E-Paper
Advertisement

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!
Advertisement

pTron Bassbuds Pro: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్ ఎలా ఉంటుందో.. చెవుల్లో ఇయర్‌బడ్స్ కూడా అలాగే దర్శనమిస్తున్నాయి. వైర్లు లేని ముచ్చటైన మ్యూజిక్ ఎక్స్‌పీరియన్స్ కోసం అందరూ TWS బడ్స్ వైపే మొగ్గు చూపుతున్నారు. కానీ మార్కెట్లో బ్రాండెడ్ ఇయర్‌బడ్స్ ధరలు కాస్త ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారి కోసం అతి తక్కువ బడ్జెట్‌లో, ప్రీమియం డిజిటల్ డిస్‌ప్లే లుక్‌తో యూత్‌ని ఆకట్టుకోవడానికి వచ్చేసింది pTron Bassbuds Pro. కేవలం రూ. 1,299 కే లభిస్తున్న ఈ బడ్స్ ఫీచర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

డిజిటల్ డిస్‌ప్లే కేస్ :

పిట్రాన్ బేస్‌బడ్స్ ప్రోలో ఉన్న బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే.. దీని చార్జింగ్ కేస్‌పై ఇచ్చి స్మార్ట్ డిజిటల్ డిస్‌ప్లే. సాధారణంగా వేల రూపాయలు పెట్టే ప్రీమియం బడ్స్‌లో మాత్రమే ఇలాంటి ఫీచర్ చూస్తుంటాం. ఈ కేస్ ఓపెన్ చేయగానే అందులో ఎంత పర్సెంట్ బ్యాటరీ ఉందో పక్కాగా కనిపిస్తుంది. పైగా, లెఫ్ట్ అండ్ రైట్ ఇయర్‌బడ్స్ విడివిడిగా ఎంత చార్జ్ అవుతున్నాయో కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. దీని వల్ల చార్జింగ్ ఎప్పుడు అయిపోతుందో అనే టెన్షన్ అస్సలు ఉండదు.

క్రిస్టల్ క్లియర్ సౌండ్ :

Advertisement

ఈ ఇయర్‌బడ్స్‌కి ‘బేస్‌బడ్స్’ అని పేరు పెట్టడంలోనే అర్థముంది. ఇందులో 8mm పవర్‌ఫుల్ డైనమిక్ డ్రైవర్స్ ఇచ్చారు. దీని వల్ల మ్యూజిక్ వింటున్నప్పుడు బేస్ నెక్స్ట్ లెవెల్‌లో వస్తుంది. మీరు మాస్ సాంగ్స్ విన్నా లేదా మెలోడీస్ విన్నా ప్రతీ ఇన్స్ట్రుమెంట్ సౌండ్ చాలా క్రిస్టల్ క్లియర్‌గా వినబడుతుంది. ప్యాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉండటం వల్ల చుట్టుపక్కల వచ్చే చిన్న చిన్న డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా పాటలు ఎంజాయ్ చేయొచ్చు.

స్మార్ట్ టచ్ కంట్రోల్స్ అండ్ అసిస్టెంట్ :

ఈ బడ్స్ మీద ఎలాంటి ఫిజికల్ బటన్స్ ఉండవు. కేవలం జస్ట్ సింగిల్ లేదా డబుల్ ట్యాప్ టచ్ కంట్రోల్స్‌తోనే.. సాంగ్స్ ప్లే/పాజ్ చేయొచ్చు, నెక్స్ట్ సాంగ్‌కి వెళ్లొచ్చు. అలాగే ఫోన్ కాల్స్ లిఫ్ట్ లేదా కట్ చేయొచ్చు. దీనికి తోడు వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉంది. జస్ట్ గూగుల్ అసిస్టెంట్ లేదా సిరిని ఆక్టివేట్ చేసి వాయిస్ కమాండ్స్ ద్వారా మీ ఫోన్‌ను ఆపరేట్ చేసుకోవచ్చు.

వాటర్ రెసిస్టెంట్:

Advertisement

ఈ బడ్స్‌కి IPX4 రేటింగ్ ఉంది. అంటే మీరు జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్నప్పుడు చెమట పట్టినా, లేదా వర్షంలో చిన్నగా తడిసినా ఈ ఇయర్‌బడ్స్‌కి ఏమీ కాదు, స్వెట్ ప్రూఫ్‌గా పనిచేస్తాయి. దీని ఎర్గోనామిక్ ఇన్-ఇయర్ డిజైన్ వల్ల చెవుల్లో చాలా కంఫర్టబుల్‌గా ఫిట్ అవుతాయి. ఎంత రన్నింగ్ చేసినా సరే కింద పడిపోవు. ఒక్కో బడ్ బరువు కేవలం 4 గ్రాములు మాత్రమే ఉండటం వల్ల రోజంతా పెట్టుకున్నా నొప్పి అస్సలు తెలియదు.

Also Read: ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

బ్లూటూత్ 5.1 & బ్యాటరీ లైఫ్:

లేటెస్ట్ బ్లూటూత్ 5.1 కనెక్టివిటీ ఉండటం వల్ల ఫోన్‌తో.. క్షణాల్లో కనెక్ట్ అయిపోతుంది. కేస్ ఓపెన్ చేయగానే ఆటో-పెయిరింగ్ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. ఆడియో లాగ్ లేకుండా క్లియర్ కాలింగ్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. ఒక్క సారి చార్జ్ చేస్తే ఇయర్‌బడ్స్ 4 గంటల పాటు ప్లేటైమ్ ఇస్తాయి. చార్జింగ్ కేస్‌తో కలుపుకుంటే.. ఏకంగా 12 గంటల వరకు నాన్-స్టాప్‌గా వాడుకోవచ్చు. టైప్-సి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల చాలా త్వరగా చార్జ్ అయిపోతాయి.

కేవలం రూ. 1,299 బడ్జెట్‌లో ప్రీమియం డిజిటల్ డిస్‌ప్లే, అదిరిపోయే హెవీ బేస్, టైప్-సి చార్జింగ్, స్మార్ట్ టచ్ కంట్రోల్స్ ఉన్న TWS ఇయర్‌బడ్స్ కావాలనుకుంటే pTron Bassbuds Pro కళ్ళు మూసుకుని కొనేయొచ్చు. ముఖ్యంగా స్టూడెంట్స్, తక్కువ బడ్జెట్‌లో స్టైలిష్ గ్యాడ్జెట్ ఆశించేవారికి ఇది మోస్ట్ రికమెండెడ్ ఆప్షన్.

Related News

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

Big Stories

Advertisement
×