E-Paper
Advertisement

Black Foods: రెగ్యులర్‌గా బ్లాక్ ఫుడ్స్ తీసుకుంటే.. ఎలాంటి రోగాలైనా పారిపోవాల్సిందే!

Black Foods: రెగ్యులర్‌గా బ్లాక్ ఫుడ్స్ తీసుకుంటే.. ఎలాంటి రోగాలైనా పారిపోవాల్సిందే!
Advertisement

Black Foods: సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలంటే తాజా పండ్లు, కూరగాయలే కాదు.. ఎక్కువ పోషకాలు కలిగిన నల్లని ఆహార పదార్థాలను కూడా మన రోజూవారీ డైట్‌లో భాగం చేసుకోవాలి. అప్పుడు మన శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందుతాయి. సాధారణంగా బ్లాక్‌ ఫుడ్స్‌ అనగానే.. చాలామంది నలుపు రంగులో ఉంటాయంటూ మొహం చిట్లించుకుంటారు. అయితే ఆంథోసియనిన్‌ అనే పిగ్మెంట్లు ఉన్న పదార్థాలను బ్లాక్ ఫుడ్స్‌గా పరిగణిస్తారు. ఈ పిగ్మెంట్లు నలుపు, నీలం, ఊదారంగు పదార్థాల్లో ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. ఈ బ్లాక్ ఫుడ్స్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు ఎలాంటి రోగాలపైనా సమర్థంగా పోరాడే శక్తిని మన శరీరానికి అందిస్తాయి.

కంటి ఆరోగ్యానికి నల్ల బియ్యం:

మనం రోజూ తీసుకునే బియ్యంలా కాకుండా నల్ల బియ్యం తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. నల్ల బియ్యంలో ఉండే ల్యూటిన్‌, జియాంథిన్‌ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే ఈ ధాన్యం ద్వారా లభించే పుష్కలమైన ఫైబర్‌, యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్‌తో పోరాడే శక్తిని మన శరీరానికి అందిస్తాయి.

Advertisement

Read Also: మష్రూమ్ కాఫీ తాగుతున్నారా?.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు సుమీ!

కొలస్ట్రాల్‌ను తగ్గించే నల్ల పప్పు:

నల్ల మినుములతో దాల్‌ మఖానీ, రోటీ, మినప సున్నుండలు వంటివి చేసుకుని తింటే.. ఐరన్‌, ఫైబర్‌, ప్రొటీన్‌, ఫోలేట్‌, మెగ్నీషియం వంటి పోషకాలు మన శరీరానికి అందుతాయి. ఈ పప్పును ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. దీంతో అధిక బరువు ముప్పు నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే దీనిలో ఉండే పొటాషియం రక్తప్రసరణను మెరుగుపరచంలో సహాయపడుతుంది.

కీళ్ల నొప్పులకు ఉత్తమ ఔషధం:

Advertisement

మన శరీరానికి నల్ల నువ్వులు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బరువు పెరగాలి అనుకుంటున్న వాళ్లు తరచూ నల్ల నువ్వులు తింటే.. మంచి ఫలితాలు వస్తాయంటున్నారు నిపుణులు. ఇందులో ఫైబర్, ప్రొటీన్, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్ ఇ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. కాబట్టి.. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వాళ్లకి నల్ల నువ్వులు ఉత్తమ ఔషధంగా చెప్పవచ్చు.

క్యాన్సర్‌తో పారాడే నల్ల ద్రాక్ష:

నల్ల ద్రాక్షలు మలబద్ధకం, రక్తపోటు, జుట్టు నెరిసిపోవడం వంటి సమస్యలకు చెక్ పెట్టడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగు పరచడంతో పాటుగా క్యాన్సర్‌ వ్యాధితో పోరాడేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. అలాగే బ్లాక్ బెర్రీస్, నల్ల వెల్లుల్లి, నల్ల పుట్టగొడుగులు, నల్ల మిరియాలు వంటివి తరచూ తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

Read Also: శీతాకాలంలో చిలగడదుంప ఎందుకు తినాలో తెలుసా?.. ఈ బెనిఫిట్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Related News

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

Big Stories

Advertisement
×