E-Paper
Advertisement

Airplane Catches Fire: టేకాఫ్ అవుతుండగా విమానంలో మంటలు.. ఫ్లైట్ లో 180 మంది ప్రయాణికులు

Airplane Catches Fire: టేకాఫ్ అవుతుండగా విమానంలో మంటలు.. ఫ్లైట్ లో 180 మంది ప్రయాణికులు
Advertisement

Airplane Catches Fire: 180 మంది ప్రయాణికులతో టేకాఫ్‌కు సిద్ధమవుతుండగా విమానంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బ్రెజిల్‌‌లోని గ్వారుల్హోస్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో ఈ ప్రమాదం జరిగింది. లాటమ్‌ ఎయిర్‌లైన్స్‌‌కు చెందిన ఎయిర్‌బస్‌ ఏ320 విమానం 180 మంది ప్రయాణికులతో టేకాఫ్ కు సిద్ధమైంది. ఇంతలో విమానంలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ఎయిర్ లైన్స్ సిబ్బంది ప్రయాణికులను కిందకు దింపారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు.

ఎయిర్ పోర్టులోనే

బ్రెజిల్‌లోని గ్వారుల్హోస్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో పెద్ద ప్రమాదం తప్పింది. 180 మంది ప్రయాణికులతో టేకాఫ్‌ అవుతుండగా.. లాటమ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ A320 విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విమానం నుంచి పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో.. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు.

Advertisement

Also Read: Indigo Airlines Crisis: ఇండిగోను ఏం చేయలేరు.. సర్కారుకు అంత సీను కూడా లేదు.. ఎందుకో తెలుసా?

లాటమ్ సంస్థ వివరణ

Advertisement

విమానంలో పెద్ద ఎత్తున మంటలు, పొగ వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను రక్షించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే అగ్ని ప్రమాదంపై లాటమ్‌ విమానయాన సంస్థ స్పందించింది. విమానంలో ఎలాంటి మంటలు చెలరేగలేదని, లగేజీ ఎక్కించే లోడర్‌లో అగ్ని ప్రమాదం జరిగిందని పేర్కొంది.

Related News

షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?

19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

రష్యాను కుదిపేసిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలు 7.0 గా నమోదు, నష్టంపై ఇంకా..

బలవంతంగా డ్రగ్స్‌ ఎక్కించి.. ఎఫ్ఐటీ విద్యార్థినిపై అత్యాచారం, అమెరికాలో షాకింగ్ ఘటన

పాఠశాలలో ఓ టీనేజర్ దారుణం.. గన్‌తో కాల్పుల మోత, టీచర్ సహా నలుగురు మృతి, అమెరికాలో ఘటన

Big Stories

Advertisement
×