E-Paper
Advertisement

నీరసం,నిస్సత్తువ వేసవిలో సర్వసాధారణమా? బాడీని రీఛార్జ్ చేసే చిట్కాలు

నీరసం,నిస్సత్తువ వేసవిలో సర్వసాధారణమా? బాడీని రీఛార్జ్ చేసే చిట్కాలు
Advertisement

Summer health tips: వేసవి కాలం రాగానే మనందరికీ ఎదురయ్యే ప్రధాన సమస్య అకస్మాత్తుగా వచ్చే అలసట.ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో తెలియని నిస్సత్తువ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. తగినంత ఆహారం తీసుకున్నా, విశ్రాంతి తీసుకున్నా.. ఈ నీరసం ఎందుకు వస్తుందో చాలా మందికి అర్థం కాదు. అధిక ఉష్ణోగ్రతల వల్ల మన శరీరంలో జరిగే మార్పులే దీనికి ప్రధాన కారణం. ఈ ఎండల కాలంలో మనం ఎందుకు త్వరగా అలసిపోతాము, ఆ సమస్య నుంచి ఎలా బయటపడవచ్చో వివరంగా తెలుసుకుందాం.

వేసవి కాలంలో వాతావరణం వేడెక్కడం వల్ల మన శరీరం తన ఉష్ణోగ్రతను సమతుల్యం చేసుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తుంది. ఈ ప్రక్రియలో మన శక్తి వినియోగం పెరిగి, త్వరగా అలసట కలుగుతుంది. దీనికి గల ముఖ్యమైన కారణాలు..

Advertisement

1. శరీర ఉష్ణోగ్రత నియంత్రణ :
మన శరీర ఉష్ణోగ్రత సాధారణంగా 37∘C ఉంటుంది. బయట ఎండ తీవ్రత పెరిగినప్పుడు.. మన శరీరాన్ని చల్లబరచడానికి మెదడు రక్తప్రవాహాన్ని చర్మం వైపు మళ్లిస్తుంది. దీని వల్ల చర్మం ద్వారా వేడి బయటకు పోతుంది. ఈ క్రమంలో గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస వేగం పెరగడం వంటి పనులు చేయడానికి శరీరం ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తుంది.ఇదే మనల్ని అలసిపోయేలా చేస్తుంది.

2. డీహైడ్రేషన్ :
ఎండలో శరీరం చల్లబడటానికి చెమటను ఉత్పత్తి చేస్తుంది. చెమట రూపంలో నీరు, లవణాలు బయటకు పోతాయి. తగినంత నీరు తాగకపోతే రక్త పరిమాణం తగ్గుతుంది, దీని వల్ల రక్తపోటు పడిపోయి మెదడుకు,కండరాలకు ఆక్సిజన్ సరఫరా నెమ్మదిస్తుంది.ఫలితంగా విపరీతమైన నీరసం కలుగుతుంది.

Advertisement

3. నిద్రలేమి :
వేసవిలో పగటి సమయం ఎక్కువగా ఉండటం, రాత్రిపూట కూడా ఉక్కపోతగా ఉండటం వల్ల గాఢ నిద్ర ఉండదు. సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల మరుసటి రోజు పగలు విపరీతమైన నిస్సత్తువగా అనిపిస్తుంది.

4. జీవక్రియలో మార్పులు :
వేసవిలో మన శరీరం ఉష్ణోగ్రతను తగ్గించుకోవడానికి జీవక్రియ వేగాన్ని అడ్జస్ట్ చేసుకుంటుంది. ఈ సమయంలో తీసుకున్న ఆహారం నుంచి శక్తి విడుదలయ్యే ప్రక్రియలో కూడా మార్పులు రావడం వల్ల త్వరగా అలసిపోతాము.

అలసటను తగ్గించుకోవడానికి పరిష్కార మార్గాలు:
హైడ్రేషన్ ముఖ్యం: దాహం వేయకపోయినా ప్రతి గంటకు ఒకసారి నీరు తాగుతూ ఉండాలి. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ వంటివి తీసుకోవడం వల్ల కోల్పోయిన లవణాలు మళ్లీ అందుతాయి.

తేలికపాటి ఆహారం: వేసవిలో మసాలాలు, నూనె పదార్థాలు తగ్గించి, నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, దోసకాయ వంటి పండ్లు తీసుకోవాలి.

సరైన సమయం: మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య ఎండలోకి వెళ్లకపోవడం మంచిది. ఒకవేళ వెళ్లాల్సి వస్తే గొడుగు,క్యాప్ వాడాలి.

చల్లని స్నానం: సాయంత్రం లేదా పడుకునే ముందు చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి నిద్ర బాగా పడుతుంది.

వేసవిలో వచ్చే అలసట అనేది మన శరీరం ఇచ్చే ఒక సంకేతం. మనం అలసిపోతున్నామంటే శరీరం తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తోందని అర్థం. కాబట్టి.. ఎండల కాలంలో శరీరానికి తగినంత విశ్రాంతిని, నీటిని అందించడం ద్వారా మనం ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండొచ్చు.

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×