E-Paper
Advertisement

Plastic Bottles: ఇంకా ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగుతున్నారా?.. ప్రమాదం పొంచి ఉందంటున్న నిపుణులు!

Plastic Bottles: ఇంకా ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగుతున్నారా?.. ప్రమాదం పొంచి ఉందంటున్న నిపుణులు!
Advertisement

Plastic Bottles: చాలామంది చేసే సాధారణ పొరపాటు ఏమిటంటే.. ఇంట్లో నుంచి బయటికి వెళ్లినప్పుడు మంచి నీళ్లు క్యారీ చేకలేకపోవడం. దీంతో బయట దొరికే ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల నీటినే ఎక్కువగా తాగుతుంటారు. ఇలాంటి అలవాటు ఎప్పుడో ఒకసారి అయితే ఫర్లేదు కానీ.. అస్తమానం ఇలా చేస్తుంటే మాత్రం తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మన రోజువారీ జీవితంలో ఎక్కువ శాతం హడావిడిగానే గడుస్తుంటుంది. ఈ క్రమంలో ప్లాస్టిక్ ప్యాక్ చేసిన నీటి సీసాల్లో నీళ్లు తాగుతుంటాం. ఇంకొందరు పాత ప్లాస్టిక్ సీసాలను కడిగి మళ్లీ మళ్లీ వాడుతుంటారు. ఈ అలవాటు వల్ల మన ఆరోగ్యమే కాదు.. చుట్టూ ఉన్న పర్యావరణం కూడా దెబ్బతింటుంది. పాత ప్లాస్టిక్ బాటిళ్లను తరచుగా వాడటం వల్ల కొన్నిసార్లు ప్రాణాలకే ముప్పు కలగవచ్చని చెబుతున్నారు నిపుణులు.

పాత బాటిళ్లతోనే ప్రమాదం:

చాలామంది పాత ప్లాస్టిక్ బాటిళ్లను కడిగి తిరిగి వాడతారు. ముఖ్యంగా ఇలాంటి అలవాటునే వైద్య నిపుణులు మానేయాలని హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ బాటిల్స్ అరిగే ప్రక్రియలో.. మైక్రోప్లాస్టిక్‌లను నీటిలోకి విడుదల చేస్తాయి. దీంతో అవి శరీరంలోకి చేరి, అనేక అనారోగ్య సమస్యలను మనకు పరిచయం చేస్తాయి. కాబట్టి.. ప్లాస్టిక్ బాటిల్స్‌ను మళ్లీ మళ్లీ వాడొద్దని సూచిస్తున్నారు.

Advertisement

Read Also: రెగ్యులర్‌గా బ్లాక్ ఫుడ్స్ తీసుకుంటే.. ఎలాంటి రోగాలైనా పారిపోవాల్సిందే!

మైక్రోప్లాస్టిక్‌లు ఎలా ఏర్పడతాయి? 

పాత ప్లాస్టిక్ వస్తువులు.. అరిగిపోతున్న ప్లాస్టిక్ బాటిళ్లు, దుస్తుల నుండి విడిపోయే మైక్రోఫైబర్లు.. ఇలాంటివి మైక్రోప్లాస్టిక్‌ల ప్రధాన మూలాలుగా ఉన్నాయి. అంతేకాకుండా.. సముద్రాలు, నదులు, నేల, గాలి మొత్తం మైక్రోప్లాస్టిక్‌తో కలుషితం అవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం:

Advertisement

కొన్ని అంతర్జాతీయ పరిశోధనల ప్రకారం.. ప్లాస్టిక్ బాటిల్ వాటర్‌లో పెద్ద మొత్తంలో మైక్రోప్లాస్టిక్‌లు ఉన్నాయని తెలిపారు. ఈ మైక్రోప్లాస్టిక్‌లు మన శరీరంలోకి ప్రవేశిస్తే వాపు, యాంటీఆక్సిడెంట్ల మధ్య సమతుల్యత లోపించడం, హానికర రసాయనాలు మన శరీరంలోకి వెళ్లడం వంటి తీవ్ర సమస్యలకు దారితీస్తాయని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు.

చిన్న ప్రయత్నాలు-పెద్ద మార్పు:

నేటి ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే.. ప్లాస్టిక్ బాటిళ్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించి, స్టీల్, గాజు, హానికరమైన రసాయనం లేని ప్లాస్టిక్ సీసాలను వాడాలి. అలాగే వడపోసిన లేదా శుద్ధి చేసిన నీటిని తాగడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా మన ఆరోగ్యమే కాక, పర్యావరణ కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Read Also: ‘చికిరి’ స్టెప్పులేస్తే.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా? డైలీ చేస్తే..

Related News

ఆటిజం ఉన్న పిల్లలకు ఏకాగ్రత మెరుగుపరిచే టెక్నిక్.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు

ఆన్‌లైన్‌లో యువతితో ప్రేమ.. ప్రియురాలిని కలవడానికి 1900 కిమీ ప్రయాణం.. ఏఐ దెబ్బకు మైండ్ బ్లాక్

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×