E-Paper
Advertisement

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టినవారు కేవలం మాటలతో అందరినీ అకట్టుకుంటారు..

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టినవారు కేవలం మాటలతో అందరినీ అకట్టుకుంటారు..
Advertisement

న్యూమరాలజీ (సంఖ్య శాస్త్రం) ప్రకారం.. ప్రతి సంఖ్యకు ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. పుట్టిన తేదీ మన వ్యక్తిత్వం, ఆలోచనా విధానం, జీవిత ప్రయాణంపై ప్రభావం చూపుతుందని నమ్ముతారు. ముఖ్యంగా మూల సంఖ్య 5 కలిగిన వ్యక్తులు తమ తెలివితేటలు, సంభాషణ నైపుణ్యాలతో ప్రత్యేక గుర్తింపు పొందుతారు. వీరు మాటలతోనే ఎదుటివారిని ఆకట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.

మూల సంఖ్య 5 ఎవరికి ఉంటుంది?

ఏ నెలలో అయినా 5, 14 లేదా 23 తేదీలలో జన్మించిన వారికి మూల సంఖ్య 5గా పరిగణిస్తారు. ఈ సంఖ్యకు బుధ గ్రహం అధిపతి. బుధుడు జ్ఞానం, తెలివితేటలు, కమ్యూనికేషన్‌కు ప్రతీకగా భావిస్తారు. అందువల్ల ఈ సంఖ్య కలిగిన వారు మాట్లాడే విధానంలో ప్రత్యేకతను చూపిస్తారు.

ఎదుటివారిని సులభంగా ఒప్పిస్తారు

Advertisement

మూల సంఖ్య 5 కలిగిన వ్యక్తులు తమ మాటలతో ఇతరులను సులభంగా ఒప్పించగలరు. వీరి సంభాషణలో ఆకర్షణ ఉంటుంది. ఎలాంటి విషయమైనా స్పష్టంగా, తెలివిగా వివరించగల సామర్థ్యం వీరికి ఉంటుంది. అందువల్ల చాలామంది వీరి మాటలను సులభంగా అంగీకరిస్తారు. ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితంలో కూడా ఈ లక్షణం వీరికి ఎంతో ఉపయోగపడుతుంది.

ఆలోచనా శక్తి చాలా వేగంగా ఉంటుంది

ఈ సంఖ్యకు చెందిన వారు చాలా త్వరగా, చురుకుగా స్పందిస్తారు. వేగంగా ఆలోచిస్తారు. ఏ పరిస్థితిలోనైనా వెంటనే స్పందించగలరు. సమస్యలను త్వరగా అర్థం చేసుకుని పరిష్కార మార్గాలను సూచించగల సామర్థ్యం వీరికి ఉంటుంది. తమ తెలివితేటలు, సమయస్ఫూర్తి కారణంగా ఇతరుల నుంచి ఎల్లప్పుడూ ప్రశంసలు పొందుతారు. కొత్త ఆలోచనలను స్వీకరించడంలో కూడా ముందుంటారు.

ఆత్మవిశ్వాసమే ప్రధాన బలం

Advertisement

మూల సంఖ్య 5 కలిగిన వ్యక్తులు తమపై పూర్తి నమ్మకాన్ని కలిగి ఉంటారు. ఎలాంటి సవాళ్లు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగుతారు. ఈ ఆత్మవిశ్వాసమే వారిని విజయానికి చేరువ చేస్తుంది. చేపట్టిన ప్రతి పనిని పూర్తి చేయడానికి కృషి చేస్తారు. అందువల్ల కెరీర్‌లో మంచి స్థాయికి చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Also Read: పది మందిలో మీరు ప్రత్యేకంగా కనిపిస్తారు.. మీ మాటలకు అందురూ ప్రాధాన్యం ఇవ్వాలంటే ఇలా చేయండి

వ్యక్తిత్వంతోనే అందరినీ ఆకట్టుకుంటారు

ఈ సంఖ్యకు చెందిన వ్యక్తులు సహజంగానే ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరితో మాట్లాడిన తర్వాత చాలా మంది స్నేహం చేయాలనుకుంటారు. వారి స్నేహపూర్వక స్వభావం, ఉత్సాహభరితమైన వైఖరి కారణంగా సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. ఈ వ్యక్తులు ఉన్న చోట ఉల్లాసమైన వాతావరణం కనిపిస్తుంది.

మార్పులను సంతోషంగా స్వీకరిస్తారు

మార్పులు చాలా మందికి భయాన్ని కలిగిస్తాయి. కానీ మూల సంఖ్య 5 ఉన్న వారికి మాత్రం కొత్త పరిస్థితులు ఆసక్తిని కలిగిస్తాయి. వీరు మార్పులకు త్వరగా అలవాటు పడతారు.

ఈ లక్షణం వల్ల జీవితంలో ఎదురయ్యే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. సవాళ్లను కూడా విజయాలుగా మార్చుకునే నైపుణ్యం వీరికి ఉంటుంది.

న్యూమరాలజీ ప్రకారం.. మూల సంఖ్య 5 కలిగిన వ్యక్తులు తెలివితేటలు, ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ స్కిల్స్‌, ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో ప్రత్యేకంగా నిలుస్తారు. వీరి మాటతీరు, చురుకుదనం, మార్పులను స్వీకరించే స్వభావం జీవితంలో విజయాలు సాధించడానికి సహాయపడతాయి.

Related News

ఆలుగడ్డలు 5 నెలల పాటు తాజాగా ఉండాలా? అయితే ఆ ప్రదేశంలో పెట్టండి!

రోగాలు మాయం.. వర్షాకాలంలో కచ్చితంగా తినాల్సిన కూరగాయలు

వర్షాకాలంలో జుట్టు రాలడం, చుండ్రు సమస్యలా ?

టమాటా సైజును బట్టి ఆరోగ్య ప్రయోజనాలుంటాయా? నిపుణులు ఏమంటున్నారంటే..!

ప్రతిరోజూ సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? ఈ 10 అలవాట్లు మీ జీవితాన్ని మార్చగలవు

చిన్న కిచెన్ ఉన్నవారికి గుడ్ న్యూస్.. టాప్ 5 స్పేస్-సేవింగ్ ఫ్రిజ్‌లు బడ్జెట్ ధరలోనే

ఇంట్లో కత్తి మొద్దుబారిపోయిందా? పదును పెంచడానికి న్యూస్‌పేపర్‌ ఉంటే చాలు.. ఎలాగంటే

మీ ఇల్లంతా సువాసన, ఫ్రెష్ గాలితో నిండిపోతుంది.. కేవలం ఈ మొక్కలు పెంచితే చాలు

Big Stories

Advertisement
×