E-Paper
Advertisement

Gold Rate Hike: కొండెక్కిన పసిడి.. రికార్డు ధరలతో సామాన్యులకు చుక్కలు.. ఇక బంగారం కలగానే మిగిలిపోనుందా?

Gold Rate Hike: కొండెక్కిన పసిడి.. రికార్డు ధరలతో సామాన్యులకు చుక్కలు.. ఇక బంగారం కలగానే మిగిలిపోనుందా?
Advertisement

Gold Rate Hike: ప్రస్తుతం మార్కెట్‌లో బంగారం ధరలు ఓ పక్క తగ్గుతూనే, మరోపక్క అంతర్జాతీయ పరిణామాల వల్ల అనూహ్యంగా పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రధానంగా 2026 మార్చి నెలలో పశ్చిమాసియా (Middle East) లో నెలకొన్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ వాతావరణం, క్షిపణి దాడుల వంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారంపై మదుపరుల ఆసక్తిని పెంచాయి.

ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనైనప్పుడు, పెట్టుబడిదారులు సురక్షితమైన మార్గంగా భావించి బంగారంలో పెట్టుబడులు పెడతారు. దీనివల్ల అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగి, మన దేశంలో కూడా ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. అంతేకాకుండా పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తుండటంతో దేశీయంగా డిమాండ్ పెరగడం కూడా ఈ ధరల పెరుగుదలకు ఒక ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు భారీగా పెరిగాయి. మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,910 ఉండగా.. నేడు బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,46,670 వద్ద ఉంది. అలాగే మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,000 కాగా.. నేడు బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,450 వద్ద ఉంది. అంటే నేడు 10 గ్రాముల బంగారం పై రూ.3,760 పెరిగింది.

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,46,670 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,450 వద్ద కొనసాగుతుంది.

Advertisement

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,46,670 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,450 వద్ద ఉంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,46,670 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,450 వద్ద పలుకుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,820 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,34,600 వద్ద ఉంది.

Also Read: షాకింగ్ న్యూస్.. ఆయిల్ సంక్షోభం మొదలైంది.. 10 రోజులకు మాత్రమే నిల్వలు

నేటి సిల్వర్ ధరలు..
షాకింగ్.. తగ్గినట్టే తగ్గి మళ్లీ భారీగా పెరుగుతున్న సిల్వర్ ధరలు.. నేడు బంగారం ధరలు పెరగడంతో సిల్వర్ ధరలు కూడా భారీగా పెరిగాయి.. నేటి సిల్వర్ ధరలు చూసుకుంటే.. మంగళవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,50,000 వద్ద ఉండగా.. నేడు బుధవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,60,000 వద్ద కొనసాగుతోంది. అంటే నేడు ఒక్కరోజే కేజీ సిల్వర్ పై రూ. 10,000 పెరిగింది. అలాగే కలకత్తా, ముంభై, ఢిల్లీలో నేడు కేజీ సిల్వర్ పై రూ.15,000 పెరిగి.. 2,50,000 వద్ద పలుకుతోంది.

Related News

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

గుడ్ న్యూస్.. సిలిండర్ అయిపోయిందా? టెన్షన్ వద్దు, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ చేయండి!

Big Stories

Advertisement
×