E-Paper
Advertisement

All of Us Are Dead 2 : క్రేజీ కొరియన్ జాంబీ సిరీస్ ‘ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్ సీజన్ 2’ అప్డేట్… మరో బ్యాడ్ న్యూస్ కూడా

All of Us Are Dead 2 : క్రేజీ కొరియన్ జాంబీ సిరీస్ ‘ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్ సీజన్ 2’ అప్డేట్… మరో బ్యాడ్ న్యూస్ కూడా
Advertisement

All of Us Are Dead 2 : కొరియన్ డ్రామాలను ఇష్టపడే మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్. జాంబీ హారర్ సిరీస్ ‘ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్ సీజన్ 2’ (All of Us Are Dead Season 2) గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్న వాళ్ళ కోసమే ఈ అప్డేట్. మరి ఆ అప్డేట్ ఏంటి ? దీని వల్ల తెలిసిన బ్యాడ్ న్యూస్ ఏంటి ? ఇంతకీ సిరీస్ ఎప్పుడు రాబోతోంది ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

‘ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్’ సిరీస్ గురించి కొరియన్ మూవీ లవర్స్ కు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సిరీస్ ను ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఎండ్ అయ్యే దాకా ఆపలేము అంత అద్భుతంగా ఉంటుంది. మొత్తం స్కూల్ స్టూడెంట్స్ చుట్టూ తిరిగే కథ ఇది. కామెడీ నుంచి ఎమోషన్ వరకు అన్ని రకాల ఎమోషన్స్ ను పర్ఫెక్ట్ గా ఇందులో మేళవించారు. సిరీస్ లో ప్రతీ ఒక్క పాత్ర కనెక్ట్ అవుతుంది. వాళ్ళు నవ్వినప్పుడు మనం నవ్వుతాము. వాళ్ళు ఏడ్చినప్పుడు మనం కూడా ఏడుస్తాం. ఇక క్లైమాక్స్ ను అయితే ఊహించనేలేము. మరి ఇంత అద్భుతమైన ఈ సిరీస్ ను చూశాక కూడా సీక్వెల్ గురించి వెయిట్ చేయగలమా ?

Advertisement

ఈ క్రమంలోనే తాజాగా సిరీస్ సీక్వెల్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. “ఆల్ ఆఫ్ అస్ సీజన్ 2” (All of Us Are Dead 2) చాలా రోజులుగా షూటింగ్ దశలో ఉంది. అయితే 2026 ఫిబ్రవరి నాటికి షూటింగ్ ముగుస్తుందని సమాచారం. తదుపరి షెడ్యూల్ చిత్రీకరణ వచ్చే వారం అంటే జనవరి 17, 18 తేదీలలో గ్యాంగ్వాన్ ప్రావిన్షియల్ ప్రభుత్వ పాఠశాలలో జరుగుతుందని టాక్ నడుస్తోంది. కానీ ఈ సిరీస్ గురించి ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు ఇదే బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు.

Read Also : మోస్ట్ అవైటింగ్ ఇంటెన్స్ మెడికల్ డ్రామా షురూ… ఇండియాలో ఏ ఓటీటీలో చూడొచ్చంటే ?

బ్యాడ్ న్యూస్ ఏంటంటే ?

Advertisement

‘ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్ సీజన్ 2’లో మొదటి సీజన్ లో నటించిన పార్క్ జి-హూ (ఆన్-జో), యూన్ చాన్-యంగ్ (చియోంగ్-సాన్), చో యి-హ్యూన్ (నామ్-రా), మరియు లియోమోన్ (సు-హ్యోక్) తిరిగి తమ పాత్రల్లో కన్పించబోతున్నారు. అలాగే కొంతమంది కొత్త యాక్టర్స్ కూడా ఇందులో నటిస్తున్నారు. కొత్త నటులు లీ మిన్ జే, కిమ్ సి యూన్, రోహ్ జే వోన్, యున్ గా ఇయో ఆ లిస్ట్ లో ఉన్నారు. ఇక బ్యాడ్ న్యూస్ విషయానికి వస్తే… డిసెంబర్ 2026 నాటికి మేకర్స్ ‘ఆల్ ఆఫ్ అస్ సీజన్ 2’ని విడుదల చేస్తారని గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఈ హర్రర్ సిరీస్ పేరు నెట్‌ఫ్లిక్స్ 2026 అప్ కమింగ్ రిలీజ్ ల లిస్ట్ లో కన్పించడం లేదు. అంటే దీన్ని 2027లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. ఈ ఏడాది సీజన్ 2 వస్తుందని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కొరియన్ డ్రామా ప్రియులకు నిజంగా ఇది చేదు వార్తే. కాగా సీజన్ 1 నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Tags

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×