E-Paper
Advertisement

Gummadi Narsaiah Biopic: పాల్వంచలో గుమ్మడి నర్సయ్య బయోపిక్ షూటింగ్ ప్రారంభం

Gummadi Narsaiah Biopic: పాల్వంచలో గుమ్మడి నర్సయ్య బయోపిక్ షూటింగ్ ప్రారంభం
Advertisement

Gummadi Narsayya Biopic: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర ఆధారంగా నిర్మిస్తున్న చలనచిత్రం షూటింగ్ శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నిరాడంబర జీవితం గడిపిన గుమ్మడి నర్సయ్య ఇల్లందు శాసనసభ్యుడిగా ఐదుసార్లు గెలిచారు. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ తో సహా ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, జారే ఆదినారాయణ పాల్గొన్నారు. గుమ్మడి నర్సయ్య పాత్రలో శివ రాజ్ కుమార్ నటిస్తున్నారు. గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర ఆధారంగా నిర్మిస్తున్న చలనచిత్రం షూటింగ్ ప్రారంభించిన సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. గుమ్మడి నర్సయ్య ప్రజల మనిషి అని కొనియాడారు. ఆయన నిరాడంబర జీవితం, ఎమ్మెల్యే జీతం, ఆస్తులను దానం చేయడం ఎందరికో ఆదర్శం అని చెప్పారు. నర్సయ్య జీవితాన్ని సినిమా రూపంలో తెరకెక్కించడం గొప్ప విషయం అన్నారు.

ఈ సినిమా ద్వారా ప్రజా ప్రతినిధుల జీవితాల్లో సానుకూల మార్పు వస్తుందని తాను ఆశిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇలాంటి స్ఫూర్తిదాయక చిత్రాలకు ప్రభుత్వం తరఫున రాయితీలు అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడతానని హామీ ఇచ్చారు. గుమ్మడి నర్సయ్య లాంటి వ్యక్తులు సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తారని ఆయన అన్నారు. ఈ సినిమా విజయం సాధించాలని మంత్రి ఆకాంక్షించారు.

Advertisement

ALSO READ: Ponnam Prabhakar: తెలంగాణ అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా భాగస్వామ్యం కావాలి: పొన్నం

Related News

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు, భారీ వర్ష సూచన

వాహనారులకు అలర్ట్.. హైదరాబాద్ సిటీలో సద్దుల బతుకమ్మ పండగ, వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×