E-Paper
Advertisement

పిల్లలు కోరింది ప్రతిదీ ఇస్తున్నారా? వారి మనసు నొప్పించకుండా ‘లేదు’ అని ఇలా చెప్పండి

పిల్లలు కోరింది ప్రతిదీ ఇస్తున్నారా? వారి మనసు నొప్పించకుండా ‘లేదు’ అని ఇలా చెప్పండి
Advertisement

Parenting Tips| తమ పిల్లల కోరింది ప్రతి వస్తువు ఇవ్వాలని గారభం చేసే తల్లిదండ్రులు అనుకుంటారు. అందుకే ఎంత కష్టమైనా ఆ వస్తువు తెచ్చివ్వడానికి ప్రయత్నిస్తారు. దానికి కారణం వారికి కుదరదు అని చెబితే వారు బాధపడతారని. అందుకే ‘లేదు’, ‘కుదరదు’ అని చెప్పడం తల్లిదండ్రులకు సులభం కాదు. చాలామంది తల్లిదండ్రులు పిల్లల కోరికను తిరస్కరించినప్పుడు తాము ఏదో తప్పు చేశామనే భావనకు గురవుతారు. అయితే పిల్లలకు క్రమశిక్షణలో పెట్టడానికి, వారి భద్రత కోసం వారు కోరిన అన్ని వస్తువులు ఇవ్వడం కుదరదని చెప్పడం నేర్చుకోవాలి.

ఇలా చేయడం వల్ల పిల్లలు జీవితంలో పరిమితులు, ఓర్పు, గౌరవ భావాన్ని నేర్చుకుంటారు. అయితే పిల్లలకు ‘లేదు’ అనే పదాన్ని చాలా ప్రశాంతంగా, సానుకూల మార్గంలో వారి మనసు నొప్పించకుండా చెప్పాలి.

1. పిల్లలకు ‘లేదు’ అని చెప్పడం ఎందుకు ముఖ్యం?

Advertisement

పిల్లలు బాధ్యతగల వ్యక్తులుగా ఎదగాలంటే సరైన వారి పరిమితులు తెలుసుకోవడం అవసరం. ప్రతీసారి ప్రతీ కోరికను తీర్చుకుంటూ పోతే పిల్లలు మొండివారు అవుతారు. అందుకే వారి తప్పుడు కోరికలు తీర్చడం కుదరదు అని చెప్పడం వల్ల పిల్లలు నియంత్రణ గురించి నేర్చుకుంటారు. వారిని ప్రమాదకర పరిస్థితుల నుండి కాపాడుతుంది.

2. ప్రశాంతంగా, దృఢంగా ‘కుదరదు’ ఎలా చెప్పాలి?

పిల్లలతో వారు కోరింది ఇవ్వడం కుదరదని చెప్పే సమయంలో కోపంగా మాట్లాడకండి, వారిపై అరవకండి. ప్రశాంతంగా మాట్లాడితే పిల్లలకు స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే మీ నిర్ణయం తుది నిర్ణయమని చెప్పడం వల్ల వారు అర్థం చేసుకుంటారు.

3. కారణాన్ని స్పష్టంగా చెప్పాలి

Advertisement

కేవలం “కుదరదు” అనడం వల్ల పిల్లలకు నిరాశ కలుగుతుంది. ఎందుకు కుదరదు.. చిన్నగా, స్పష్టంగా వివరించండి. దీనివల్ల వారు విషయాలను నేర్చుకుంటారు, మీ నిర్ణయాన్ని అంగీకరిస్తారు.

4. సానుకూల భాషలో చెప్పాలి

కఠినమైన పదాలకు బదులు, పిల్లలు ఏమి చేయాలి, ఏమి చేయకూడదో చెప్పండి. ఉదాహరణకు, “టీవీ చూడకు” అని చెప్పకుండా బయట శారీరక ఆరోగ్యం కోసం క్రీడలు ఆడాలని చెప్పండి. ఇలా చెప్పడం వల్ల పిల్లలు మీరు చెప్పే విషయాన్ని నిర్లక్ష్యం చేయకుండా వింటారు.

