E-Paper
Advertisement

Varanasi Movie: వారణాసిలో మహేష్ అన్ని పాత్రలలో కనిపించనున్నారా? ఏం చేస్తున్నావ్ జక్కన్న?

Varanasi Movie: వారణాసిలో మహేష్ అన్ని పాత్రలలో కనిపించనున్నారా? ఏం చేస్తున్నావ్ జక్కన్న?
Advertisement

Varanasi Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)ప్రస్తుతం రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వారణాసి(Varanasi) సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు రాజమౌళి దర్శకత్వంలో సినిమాలు చేసి పాన్ ఇండియా స్టార్ హీరోలుగా పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్నారు. ఇక మహేష్ బాబు మొదటిసారి రాజమౌళితో కలిసి సినిమా చేయబోతున్న నేపథ్యంలో వారణాసి సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వారణాసి సినిమా పట్ల రెట్టింపు స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

ఐదు విభిన్న పాత్రలు..

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటున్నారు. 2027 సమ్మర్ లో ఈ సినిమాని విడుదల చేయడమే లక్ష్యంగా చిత్రబృందం పనిచేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఈ సినిమా కోసం ఏకంగా 1500 కోట్లు బడ్జెట్ కేటాయిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర అనే పాత్రలో కనిపించబోతున్నారు. అయితే కేవలం రుద్ర పాత్రలో మాత్రమే కాకుండా మహేష్ బాబు శ్రీరామ, లార్డ్ శివ, శ్రీకృష్ణ , రుద్ర పాత్రలతో పాటు పునర్జన్మ వంటి  ఐదు విభిన్న పాత్రలలో కనిపించబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

రాముడి పాత్రలో మహేష్ బాబు..

Advertisement

ఇక ఇప్పటికే ఈ సినిమాలో ఈయన రాముడిగా కనిపించబోతున్నారని స్వయంగా రాజమౌళి చెప్పిన సంగతి తెలిసిందే. రాముడిగా మహేష్ బాబుకి మేకప్ వేసిన తర్వాత రాజసం ఉట్టి పడిందని చాలా అద్భుతంగా రాముడి పాత్రకు సెట్ అయ్యారని రాజమౌళి వెల్లడించారు. దీంతో మహేష్ బాబును ఏఏ పాత్రలలో రాజమౌళి చూపించబోతున్నారనే ఆసక్తి కూడా అభిమానులలో నెలకొంది. ఒక హీరో ఇలా ఐదు విభిన్న పాత్రలలో నటించడం అంటే మామూలు విషయం కాదు అది కూడా రాజమౌళి డైరెక్షన్లో అంటే ఈ సినిమాని ఓ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారోనని అభిమానులు కూడా సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

గ్లోబల్ రేంజ్ లో విడుదల..

Advertisement

ఇక ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ బడ్జెట్ సినిమాకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాని గ్లోబల్ రేంజ్ లో విడుదల చేయబోతున్న నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్ ని కూడా దృష్టిలో పెట్టుకొని రాజమౌళి ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ సినిమాలో హీరోయిన్గా నటించబోతున్నారు. ప్రియాంక చోప్రా మందాకిని అనే పాత్రలో కనిపించగా పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో హనుమంతుడిగా కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్ నటించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి త్వరలోనే ఈ విషయంపై అధికారక ప్రకటన రానుంది.

Also Read: Nivetha Pethuraj: ఆగిపోయిన టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఆ ఫోటోలన్నీ డిలీట్?

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×