E-Paper
Advertisement

మీ కిచెన్ సింక్ జామ్ అయిందా? ఇదొక్కటి పైప్‌లో వేస్తే.. క్షణాల్లో చెత్త మొత్తం క్లీన్

మీ కిచెన్ సింక్ జామ్ అయిందా? ఇదొక్కటి పైప్‌లో వేస్తే.. క్షణాల్లో చెత్త మొత్తం క్లీన్
Advertisement

Kitchen Sink Clean| ఇంట్లో వంటగది క్లీన్‌గా ఉంటే ఇల్లంతా శుభ్రంగా ఉన్నట్లే. కుటుంబ ఆరోగ్యం కూడా ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. అయితే చాలా సార్లు కిచెన్‌లో చెత్త అంతా సింక్‌లో వెళ్లి అక్కడ పైపులు జామ్ అవుతాయి. ఇది చాలా ఇళ్లలో జరిగే సాధారణ సమస్య.

దీంతో కిచెన్‌ సింక్‌లో నీరు డ్రెయిన్ కాదు. ఈ కారణంగా అక్కడ దుర్వాసన వస్తుంది. నీరు సింక్‌లో నిలిచిపోయి బ్యాక్టీరియా పెరగడానికి కారణం అవుతుంది. గ్రీజ్, మిగిలిపోయిన ఆహారపు వ్యర్థాలు, ధూళి పైపుల్లో పేరుకుపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. చాలా మంది ఈ సమస్యతో విసిగిపోయి ప్లంబర్‌ను పిలవాలనుకుంటారు. కానీ ప్లంబర్ అవసరం లేకుండానే ఇంట్లోనే ఈ సమస్యను పరిష్కరించవచ్చు. కొన్ని సులభమైన ఇంటి చిట్కాలతో త్వరగా ఈ సింక్ క్లీన్ అవుతుంది. అడ్డంకిని తొలగిస్తాయి.

కిచెన్ సింక్ పెద్ద సమస్య

Advertisement

కిచెన్‌ సింక్‌లో రోజూ వేసే ఆహార వ్యర్థాలు, నూనె, పైపుల్లో అంటుకుపోతాయి. కాలక్రమేణా ఇవి గట్టి పొరగా మారి నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. దీని వల్ల నీరు నెమ్మదిగా ప్రవహిస్తుంది లేదా పూర్తిగా ఆగిపోతుంది.

బేకింగ్ సోడా, వెనిగర్

ఇది అత్యంత ప్రభావవంతమైన సహజ పద్ధతి. ముందు డ్రైన్‌లో అర కప్పు బేకింగ్ సోడా పోయండి. ఆ తర్వాత ఒక కప్పు వైట్ వెనిగర్ పోయండి. ఈ మిశ్రమం క్రమంగా సింక్‌లోని జిడ్డుగా ఉన్న గ్రీజ్ చెత్తని లూజ్ చేస్తూ విచ్ఛిన్నం చేస్తుంది. 15 నుంచి 20 నిమిషాలు ఉండనివ్వండి. ఆ తర్వాత వేడి నీరు పోసి శుభ్రం చేయండి. ఈ పద్ధతి గ్రీజ్, తేలికపాటి అడ్డంకులకు చాలా బాగా పని చేస్తుంది.

వేడి నీరు పోయండి

Advertisement

వేడి నీరు గ్రీజ్‌ను కరిగించడానికి బెస్ట్. నీరు మరగించి డ్రైన్‌లో నేరుగా పోయండి. ఇది పైపుల్లో అంటుకున్న నూనెను కరిగిస్తుంది. ఈ పద్ధతి చాలా సులభంగా, త్వరగా పని చేస్తుంది. కానీ మీరి బలమైన జిడ్డు అడ్డంకులకు పూర్తి పరిష్కారం కాకపోవచ్చు.

ఉప్పు, వేడి నీరు ఉపయోగించండి

అర కప్పు ఉప్పును డ్రైన్‌లో పోసి, పైన వేడి నీరు పోయండి. రాత్రంతా అలాగే ఉండనివ్వండి. ఈ పద్ధతి పైపులను శుభ్రం చేసి, తాజా వాసన ఇస్తుంది.

ప్లంజర్ ఉపయోగించండి

బలమైన అడ్డంకులకు ప్లంజర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. దాన్ని డ్రైన్ మీద గట్టిగా అమర్చి పైకి కిందకి నొక్కండి. ఇది వాక్యూమ్ ఏర్పరచి అడ్డంకిని కదిలిస్తుంది. నీరు మళ్లీ సాఫీగా ప్రవహిస్తుంది.

సింక్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి

వారానికి ఒకసారి వేడి నీరు పోయండి. నూనె మరియు ఆహార వ్యర్థాలను సింక్‌లో వేయకండి. డ్రైన్ స్ట్రైనర్ ఉపయోగించండి. ఈ చిన్న అలవాట్లు సింక్‌ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుతాయి.

Also Read: నోటి దుర్వాసనతో ఇబ్బందిపడుతున్నారా? ఈ ఆరోగ్య సమస్యలే కారణం

ప్లంబర్‌ను ఎప్పుడు పిలవాలి

ఇంటి చిట్కాలు పని చేయకపోతే లేదా నీరు ఏమాత్రం ప్రవహించకపోతే ప్లంబర్‌ను పిలవండి. తీవ్రమైన దుర్వాసన ఉంటే వెంటనే సహాయం తీసుకోండి. సమస్యను ముందుగానే పరిష్కరించడం మంచిది.

కిచెన్ సింక్ అడ్డంకి రోజువారీ పనులను ఆపేస్తుంది. కానీ బేకింగ్ సోడా, వెనిగర్, వేడి నీరు, ఉప్పు వంటి సాధారణ వస్తువులతోనే ఈ సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సింక్ ఎప్పుడూ సాఫీగా పని చేస్తుంది.

Related News

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

ప్రతిరోజూ హెల్మెట్ ధరిస్తే జుట్టు డ్యామేజ్.. ఈ సులభమైన హెయిర్ కేర్ చిట్కాలు మీ కోసం

పాము, ముంగీస లాంటి స్వభావం వీరిది.. ఈ తేదీల్లో పుట్టినవారు పెళ్లి తరువాత గొడవపడుతూనే ఉంటారు

మద్యం లేదా సిగరెట్.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రమాదకరం.. ఏది ముందుగా మానేయాలి?

ఉద్యోగం చేసే భార్యభర్తల మధ్య ఒత్తిడి, గొడవలు.. దాంపత్య జీవితం కాపాడుకోవడానికి ఇలా చేయడం తప్పనిసరి

ఆలుగడ్డలు 5 నెలల పాటు తాజాగా ఉండాలా? అయితే ఆ ప్రదేశంలో పెట్టండి!

రోగాలు మాయం.. వర్షాకాలంలో కచ్చితంగా తినాల్సిన కూరగాయలు

Big Stories

Advertisement
×