Fast Hair Growth: జుట్టు చాలా అందంగా, పొడవుగా, ఒత్తుగా పెరగాలని ఏ అమ్మాయికి ఉండదు చెప్పండి. ప్రస్తుత రోజుల్లో పొడవాటి జుట్టు అతి కొద్దిమందిలో మాత్రమే కనిపిస్తుంది. అయితే చాలా మంది జుట్టు పెరగడం అనేది జీన్స్ మీద ఆధారపడి ఉంటుందని అంటుంటారు కానీ.. కొన్ని కారణాల వల్ల హెయిర్ ఫాల్ అవుతుంటుంది. ఇందుకు బయట కాలుష్యం, ఈ సమ్మర్‌లో వచ్చే చెమట వల్ల కూడా జుట్టు ఊడిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే వారంలో కనీసం మూడు సార్లు అయిన తలస్నానం చెయ్యాల్సిందే.. తక్కువ గాఢత ఉన్న షాంపులు వాడితే మంచిది. జుట్టు ఊడిపోవడానికి ప్రధాన కారణం ఒత్తిడి, మనసు ప్రశాంతంగా లేకపోవడం వల్ల జుట్టు రాలిపోయే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
దీంతో పాటు సరైన పోషకాహారం తీసుకోవాలి. ముఖ్యంగా ఆకు కూరలు, పండ్లు తీసుకోవాలి. అయితే చాలా మంది హెయిర్ ఫాల్‌ను ఆపేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. బయట మార్కెట్లో సీరమ్‌లు, షాంపులు, ఆయిల్స్‌ను యూజ్ చేస్తుంటారు. వీటివల్ల ఫలితం ఉంటుందో లేదో పక్కన పెడితే.. అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంట్లోనే దొరికే నాచురల్ పదార్ధాలతో హెయిర్ ఆయిల్ తయారు చేసుకున్నారంటే.. మంచి రిజల్ట్ మీకు కనిపిస్తాయి . ఇందుకు ఆవాల నూనె అద్భుతంగా పనిచేస్తుంది. ఆవాల నూనెలో కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, కనిజాలు, ఒమేగా 6 ఫాటీ యాసిడ్స్ అధికంగా ఉన్నాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. చుండ్రు సమస్యలు తొలగిపోతాయి. మరి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
☀ కావాల్సిన పదార్ధాలు
⦿ ఆవాల నూనె
⦿ ఉసిరి కాయలు
⦿ కరివేపాకు
⦿ భృంగరాజ్ ఆకులు
⦿ కలబంద
⦿ మెంతులు
⦿ మందారం పువ్వులు
⦿ మందారం ఆకులు
⦿ బ్లాక్ సీడ్స్
☀ తయారు చేసుకునే విధానం
ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని.. అందులో కావాల్సినంత ఆవాల నూనె, మందారం పువ్వులు, మందారం ఆకులు, కరివేపాకు, భృంగరాజ్ ఆకులు, కలబంద ముక్కలు, ఉసిరి ముక్కలు, కప్పు మెంతులు, అరకప్పు బ్లాక్ సీడ్స్ కలిపి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మరిగించండి. ఆ తర్వాత స్టవ్ కట్టేసి గాజు సీసాలోకి వడకట్టుకోండి. ఈ హెయిర్ ఆయిల్‌ను ప్రతిరోజు జుట్టుకు అప్లై చేసుకోవచ్చు. లేదా పడుకునే ముందు జుట్టుకు పెట్టుకుని మరుసటి రోజు సాధారణ షాంపూతో తలస్నానం చెయ్యండి.
ఇలా క్రమం తప్పకుండా చేస్తే.. మంచి ఫలితం ఉంటుంది. జుట్టు పొడవుగా ఒత్తుగా పెరగడంతో పాటు.. తెల్లజుట్టు సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇందులో ఉపయోగించే పదార్ధాల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు.
Also Read: జుట్టు ఆరోగ్యంగా నల్లగా ఎదగాలంటే కలబంద, కర్పూరం కలిపి ఇలా చేయండి
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.