును శాశ్వతంగా నల్లగా మార్చేస్తుంది తెలుసా?
Advertisement

White Hair Tips: సాధారణంగా వయసుపైబడే కొంది తెల్లజుట్టు వస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో చిన్న వయసులోనే ప్రతి ఒక్కరికి తెల్లజుట్టు రావడం కామన్ అయిపోయింది. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. ప్రధానంగా కొంత మందికి జీన్స్ పరంగా వస్తుంది. మరికొంత మందికి జన్యు లోపం వల్ల కానీ, ప్రతిరోజు డైట్‌లో సరైన ఆహారం తీసుకోకపోవడం, ఎక్కువగా స్ట్రెస్‌కి గురికావడం, బయట కాలుష్యం వల్ల తెల్లజుట్టు సమస్య వేధిస్తోంది. కాబట్టి ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వారంటే.. వైట్ హెయిర్ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆవాల నూనె, పసుపు హెయిర్ మాస్క్
ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో కప్పు మస్టర్డ్ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ పసుపు వేసి.. బాగా చిక్కగా అయ్యేంత వరకు మరిగించండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరె గిన్నెలోకి తీసుకుని అందులో విటమిన్ ఇ క్యాప్సూల్స్ కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు కుదుళ్లకు పెట్టుకుని అరగంట తర్వాత తలస్నానం చెయ్యండి. మంచి ఫలితం ఉంటుంది. ఇలా వారానికి ఒకసారి చేస్తే.. తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.

Advertisement

పెరుగు, కాఫీ, తేనె హెయిర్ మాస్క్
చిన్న బౌల్ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ పెరుగు, రెండు టేబుల్ స్పూన్ కాఫీ పొడి, తేనె కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పెట్టుకుని గంట తర్వాత తలస్నానం చెయ్యండి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. కాఫీ పొడిలో జుట్టు నల్లగా మార్చే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇలా క్రమం తప్పకుండా వాడితే తెల్లజుట్టును నల్లగా మార్చడంతో పాటు జుట్టు చాలా సిల్కీగా మారుతుంది.

కొబ్బరి నూనె, గోరింటాకు పొడి, విటమిన్ ఇ క్యాప్సూల్స్
ముందుగా చిన్న బౌల్ తీసుకుని అందులో గోరింటాకు పొడి, కొబ్బరి నూనె, విటమిన్ ఇ క్యాప్సూల్స్ కలిపి జుట్టుకు పెట్టుకుని అరగంట తర్వాత తలస్నానం చెయ్యండి. ఇలా నెలకు ఒకసారి చేస్తే సరిపోతుంది. క్రమంగా తెల్లజుట్టు సమస్యలు తొలగిపోతాయి.

Advertisement

Also Read: పొడవాటి జుట్టు కోసం.. ఈ వంటింటి చిట్కాను తప్పకుండా ప్రయత్నించండి

గోరింటాకు పొడి, మెంతులు, బ్లాక్ సీడ్స్ హెయిర్ మాస్క్
ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని అందులో గ్లాస్ వాటర్, టీ పొడి టీస్పూన్, మెంతులు, బ్లాక్ సీడ్స్ వేసి బాగా 10 నిమిషాలపాటు మరిగించండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరే గిన్నెలోకి వడకట్టుకుని అందులో గోరింటాకు పొడి కలిపి మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు అప్లై చేసి గంట తర్వాత తలస్నానం చెయ్యండి. ఇలా నెలకు రెండు సార్లు చేస్తే మంచి రిజల్ట్ మీకు కనిపిస్తాయి. తెల్లజుట్టు శాశ్వతంగా నల్లగా మారుతుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

 

Related News

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

ఈ 3 అలవాట్లే మంచి మనుషుల బలహీనతలు.. మీరూ ఇవే తప్పులు చేస్తున్నారా?

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

Big Stories

Advertisement
×