E-Paper
Advertisement

ప్రయాణాల్లో 5G నెట్‌వర్క్‌ను ఆన్‌లో ఉంచుతున్నారా? జరిగే నష్టం తెలిస్తే ఇంకెప్పుడూ అలా చేయరు!

ప్రయాణాల్లో 5G నెట్‌వర్క్‌ను ఆన్‌లో ఉంచుతున్నారా? జరిగే నష్టం తెలిస్తే ఇంకెప్పుడూ అలా చేయరు!
Advertisement

5G Battery Drain: మనదేశంలో జియో, ఎయిర్‌టెల్ లాంటి సంస్థలు 5G నెట్‌వర్క్‌ను చాలా వేగంగా విస్తరించాయి. దీనివల్ల హైస్పీడ్ ఇంటర్నెట్, స్మూత్ స్ట్రీమింగ్, గేమింగ్ అనుభవం లభిస్తున్నప్పటికీ.. చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య బ్యాటరీ త్వరగా అయిపోవడం. మీ ఫోన్ ఛార్జింగ్ కూడా మునుపటి కంటే వేగంగా తగ్గిపోతుంటే.. దానికి 5G నెట్‌వర్కే ముఖ్య కారణం.

5Gలోనే ఎందుకీ సమస్య?

సాధారణ 4G నెట్‌వర్క్‌తో పోలిస్తే.. 5G ఎక్కువ డేటాను చాలా వేగంగా ప్రాసెస్ చేస్తుంది. ఈ వేగాన్ని అందుకోవడానికి ఫోన్ ప్రొసెసర్, సాఫ్ట్‌వేర్ మునుపటి కంటే ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ యాక్టివిటీస్ కూడా పెరగడం వల్ల బ్యాటరీపై ఒత్తిడి పడి, ఛార్జింగ్ త్వరగా అయిపోతుంది. అయితే, కొత్తగా వస్తున్న ఫోన్లలో మెరుగైన ప్రొసెసర్లు, పెద్ద బ్యాటరీలు ఉండటం వల్ల ఈ సమస్య కాస్త తక్కువగా కనిపిస్తుంది.

Advertisement

Also Read: పాడ్‌కాస్ట్‌ల కోసం యూట్యూబ్‌లోకి ఏఐ ఎంట్రీ.. ఇక మీ మూడ్‌ను బట్టే కంటెంట్!

ప్రయాణాల్లోనే ఎక్కువ:

ఏదైనా ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా సిగ్నల్ లేనిచోట ఉన్నప్పుడు 5G సిగ్నల్స్ స్థిరంగా ఉండవు. అలాంటప్పుడు ఫోన్ నిరంతరం 4G, 5G నెట్‌వర్క్‌ల మధ్య మారుతూ ఉంటుంది. ఇలా బెస్ట్ సిగ్నల్ కోసం ఫోన్ ఎక్కువ శ్రమించడం వల్ల బ్యాటరీ చాలా వేగంగా అయిపోతుంది.

బ్యాటరీని ఆదా చేసుకోండిలా:

Advertisement

ఈ సమస్యను అధిగమించడానికి ఫోన్‌లోని ‘అడాప్టివ్ బ్యాటరీ’ ఫీచర్‌ను ఆన్ చేసుకోవాలి. ఇది యాప్స్ వాడకాన్ని బట్టి బ్యాక్‌గ్రౌండ్ పవర్‌ను నియంత్రిస్తుంది. అలాగే ఛార్జింగ్ తక్కువగా ఉన్నప్పుడు ‘బ్యాటరీ సేవర్’ మోడ్‌ను ఆన్ చేయడం ద్వారా అనవసరమైన నెట్‌వర్క్ పనులను ఆపవచ్చు. అవసరం లేనప్పుడు మొబైల్ డేటాను పూర్తిగా బంద్ చేయడం కూడా మంచి అలవాటే.

సిగ్నల్ లేనప్పుడు 4G వాడొచ్చు:

మీరు ఉన్న ప్రాంతంలో 5G సిగ్నల్ సరిగ్గా అందకపోతే.. ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి నెట్‌వర్క్‌ను మాన్యువల్‌గా 4Gకి మార్చుకోవడం ఉత్తమం. దీనివల్ల ఫోన్ పదే పదే సిగ్నల్ కోసం వెతకడం ఆగిపోతుంది. ఫలితంగా బ్యాటరీ లైఫ్ చాలా వరకు పెరుగుతుంది. ఈ చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా 5G స్పీడ్‌ను ఆస్వాదిస్తూనే.. బ్యాటరీని కూడా కాపాడుకోవచ్చు.

Also Read: వాషింగ్ మెషిన్ నుంచి కాలిన వాసన వస్తోందా? వెంటనే ఈ పని చేయకపోతే ఎప్పుడైనా పేలొచ్చు!

Related News

ఇంట్లో Wi-Fi డెడ్ జోన్స్‌కు సింపుల్ సొల్యూషన్.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఇలా చేయండి!

వాషింగ్ మెషీన్‌ను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఈ విషయం తెలుసా?

AIతో పెరుగుతున్న సైబర్ మోసాలు.. మీ డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోండిలా!

BSNL కనివిని ఎరుగని ప్లాన్స్.. రోజుకు రూ.5 మాత్రమే.. 80 రోజులపాటు మీ ఇష్టం!

కొత్త 5G ఫోన్‌తో ఫిలిప్స్ రీ-ఎంట్రీ.. సెప్టెంబర్ 2న ఏం లాంచ్ చేయనుందంటే?

బ్యాటరీ ఎక్కువకాలం మన్నాలంటే 80-20 రూల్ పాటించాల్సిందేనా?

ఒకప్పుడు ఇవే స్టేటస్ సింబల్.. 90లలో ఫేమస్ అయిన 5 ఫోన్లు ఇవే!

మ్యాక్‌లో సిస్టమ్ స్టోరేజ్ పెరిగిపోయిందా? ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా ఖాళీ చేసి స్పీడ్ పెంచండి!

Big Stories

Advertisement
×