5. ప్రత్యామ్నాయాలు ఇవ్వాలి

ఒక దాన్ని నిరాకరించినప్పుడు, మరొక ఆప్షన్ ఇవ్వండి. ఉదాహరణకు, టీవీ వద్దు అంటే పుస్తకం చదవమనండి. ప్రత్యామ్నాయాలు చెప్పడం వల్ల పిల్లల్లో నిరాశ తగ్గుతుంది.

6. వారి మానసిక స్థితిని ఎలా గుర్తించాలి?

“కుదరదు” అని వినగానే పిల్లలు బాధపడవచ్చు. అందుకే వారి మనోభావాలను అర్థం చేసుకున్నామని చెప్పండి. దీనివల్ల నమ్మకం పెరుగుతుంది. పిల్లలు చెప్పింది మీరు వింటున్నారని, అర్థం చేసుకుంటున్నారని అనిపిస్తే, మీ నిర్ణయాన్ని వారు సులభంగా అంగీకరిస్తారు.

7. నియమాలలో స్థిరత్వం ఎందుకు ముఖ్యం?

ఒకే విషయానికి కొన్నిసార్లు “అవును”, కొన్నిసార్లు “వద్దు” అంటే పిల్లలు గందరగోళంలో పడతారు. అందుకే స్పష్టమైన, స్థిరమైన నియమాలు అర్థం చేసుకుంటే పిల్లలకు తమకు ఏం చేయడానికి అనుమతిస్తారో అర్థం చేసుకుంటారు.

Also Read: మొదటి ఇంటర్‌వ్యూలోనే ఇంప్రెస్ చేయడమెలా? ఆత్మవిశ్వాసంతో స్మార్ట్‌గా కనిపించేందుకు ఈ టిప్స్

8. తరచూ “కుదరదు” అనడం మంచిది కాదు

అన్ని సమయాల్లో “కుదరదు” అంటే పిల్లలు ఆ మాటను పట్టించుకోరు. అవసరమైనప్పుడు మాత్రమే వారికి నో అని చెప్పండి. కొన్నిసార్లు పూర్తిగా నిరాకరించకుండా, “తర్వాత చెబుదాం” అని ఆలస్యం చేయండి.

9. బాధ్యత, స్వాతంత్ర్యం ఎలా నేర్పించాలి?

పిల్లలు తాము చేసుకోగల పనికి సహాయం అడిగితే, “కుదరదు” అనడం వల్ల వారు స్వతంత్రంగా ఆ పని నేర్చుకుంటారు. వారిని సొంతంగా ప్రయత్నించమని ప్రోత్సహించండి. దీనివల్ల వారిలో ఆత్మవిశ్వాసం, జీవిత నైపుణ్యాలు పెరుగుతాయి.

Related News

జి మెయిల్, ఇన్‌స్టాగ్రామ్, అమెజాన్.. అన్ని అకౌంట్ పాస్ట్‌వర్డ్స్ మర్చిపోతున్నారా? సమస్యకు పరిష్కారం ఇదిగో

చాణక్య నీతి.. ఈ 4 ప్రదేశాల్లో ఇల్లు కొనకూడదు, నిర్మించకూడదు

ఒక్కో సెలైన్ బాటిల్‌కు రూ.15000 చెల్లిస్తున్న యువత.. డాండియా డాన్స్ పిచ్చి.. ఆరోగ్యకరమేనా?

అస్సలు చేదు రాకుండా..కరకరలాడే కాకరకాయ వేపుడు!

15 నిమిషాల్లోనే..నోట్లో కరిగిపోయే కమ్మని రవ్వ బర్ఫీ చేయండిలా!

రెస్టారెంట్ స్టైల్ చికెన్ వేపుడు..ఇలా చేసారంటే టేస్ట్ అదిరిపోద్ది

39 ఏళ్ల వయసులోనూ 22 ఏళ్ల బయోలాజికల్ ఏజ్ సాధించిన మహిళ.. యంగ్ లుక్స్ కోసం ఏం చేసిందంటే

ఒక్కసారి ఇలా షెజ్‌వాన్ చికెన్ నూడుల్స్ చేసి చూడండి.. రుచి మామూలుగా ఉండదు!

Big Stories

Advertisement
×