E-Paper
Advertisement

Chicken Liver: చికెన్ లివర్ తినకూడదా? దీన్ని తినడం ఉపయోగాలేంటి?

Chicken Liver: చికెన్ లివర్ తినకూడదా? దీన్ని తినడం ఉపయోగాలేంటి?
Advertisement

చికెన్ లివర్ తినడం మంచిదా? తినకూడదా? అనే సందేహం చాలామందికి ఉంటుంది.ఈ లివర్‌ రుచిగా ఉండటమే కాదు, అందులో ఉన్న ప్రోటీన్, ఐరన్, విటమిన్ A, B12 వంటి పోషకాలు ఆరోగ్యానికి మంచివని వైద్య నిపుణులు చెబుతారు. ముఖ్యంగా రక్తహీనత ఉన్న వాళ్లకు ఐరన్ ఎక్కువగా అవసరం. ఆ అవసరాన్ని చికెన్ లివర్ తీరుస్తుంది. అయితే లివర్‌లో కొవ్వు, కొలెస్ట్రాల్ కూడా అధికంగా ఉంటుంది. అందువల్ల ఇది అందరికీ మంచిదని చెప్పలేమని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి చికెన్ లివర్ తినడం పై జాగ్రత్తలు తెలుసుకోవడం ముఖ్యం.

చికెన్ లివర్ తినవచ్చా?
చికెన్ లివర్‌ అంటే కోడి శరీరంలో ఉన్న విషపదార్థాలను ఫిల్టర్ చేసే అవయవం. అందుకే కొందరు దీనిని తినకూడదని భావిస్తారు. అయితే సరైన విధంగా శుభ్రం చేసి, బాగా ఉడికించి తింటే సాధారణంగా హానీ ఉండదని డాక్టర్లు చెబుతున్నారు. కానీ పూర్తిగా ఉడకని చికెన్ లివర్ తింటే ప్రమాదం పెరుగుతుంది. ఎందుకంటే లివర్‌లో బాక్టీరియా, పరాన్నజీవులు ఉండే అవకాశం ఎక్కువ. అవి పూర్తిగా నశించాలంటే లివర్ పూర్తిగా ఉడకాలి. సరిగ్గా ఉడికించకపోతే ఫుడ్ పాయిజనింగ్, కడుపు నొప్పి, విరేచనాలు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే హోటల్స్‌లోనో, వీధి ఫుడ్‌గా లివర్ తింటే ప్రత్యేక శ్రద్ధ అవసరం.

Advertisement

కొలెస్ట్రాల్ ఎక్కువ
చికెన్ లివర్‌లో కొలెస్ట్రాల్‌ స్థాయి చాలా ఎక్కువ. కాబట్టి హార్ట్‌ పేషెంట్లు, బీపీ ఉన్నవారు, కొలెస్ట్రాల్ హైగా ఉండేవారు, షుగర్ ఉన్నవారు ఎక్కువగా తింటే ప్రమాదం పెరుగుతుంది. వారిలో హార్ట్ అటాక్ ప్రమాదం కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే చిన్నపిల్లలు, గర్భిణీలు కూడా జాగ్రత్త పడాలి. లివర్‌లో విటమిన్ A చాలా అధికంగా ఉండటం వల్ల, దీనిని ఎక్కువగా తింటే విటమిన్ A టాక్సిసిటీ రావచ్చు. ఇది తలనొప్పి, వాంతులు, చర్మంపై ఇబ్బందులు, కళ్లకు మబ్బులుగా కనిపించే సమస్యలు కలిగిస్తుంది. ఈ కారణంగా చికెన్ లివర్‌ను వారానికి ఒకసారి లేదా రెండు వారాలకు ఒకసారి మాత్రమే తినటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

పూర్తిగా తినకూడదా?
మొత్తం చూస్తే చికెన్ లివర్‌ పూర్తిగా తినకూడదని చెప్పడం లేదు. కానీ ఇది అందరికీ సరిపడకపోవచ్చు. ఆరోగ్య సమస్యలు లేని వారు పరిమితంగా బాగా ఉడికిన లివర్ తింటే ప్రోటీన్, ఐరన్ లాంటి పోషకాలు అందుతాయి. అయితే హృద్రోగులు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు, గర్భిణీలు, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలి. ఇలా జాగ్రత్తగా పరిమితంగా తీసుకుంటే లివర్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నిర్లక్ష్యంగా లేదా ఎక్కువగా తింటే మాత్రం సమస్యలు రావచ్చు. అందుకే చికెన్ లివర్ తినే ముందు మీ ఆరోగ్య స్థితిని బట్టి నిర్ణయించుకోవడం మంచిది. అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవడం మంచిదిగా నిపుణులు చెబుతున్నారు.

Advertisement

చికెన్ లివర్ తో వేపుడు, లివర్ మసాలా కర్రీ, పెప్పర్ లివర్ ఫ్రై, లివర్ చిక్కుడు కాయ కర్రీ, లివర్ గుడ్డు కూర వంటివి ప్రయత్నించవచ్చు. ఇవన్నీ చాలా రుచిగా ఉంటాయి. అయితే వీటిని బాగా ఉడికించాలని మాత్రం గుర్తుపెట్టుకోండి.

Related News

ఆటిజం ఉన్న పిల్లలకు ఏకాగ్రత మెరుగుపరిచే టెక్నిక్.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు

ఆన్‌లైన్‌లో యువతితో ప్రేమ.. ప్రియురాలిని కలవడానికి 1900 కిమీ ప్రయాణం.. ఏఐ దెబ్బకు మైండ్ బ్లాక్

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×