E-Paper
Advertisement

Pomegranate for Skin: దానిమ్మతో అదిరే అందం.. ఇలా వాడారంటే దగ దగా మెరిసిపోవాల్సిందే!

Pomegranate for Skin: దానిమ్మతో అదిరే అందం.. ఇలా వాడారంటే దగ దగా మెరిసిపోవాల్సిందే!
Advertisement

Pomegranate for Skin: దానిమ్మ మన ఆరోగ్యాన్ని పరిరక్షించడంలోనే కాదు.. అందాన్ని రెట్టింపు చేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. దీనిలో లభించే ఐరన్ వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో రక్తహీనత సమస్య తగ్గి, చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. దానిమ్మలో ప్రొటీన్, ఫోలేట్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీచర్మ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. దానిమ్మ పండ్లను నేరుగా తీసుకోవచ్చు లేదా ఫేస్‌ప్యాక్‌ల ద్వారా కూడా మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.

యవ్వనంగా కనిపించేలా..

దానిమ్మ పండ్లలో పాలీఫెనాల్స్, ప్యూనికాలాజిన్లు ఉంటాయి. ఇవి చర్మానికి మేలు చేస్తాయి. కాలుష్యం, హానికరమైన సూర్య కిరణాలు లేదా సరైన ఆహారం లేకపోవడం వల్ల కలిగే ఫ్రీ రాడికల్స్ మన కణాలను దెబ్బతీస్తాయి. దానిమ్మలోని యాంటీఆక్సిడెంట్లు శరీరం నుండి ఈ ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి తొలగిస్తాయి. దీంతో వృద్ధాప్య ఛాయలను నియంత్రించవచ్చు. దీంతో 60ల్లోనూ యవ్వనంగా కనిపించవచ్చు. దానిమ్మలోని సి విటమిన్ కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది ముడతలను నివారిస్తుంది. అయితే, తగినంత నీరు తాగడం కూడా చాలా అవసరం. దానిమ్మ లాంటి పోషకాలు అధికంగా ఉండే పండ్లను తినడంతో పాటు, హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం.

Advertisement

Read Also: ఉదయాన్నే పొట్టలో ఏదోఒకటని తోసేస్తున్నారా?.. బ్రేక్‌ఫాస్ట్‌పై హార్వర్డ్ నిపుణుల సలహా ఇదే!

సూర్యకిరణాలు నుంచి రక్షణ:

సూర్యుడి నుంచి వెలువడే హానీకరమైన UV కిరాణాల వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని రక్షించడంలో దానిమ్మ అద్భుతంగా పని చేస్తుంది. ఈ పండ్లతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ వినియోగం వల్ల కూడా చర్మం దెబ్బతినకుండా ఉంటుంది. ముడతలు రాకుండా నివారించవచ్చు. అలాగే దానిమ్మ యాంటీమైక్రోబయల్ నేచర్ కలిగి ఉంటుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉండటంతో.. ఇది మొటిమలు రాకుండా అడ్డుకుంటుంది. మొటిమలకు కారణం అయ్యే బ్యాక్టీరియా, శిలీంద్రాలపై పోరాడుతుంది. దానిమ్మ గింజలు చర్మంపై పేరుకుపోయిన మురికి, ఆయిల్‌ను క్రమంగా తొలగిస్తుంది.

గ్రీన్ టీ – దానిమ్మ:

Advertisement

మొటిమల సమస్యతో ఇబ్బంది పడుతున్నవాళ్లు దానిమ్మ గింజలను మెత్తగా రుబ్బుకుని, అందులో రెండు చెంచాల పెరుగు, ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టీస్పూన్ గ్రీన్ టీ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్‌కి పట్టించి 30 నిమిషాల పాటు మర్దనచేసి కడిగేసుకుంటే సరి. ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల మొటిమల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇలా వారానికి నాలుగు సార్లు అప్లై చేసుకోవచ్చు.

కోకో పౌడర్ – దానిమ్మ

సాధారణంగానే దానిమ్మ, కోకో పౌడర్ రెండూ యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి. వీటిని ఉపయోగించి చర్మం బిగుతుగా, యవ్వనంగా మార్చుకోవచ్చు. దానిమ్మ గింజలను మెత్తగా పేస్ట్ చేసి.. అందులో కోకో పౌడర్‌ను కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల యవ్వనంగా కనిపిస్తారు. దీన్ని వారానికి 3 సార్లు అప్లై చేసుకోవాలి. అలాగే, దానిమ్మ గింజల పేస్టులో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసుకుంటే.. చర్మం ఎక్కువసేపు హైడ్రేట్‌గా, తేమగా ఉంటుంది. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Read Also: సీజనల్ వ్యాధులకు చెక్.. శీతాకాలంలో ఈ కూరగాయలు తింటే నిండు ఆరోగ్యం!

Related News

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్ని ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

Big Stories

Advertisement
×