E-Paper
Advertisement

Saffron Benefits: క్యాన్సర్‌ని ఎదుర్కొనే శక్తి దీనికి ఉందా? పీరియడ్స్ నొప్పులకూ బెస్ట్ సొల్యూషన్ అంటున్న నిపుణులు!

Saffron Benefits: క్యాన్సర్‌ని ఎదుర్కొనే శక్తి దీనికి ఉందా? పీరియడ్స్ నొప్పులకూ బెస్ట్ సొల్యూషన్ అంటున్న నిపుణులు!
Advertisement

Saffron Benefits: పూర్వ కాలం నుంచి నేటి వరకు సుగంధ ద్రవ్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది కుంకుమ పువ్వు. కాలం ఎంత వేగంగా పరుగులు పెడుతున్నా.. లిల్లీ కుటుంబానికి చెందిన ఈ కుంకుమ పువ్వుకు మాత్రం డిమాండ్ తగ్గదు. కాకపోతే ఇది కాస్త ఖరీదైనది. అంతేకాదు.. కుంకుమ పువ్వు మన దేశంలో కశ్మీర్‌లోనే ఎక్కువగా లభిస్తుంది. ఇక విదేశాల్లో అయితే వీటిని విరివిగా వాడుతుంటారు. ఎందుకంటే.. అక్కడ కుంకుమ పువ్వులను ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు కాబట్టి. కుంకుమ పువ్వులకు ఉన్న డిమాండ్ వల్ల వంటల్లోనూ చాలా అరుదుగా వాడుతుంటారు.

ఔషధ గుణాలు మెండు:

ఎంతో అపురూపమైన ఈ కుంకుమ పువ్వు సహజసిద్ధమైన ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. వీటిని బిర్యానీ, కుక్కీస్, కేక్స్, స్వీట్స్‌లో ఎక్కువగా వాడుతుంటారు. అలాగే ఆయుర్వేద మందులు, కొన్ని ఆధునిక మెడిసిన్స్‌లో సైతం కుంక‌మ‌ పువ్వుల వాడకం ఉంటుంది. ముఖ్యంగా డ‌యాఫోరేటిక్‌గా, కార్మినేటివ్‌గా, పీరియడ్స్ రావడానికి వీటిని వాడుతుంటారు. అయితే ఇన్ని రకాలుగా ఉపయోడపడుతున్న ఈ సుగంధ ద్రవ్యం.. మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఆ వివరాల్లోకి వెళితే..

Advertisement

Also Read: రోజంతా శరీరం ఉత్సాహంగా ఉండాలంటే.. నిద్రలేవగానే ఈ ఒక్క పనిచేస్తే చాలు!

క్యాన్సర్ కణాలను తరిమి కొడుతుంది:

కుంకుమపువ్వు అనేది కేవలం వంటల్లో వాడే సువాసన ద్రవ్యం మాత్రమే కాదు. దీన్ని సరైన విధంగా వినియోగిస్తే శరీరానికి అనేక ఆరోగ్య లాభాలు అందుతాయి. దీనిలో ఉండే క్రోసిన్ అనే సహజ పదార్థం శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడమే కాకుండా, హానికరమైన కణాలు స్వయంగా నశించేలా చేసే ప్రక్రియను (అపోప్టోసిస్) ప్రోత్సహిస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా అండాశయం, పెద్దప్రేగు, మృదుకణజాలానికి సంబంధించిన కొన్ని క్యాన్సర్లపై ఇది ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.

పీరియడ్స్‌నూ తెప్పించగలదు:

Advertisement

అంతేకాదు.. క్యాన్సర్ కణాలతో పోరాడే లింఫోసైట్‌లు వంటి రోగనిరోధక కణాల ఉత్పత్తిని కూడా కుంకుమపువ్వు ప్రేరేపిస్తుంది. వయస్సు పెరిగే కొద్దీ వచ్చే బలహీనత, జ్ఞాపకశక్తి తగ్గుదల వంటి సమస్యలను తగ్గించడంలో కూడా ఇది సహాయకారిగా పనిచేస్తుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో వయస్సు వచ్చినా బాలికల్లో పీరియడ్స్ ప్రారంభం కావడం ఆలస్యం అవుతుంది. అలాంటి వారికి గోరువెచ్చని పాలలో కొద్దిగా కుంకుమపువ్వు కలిపి ఇవ్వడం ద్వారా హార్మోన్ల పనితీరు మెరుగుపడే అవకాశం ఉంటుంది.

లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది:

దీంతోపాటు లైంగిక ఆసక్తి లేదా సామర్థ్యం తగ్గినవారిలో కూడా ఇది సహజంగా ఉత్తేజాన్ని కలిగిస్తుందట. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ పాలలో చిటికెడు కుంకుమపువ్వు కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే జుట్టు రాలడం, పెరుగుదల మందగించడం వంటి సమస్యలకు కూడా కుంకుమపువ్వు ఉపయోగకరంగా ఉంటుంది. పాలతో కలిసి తీసుకుంటే జుట్టు పెరుగుదల మెరుగవుతుందని చెబుతారు.

సీజనల్ ఇన్ఫెక్షన్స్‌కు చెక్:

ముఖ్యంగా శీతాకాలంలో వచ్చే సీజనల్ ఇన్ఫెక్షన్స్.. జలుబు, జ్వరం వంటి సమస్యలనూ కుంకుమ పువ్వు తరిమి కొడుతుంది. అలాగే పాలలో కలిపిన కుంకుమపువ్వును నుదిటిపై రాయడం ద్వారా తలనొప్పి, జ్వరం తీవ్రత తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక వంటల్లో కృత్రిమ రంగుల స్థానంలో సహజమైన రంగు కోసం కుంకుమపువ్వును ఉపయోగించవచ్చు. ఇది ఆరోగ్యానికి హాని లేకుండా వంటలకు ఆకర్షణీయమైన రంగును అందిస్తుంది.

కండీషన్స్ అప్లై:

అయితే కుంకుమపువ్వు ఎంత ప్రయోజనకరమైనదైనప్పటికీ.. మోతాదుకు మించి తీసుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా గర్భిణీలు, పాలిచ్చే తల్లులు దీనిని వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. అధికంగా వినియోగిస్తే కొన్ని సందర్భాల్లో ఇది దుష్ప్రభావాలు కలిగించే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి.. కుంకుమపువ్వును ఎప్పుడూ తక్కువ మోతాదులో, అవసరానికి తగ్గట్టుగా మాత్రమే ఉపయోగించాలి.

Also Read: ఇక ఖరీదైన పెర్ఫ్యూమ్స్‌కు గుడ్‌బై.. సహజసిద్ధంగా ఇంట్లోనే తయారు చేసుకునే సింపుల్ మార్గం ఇదిగో!

 

 

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×