E-Paper
Advertisement

Relationship Secrets: ప్రేమ పేరుతో మీరు చేస్తున్న ఈ ‘స్క్యామ్’ ఆపకపోతే.. మీ లైఫ్ క్లైమాక్స్ అట్టర్ ఫ్లాపే!

Relationship Secrets: ప్రేమ పేరుతో మీరు చేస్తున్న ఈ ‘స్క్యామ్’ ఆపకపోతే.. మీ లైఫ్ క్లైమాక్స్ అట్టర్ ఫ్లాపే!

Relationship Secrets: ప్రేమ.. ఇది ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ అని మన పెద్దవాళ్ళు చెప్తారు. కానీ నేటి జనరేషన్ కి అది ఒక ‘డెమో వెర్షన్’ లా మారిపోయింది. ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చూసి, అల్గోరిథం సెట్ చేసినట్టుగా లవ్ లో పడిపోతే.. తర్వాత రియాలిటీ చెక్ తగిలినప్పుడు “గుండె కోత” గ్యారెంటీ! అసలు మీరు చేస్తున్న మిస్టేక్స్ ఏంటో తెలుసా?

‘సినిమా’ చూపించకండి.. ‘రియాలిటీ’ లోకి రండి!
ప్రేమ అంటే 2 గంటల థియేటర్ ఎక్స్ పీరియన్స్ కాదు బాస్! అది 24/7 లైవ్ స్ట్రీమింగ్. చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే.. లవ్ స్టార్ట్ అవ్వగానే ఒక ‘ఫేక్ ప్రొఫైల్’ మెయింటైన్ చేయడం. అవతలి వాళ్లకి నచ్చాలని మన ఒరిజినల్ క్యారెక్టర్ ని మ్యూట్ లో పెడతాం. కానీ గుర్తుపెట్టుకోండి.. నటన (Acting) ఎక్కువ రోజులు స్ట్రీమింగ్ అవ్వదు. ఎప్పుడో ఒకప్పుడు ‘బఫరింగ్’ మొదలవుతుంది.. అప్పుడే అసలు గొడవలు!

‘లుక్స్’ కి ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది.. ‘బిహేవియర్’ కి ఉండదు! 
అందం చూసి అట్రాక్ట్ అవ్వడం అనేది కేవలం ఒక ‘నోటిఫికేషన్’ లాంటిది. కానీ ఆ మనిషితో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలంటే వాళ్ళ ప్రవర్తన (Behavior) ముఖ్యం.
కోపం వస్తే ఫోన్ విసిరేస్తున్నాడా?
డబ్బు విషయంలో పక్కా ‘కాలిక్యులేటర్’ లా ఉంటున్నారా?
మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కి ‘డిలీట్’ ఆప్షన్ ఇస్తున్నారా?
అందం ఒక రాత్రితో అలవాటైపోతుంది, కానీ  ఈ చిరాకు తెప్పించే క్యారెక్టర్ చచ్చే వరకు వేధిస్తుంది!

also read:Relationship Secrets: భర్త తన మాటే వినాలంటే భార్య ఏం చేయాలి…?

“నీ కోసం ఏదైనా చేస్తా” – ఇదొక పెద్ద ‘క్లిక్ బైట్’! 
“నీ కోసం ప్రాణాలిస్తా” అనే డైలాగులు 90s సినిమాలకే పరిమితం. ఇప్పుడు కావాల్సింది ‘ఎఫర్ట్’ (Effort). నీ కోసం ఏం చేస్తున్నాడో కాదు.. నీ కోసం తన ‘ఈగో’ ని ఎంతవరకు తగ్గించుకుంటున్నాడో చూడండి. తన పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇవ్వని వాడు, రేపు నిన్ను ‘అన్ ఫాలో’ కొట్టడానికి సెకన్ కూడా ఆలోచించడు.

‘టాక్సిక్’ ఇష్టాన్ని ప్రేమ అనుకోకండి! 
అతిగా మాట్లాడటం, ప్రతి నిమిషం ఎక్కడున్నావో లొకేషన్ అడగడం, ‘స్పేస్’ ఇవ్వకపోవడం.. ఇవి కేరింగ్ కాదు, ఇదొక ‘పొసెసివ్ జైలు’. రిలేషన్ షిప్ లో ‘ప్రైవసీ’ లేకపోతే అది బంధం కాదు, ఒక ‘సెక్యూరిటీ గార్డ్’ డ్యూటీ అవుతుంది.సో .. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి టైమ్ ఇవ్వండి.

కళ్ళు మూసుకుని దూకకండి.. ‘స్కాన్’ చేసి చూడండి!
ప్రేమ అంటే గుడ్డిగా లోయలోకి దూకడం కాదు. కళ్ళు తెరిచి, అన్ని రిస్క్ లు చూసి నడిచే ప్రయాణం. ఎదుటి వ్యక్తి లోపాలు తెలిసినా, ఆ ‘బగ్స్’ (Bugs) తో నేను అడ్జస్ట్ అవ్వగలను అనిపిస్తేనే ‘ఇన్ స్టాల్’ చేసుకోండి. లేకపోతే ఇప్పుడే ‘అన్ ఇన్ స్టాల్’ చేయడం, ఫ్యూచర్ లో ‘క్రాష్’ అవ్వడం కంటే చాలా బెటర్!

ఫైనల్ పంచ్: లవ్ అనేది ఒక సాఫ్ట్ వేర్ లాంటిది.. దాన్ని అప్ డేట్ చేస్తూ ఉండాలి..లేకపోతె అంతే సంగతులు.
మీకు ఏమనిపిస్తుంది? కామెంట్ చేయండి!

also read: Relationship secrets: భార్యకు ఈ 7 లక్షణాలు ఉంటే.. ఆ భర్త అదృష్టవంతుడే!

Related News

ఏసీలో పడుకుంటే తలనొప్పి వస్తోందా? నిపుణులు చెబుతున్న అసలు కారణాలివే!

టీనేజర్ల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్న ఎనర్జీ డ్రింక్స్.. తస్మాత్ జాగ్రత్త!

ఇంటి బయట ॐతో పాటు ఈ నాలుగు చిహ్నాలుంటే.. మీ జీవితంలో సుఖ సంతోషాలే

మార్కెట్‌ నుంచి తెచ్చిన మొక్కలు ఇంట్లో ఎండిపోతున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే ఏళ్ల తరబడి పచ్చగా పెరుగుతాయి

వేసవి నీరసం వల్ల ఓఆర్ఎస్ తాగుతున్నారా? ప్యాకెట్లు వద్దు.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి

మీ అబ్బాయి కోసం పెళ్లిసంబంధాలు చూస్తున్నారా? ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి సర్వ గుణ సంపన్నురాలు

వేసవిలో అద్దంలా మెరిసిపోయే ముఖ చర్మం కావాలా? ఈ టిప్స్ మీ కోసమే

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

Big Stories

×