April Fools Day Pranks: ఏప్రిల్ ఫూల్స్ డే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ రోజు స్నేహితులు, కుటుంబ సభ్యులను ఆటపట్టించడానికి సరదాగా జోకులు, ప్రాంకులు చేసి ఎంజాయ్ చేస్తుంటారు. ఈ కాస్త సమయం ఫన్నీగా ఎంజాయ్ చేస్తే మనసు రిఫ్రెష్ అవుతుంది. జీవితంలో ఒత్తిడి తగ్గుతుంది. అయితే ఈ ప్రాంక్స్ ఎప్పుడూ సురక్షితంగా, గౌరవంగా ఉండాలి. ఎవరినీ బాధపెట్టకుండా, కేవలం సరదా కోసం చేసిన ప్రాంక్ అని స్నేహితులకు త్వరగా నిజం చెప్పాలి. అంతేకాని వారిని బాధపెట్టకూడదు.
లంచ్ బాక్స్‌లో ఇసుక, చిన్న చిన్న రాళ్లు పెట్టి ఫాయిల్‌తో చుట్టండి. మీ ఫ్రెండ్ దగ్గరకు వెళ్లి అతని కోసం మీ అమ్మ అతని ఫేవరెట్ స్నాక్స్ పంపించిందని చెప్పండి. బాక్స్ తెరిచినప్పుడు అతని ముఖంలో రియాక్షన్ చూడండి. ఇది లైట్ హార్టెడ్ ఫన్నీ ప్రాంక్.
కొన్ని క్రీమ్ బిస్కెట్లలు తీసుకోంది. అందులోనుంచి క్రీమ్ తొలగించి, అందుకు బదులు వైట్ టూత్‌పేస్ట్ పూయండి. మీరు మాత్రం అసలైన క్రీమ్ ఉన్న బిస్కెట్ తింటూ మీ ఫ్రెండ్ ఆ టూత్ పేస్ట్ ఉన్న బిస్కెట్స్ ఆఫర్ చేయండి. అతను పొరపాటున తిన్నాడా.. అతని ముఖంలో రకరకాల రియాక్షన్స్ చూడండి. చాలా ఫన్నీగా ఉంటుంది.
స్నేహితుడి స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ కాసేపు పనిఉందని మీరు తీసుకోండి. అందులో అతనికి తెలియకుండా క్రాక్డ్ స్క్రీన్ (పగిలిపోయినట్లుగా కనిపించే స్క్రీన్) వాల్‌పేపర్ సెట్ చేయండి. ఆ తరువాత అతను బిజీగా ఉన్నసమయంలో ఆ ల్యాప్‌టాప్ సైలెంట్‌గా అతని పక్కన పెట్టేయండి. అతను దాన్ని తెరిచి చేసినప్పుడు స్క్రీన్ పగిలినట్లు కనిపిస్తుంది. అప్పుడు అతను పడే ఆందోళన మామూలుగా ఉండదు. కడుపుబ్బ నవ్వుకొని ఎంజాయ్ చేయండి.
మీ ఫ్రెండ్ ఫోన్ తీసుకొని అందులో రోజంతా వివిధ సమయాల్లో ఫన్నీ సౌండ్స్‌తో అలారం సెట్ చేయండి. ఫోన్‌లో ప్రతి కాసేపటికి వింత సౌండ్స్‌తో అలారం మోగితే అతని ముఖంలో గందరగోళం చూసి ఆనందించండి.
ఒక అద్భుతమైన ఆన్‌లైన్ డిస్కౌంట్ డీల్ ఉందని మీ సిస్టర్, బ్రదర్ లేక ఫ్రెండ్‌కు చెప్పండి. ఉదాహరణకు ఐఫోన్ లేదా ప్రీమియం గెలాక్సీ ఫోన్ సగం ధరకు లభిస్తోందని, త్వరగా ఆఫర్ అయిపోతుందని చెప్పండి. అది విని అతను ఉత్సాహంగా అన్ని సైట్స్‌లో సెర్చ్ చేస్తాడు. కానీ ఆ ఆఫర్ గురించి ఎక్కడా సమాచారం ఉండదు.
మీ ఆఫీస్ ఫ్రెండ్ బిజీగా ఉన్నప్పుడు “బాస్ కాల్ చేశాడు, చాలా ఆగ్రహంగా ఉన్నాడు” అని చెప్పండి. అతను తక్షణం కాల్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అతను పొరపాటున బాస్‌కు కాల్ చేశాడా? నిజం తెలిసి అతని ఫేస్ రకరకాలుగా ఉంటుందండి.
మీ ప్రియురాలు లేక ప్రియుడిని ఫోన్ చేసి.. ఇక మీరు రిలేషన్ కొనసాగించలేరని బ్రేకప్ అని నటించండి. కొంతసేపు సీరియస్‌గా మాట్లాడి తర్వాత నవ్వుతూ మీరు “ఏప్రిల్ ఫూల్” అనండి.
టీలో చక్కెర బదులు ఉప్పు వేసి ఇవ్వండి. అది తాగిన మీ ఫ్రెండ్ ఫేస్ చూసి ఎంజాయ్ చేయండి.
Also Read: ఆ దేశంలో టాయ్‌లెట్ సీట్‌కు పూజలు చేస్తున్న ప్రజలు.. ఈ సంప్రదాయం వెనుక విచిత్ర కారణం
మీ ఫ్రెండ్‌తో ఇలా చెప్పండి. “నీ పెళ్లి ఫిక్స్ అయింది, మీ నాన్న నాకు ఫోన్ చేశారు” అని సీరియస్‌గా సమాచారం అందిస్తున్నట్లు చెప్పండి. అయితే మీరు బాగా నటిస్తూ చెప్పాలి. అది విని మీ ఫ్రెండ్ షాకింగ్ ఫేస్ రియాక్షన్ అమూల్యం.
మీరు చేసే ఏప్రిల్ ఫూల్ ప్రాంక్స్.. ఎప్పుడూ సురక్షితంగా, గౌరవంగా ఉండాలి. ఎవరినీ బాధపెట్టకండి. ప్రాంక్ ముగించేటప్పుడు ఇదంతా “ఏప్రిల్ ఫూల్!” అని నవ్వుతూ నిజం చెప్పండి. ఒకవేళ వారు బాధపడితే క్షమాపణలు వెంటనే చెప్పండి.