E-Paper
Advertisement

Natural Perfumes: ఇక ఖరీదైన పెర్ఫ్యూమ్స్‌కు గుడ్‌బై.. సహజసిద్ధంగా ఇంట్లోనే తయారు చేసుకునే సింపుల్ మార్గం ఇదిగో!

Natural Perfumes: ఇక ఖరీదైన పెర్ఫ్యూమ్స్‌కు గుడ్‌బై.. సహజసిద్ధంగా ఇంట్లోనే తయారు చేసుకునే సింపుల్ మార్గం ఇదిగో!
Advertisement

Natural Perfumes: మారుతున్న కాలంతో పాటు మనుషులు కూడా తమ అలవాట్లు, అభిరుచులు, ధరించే దుస్తులు.. ఇలా ఒకటేమిటీ అన్ని విధాలుగా ట్రెండ్‌ను ఫాలో అయిపోతున్నారు. కాలేజీకి వెళ్లాలన్నా, ఆఫీసు లేదా ఏదైనా పార్టీ, ఫంక్షన్లకు వెళ్లాలన్నా అందరికీ ముందుగా గుర్తొచ్చేది మంచి పెర్ఫ్యూమ్ మాత్రమే. ఎందుకంటే.. పదిమందిలో ప్రత్యేకంగా నిలవాలంటే మంచి వస్త్రధారణతో పాటు సువాసన కూడా చాలా ముఖ్యం. అయితే పెర్ఫ్యూమ్స్‌ కోసం కొంతమంది వేలల్లో డబ్బులు ఖర్చుపెడుతుంటారు. దీనివల్ల మంచి వాసనతో పాటు రోగాలు కూడా వస్తాయనే విషయాన్ని మర్చిపోతున్నారు. కాబట్టి.. నేచురల్ పద్ధతిలో ఇంట్లోనే పెర్ఫ్యూమ్ ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రాసెస్ సులభమే:

ఇంట్లో పెర్ఫ్యూమ్ తయారు చేయడం మీరు అనుకున్నంత కష్టం ఏమీకాదు. పైగా దీనికి ఎక్కువ పదార్థాలు అవసరం కూడా లేదు. కేవలం కొన్ని సాధారణ వస్తువులతోనే మీరు నాణ్యమైన సువాసన వెదజల్లే పెర్ఫ్యూమ్‌ను తయారు చేసుకోవచ్చు. దీని కోసం కాస్త సమయం, ఓపిక ఉంటే చాలు.

Advertisement

Also Read: ప్రపంచాన్ని వణికిస్తున్న సూక్ష్మజీవి.. ‘బ్రెయిన్ ఈటింగ్ అమీబా’తో 99% మందికి ప్రాణాంతకం!

అవసరమైన పదార్థాలు:

ముందుగా పెర్ఫ్యూమ్బేస్ తయారీ మీకు నచ్చిన బేస్ ఆయిల్‌ను ఎంచుకోండి. దీనికి జోజోబా ఆయిల్ లేదా గ్రేప్‌సీడ్ ఆయిల్ కూడా ఉపయోగించవచ్చు. ఇవి సువాసనను ఎక్కువసేపు నిలిపి ఉంచుతాయి. తర్వాత ఎసెన్షియల్ ఆయిల్స్‌లో మీరు ఇష్టపడే సువాసనలను వీటిలో ఎంచుకోవచ్చు. అంటే.. లావెండర్, రోజ్, జాస్మిన్, సిట్రస్, వెనిల్లా, ప్యాచౌలి వంటి ఆయిల్స్ మంచి స్మెల్‌ను వెదజల్లుతాయి. ఇక చివరిగా పెర్ఫ్యూమ్ ఆల్కహాల్ లేదా అవోవిన్ తీసుకోవాలి. ఒకవేళ మీకు తేలికపాటి సువాసన కావాలంటే.. కొద్దిగా డిస్టిల్డ్ వాటర్ కూడా కలుపుకోవచ్చు.

ముందుగా ఇవి తెలియాలి:

Advertisement

పెర్ఫ్యూమ్‌లో మూడు రకాల సువాసన స్థాయిలు ఉంటాయి. వాటినే టాప్ నోట్స్, మిడిల్ నోట్స్, బేస్ నోట్స్ అంటారు. టాప్ నోట్స్ అంటే.. పెర్ఫ్యూమ్ వేసిన వెంటనే వచ్చే వాసన. ఇవి సాధారణంగా నిమ్మ, నారింజ వంటి తాజా సువాసనలను కలిగి ఉంటాయి. ఇక మిడిల్ నోట్స్ అంటే.. టాప్ నోట్స్ తగ్గిన తర్వాత కనిపిస్తాయి. ఇవి లావెండర్, రోజ్ వంటి పూల వాసనలు కలిగి ఉంటాయి. బేస్ నోట్స్ ఎక్కువసేపు నిలిచే వాసనలు. ఇవి వెనిల్లా, గంధం, కస్తూరి వంటి లోతైన సువాసనలను ఇస్తాయి.

ఇదిగో తయారీ విధానం:

మీకు ఎక్కువ సమయం నిలిపి ఉంచే మంచి పెర్ఫ్యూమ్ కావాలంటే.. మీరు తీసుకున్న పదార్థాలు సరైన పరిమాణంలో ఉండాలి. సాధారణంగా 30 శాతం టాప్ నోట్స్, 50 శాతం మిడిల్ నోట్స్, 20 శాతం బేస్ నోట్స్ కలపాలి. ముందుగా ఒక చిన్న గాజు బాటిల్‌లో పెర్ఫ్యూమ్ ఆల్కహాల్ తీసుకుని, ఎంపిక చేసిన ఆయిల్స్‌ను జోడించాలి. అవసరమైతే కొద్దిగా నీరు కలిపి బాటిల్‌ను బాగా కుదిపేయాలి. ఆ తర్వాత ఆ బాటిల్‌ను మూసి, చల్లని ప్రదేశంలో 2 నుంచి 3 రోజులు ఉంచాలి. ఈ సమయంలో సువాసనలు బాగా కలుస్తాయి. ఆ తర్వాత మీరు తయారు చేసిన పెర్ఫ్యూమ్‌ను వాడుకోవచ్చు.

Also Read: వారణాసి కోసం మహేష్ బాబు స్పెషల్ ట్రైనింగ్.. ప్రాచీన యుద్ధకళ ‘కలరిపయట్టు’తో సూపర్ బెనిఫిట్స్!

 

 

 

Related News

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

Big Stories

Advertisement
×