E-Paper
Advertisement

Winter Vegetables: సీజనల్ వ్యాధులకు చెక్.. శీతాకాలంలో ఈ కూరగాయలు తింటే నిండు ఆరోగ్యం!

Winter Vegetables: సీజనల్ వ్యాధులకు చెక్.. శీతాకాలంలో ఈ కూరగాయలు తింటే నిండు ఆరోగ్యం!
Advertisement

Winter Vegetables: శీతాకాలంలో మనం రోజూ తినే కూరగాయలను ఆచితూచి ఎంచుకోవాలని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఈ సీజన్‌లో లభించే కూరగాయలు అన్నిటిలోనూ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు తోడ్పడుతాయి. ముఖ్యంగా శీతాకాలంలో సీజనల్ ఇన్ఫెక్షన్స్ దాడి చేస్తుంటాయి. వీటి నుంచి రక్షణ పొందాలంటే.. శరీర రోగనిరోధక శక్తిని బలంగా మార్చుకోవాల్సి ఉంటుంది. దీని కోసం కచ్చితంగా తినాల్సిన కొన్ని కూరగాయల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చర్మాన్ని కాపాడే క్యారెట్:

శీతాకాలంలో తరచూ క్యారెట్ తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. క్యారెట్లు నారింజ రంగు బీటా-కెరోటిన్‌ను కలిగి ఉండటం వలన ఇది శరీరంలో విటమిన్ ‘ఏ’ గా పనిచేస్తుంది. ఈ బీటా-కెరోటిన్ కంటి చూపుకు అమృతంగా పరిగణిస్తారు. ప్రతిరోజూ క్యారెట్ తింటే.. ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందవచ్చు. క్యారెట్స్‌లో ఫైబర్ కూడా అధికం. కాబట్టి.. ఇది జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.

అధిక రక్తపోటును తగ్గించే బీట్‌రూట్:

Advertisement

అన్ని కాలాల్లోనూ బీట్‌రూట్ అందుబాటులో ఉంటుంది. దీని నుంచి అద్భుతమైన ఐరన్ పొందవచ్చు. రక్తహీనతతో పోరాడటంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. బీట్‌రూట్‌లో నైట్రేట్లు కూడా ఉండటంతో.. ఇవి అధిక రక్తపోటును తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ సహాయపడతాయి. దీని యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీర రోగనిరోధక శక్తిని బలంగా మారుస్తాయి.

Read Also: మీకెప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా.. మన బొడ్డులో పేరుకుపోయిన ఈ మెత్తటి పదార్థం ఏంటని?

ఇమ్యూనిటీని పెంచే టర్నిప్:

Advertisement

నిజానికి టర్నిప్‌ను తినడానికి చాలామంది ఇష్టపడరు. కానీ, దీని ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. దీనిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జలుబు, దగ్గుతో పోరాడటానికి తోడ్పడుతాయి. అంతేకాదు.. టర్నిప్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో హెల్పవుతాయి. టర్నిప్‌లలో ఫైబర్ పుష్కలంగా ఉండటంతో.. మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.

వ్యాధులతో పోరాడే పాలకూర:

వింటర్ సీజన్‌లో మార్కెట్‌లో విరివిగా లభించే పాలకూర ఆరోగ్యానికి ఒక వరం. దీనిలో ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్లు ఏ, సి, కె వంటి కీలక విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీర వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని బలోపేతం చేస్తాయి. జలుబు, ఫ్లూ వంటి సమస్యలను నివారిస్తాయి. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను కూడా నిర్వహిస్తుంది.

మధుమేహులకు మెంతులు:

మెంతులు సాధారణంగా అనిపించినా.. వీటిలో పోషకాలు అనేకం. మెంతులు రుచిలో చేదుగా ఉన్నా.. జీర్ణ ఎంజైమ్‌లను సక్రియం చేయడం ద్వారా జీర్ణవ్యవస్థను బలపరుస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచుతాయి. కాబట్టి.. డయాబెటిస్ ఉన్నవాళ్లకి మెంతులు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీని ద్వారా ఇనుము, కాల్షియం, భాస్వరం వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి.

Read Also: మొలకెత్తిన దుంపలు తింటున్నారా?.. ప్రమాదం పొంచి ఉందంటున్న నిపుణులు!

Related News

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

Big Stories

Advertisement
×