E-Paper
Advertisement

Kids Focus on Studies: మీ పిల్లాడు సరిగా చదువుకోవడం లేదా? పిల్లల్లో చదువు పట్ల ఆసక్తి పెంచడానికి ఈ ట్రిక్స్ పాటించండి

Kids Focus on Studies: మీ పిల్లాడు సరిగా చదువుకోవడం లేదా? పిల్లల్లో చదువు పట్ల ఆసక్తి పెంచడానికి ఈ ట్రిక్స్ పాటించండి
Advertisement

Kids Focus on Studies| చాలా మంది పిల్లలు చదువుకోవడం కంటే ఆటాడుకోవడం, తినడం లేదా ఎక్కువగా నిద్రపోవడానికి ఇష్టపడతారు. అలాంటి పిల్లలకు చదువు అంటే ఒత్తిడిగా అనిపిస్తుంది అందుకే ఎక్కువ సేపు పుస్తకాలు పట్టుకొని కూర్చోవాలంటే అనాసక్తిగా ఉంటారు. అందుకే ప్రతి రోజు పిల్లలను చదువుకునేందుకు కూర్చోబెట్టడం తల్లిదండ్రులకు పెద్ద సమస్యగా అనిపిస్తుంది. చదువుకోవాల్సిన సమయంలో పిల్లలు ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవాలని చూస్తారు. ఈ సమస్యకు పరిష్కారం ఉంది. కొన్ని సాధారణ ట్రిక్స్‌తో పిల్లల్లో చదువు పట్ల ఆసక్తి పెంచవచ్చు.

మీ పిల్లాడి సమస్య ఏంటో తెలుసుకోవాలి?

ముందుగా పిల్లవాడు చదువుకు దూరంగా ఎందుకు ఉన్నాడో తెలుసుకోండి. ప్రతి పిల్లవాడికి వేర్వేరు కారణాలు ఉండవచ్చు. కొందరికి కొన్ని సబ్జెక్టులు నచ్చవు. మరికొందరు పిల్లలకు పాఠాలు సరిగా అర్థం కాదు కాబట్టి ఆసక్తి చూపరు. టీవీ, మొబైల్ ఫోన్ వంటివి పిల్లల దృష్టి మరల్చవచ్చు. పిల్లలకు చదువుకునే సమయంలో వీటికి దూరంగా ఉంచండి. ఇక్కడ తెలిపిన కారణాల్లో మూల కారణం ఏదో తెలుసుకొని సమస్య పరిష్కరించినప్పుడు పిల్లలు స్వయంగా చదువు సమయంలో శ్రద్ధగా కూర్చొని మీరు చెప్పింది వింటారు.

ప్రతి రోజు ఒక స్థిరమైన సమయం చదువుకునేందుకు కేటాయించండి

Advertisement

పిల్లలను చదువుకోవాలని ఒత్తిడి చేయకూడదు. ప్రతి రోజు ఒక నిర్ణీత సమయంలో వారు చదువుకునేందుకు ఒక షెడ్యూల్ రెడీ చేయండి. దీంతో వారిలో ముందుగా క్రమశిక్షణ పెరుగుతుంది. ఈ అలవాటు వల్ల పిల్లలు మానసికంగా సిద్ధమవుతారు.

చదువు మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ ఇవ్వాలి

పిల్లలను గంటల తరబడి చదువుకునేందుకు నిరంతరం కూర్చోబెట్టవద్దు. అలా ఎక్కువ సేపు ఏకధాటిగా చదువుకోవాలని ఒత్తడి చేస్తే వారు బోర్ ఫిలై, అలసిపోతారు. 15 లేదా 20 నిమిషాలకు ఓసారి 5 నిమిషాల విరామం ఇవ్వండి. ఈ చిన్న బ్రేకుల వల్ల వారు రిఫ్రెష్ అవుతారు. వారికి ఏకాగ్రతతో నేర్చుకోవడం సులభం అవుతుంది.

చదువును ఆసక్తికరంగా మార్చండి

Advertisement

చదువును బోరింగ్‌గా కాకుండా ఎంజాయ్‌మెంట్‌గా మార్చండి. పజిల్స్, గేమ్స్, ఎడుకేషన్ యాప్స్ ఉపయోగించి పిల్లలకు బోధించండి. ఇలా చేస్తే పిల్లలు కూడా ఆసక్తికరంగా పాఠాలు వింటారు. ఇంటరాక్టివ్ లెర్నింగ్ వల్ల పిల్లలు టాపిక్స్ సులభంగా అర్థం చేసుకుంటారు. ఇది వారి ఆసక్తిని పెంచి, త్వరగా నేర్చుకోవడానికి సహాయపడుతుంది.

చిన్న చిన్న లక్ష్యాలు నిర్దేశించండి

ఒక్క రోజులోనే ఎక్కువ పని ఇవ్వకండి. వారికి చిన్న చిన్న టార్గెట్స్ ఇచ్చి పాఠాలు విభజించండి. ఒక్క అధ్యాయం లేదా కొన్ని ప్రశ్నలు మాత్రమే పూర్తి చేయమని చెప్పండి. ఇలా చేస్తే వారిలో చిన్న విజయం సాధించినట్లు భావన కలిగి.. మున్ముందు చదువుకోవడానికి ఇష్టపడతారు. ఇచ్చిన పని పూర్తి చేసినప్పుడు వారు గర్వంగా ఫీలవుతారు.

మీరు కూడా పిల్లల చదువులో పాల్గొనండి

పిల్లలను ఒంటరిగా చదువుకునేందుకు కూర్చోబెట్టకండి. కొంత సమయం వారితో కూర్చొని పాఠ్యాశాల్లో వారికి కష్టంగా ఉంటే సహాయం చేయండి. కష్టమైన టాపిక్స్ వివరించండి. వారితో పాఠాల గురించి మాట్లాడండి, సాధారణ ప్రశ్నలు అడగండి. ఇలా చేస్తే వారు బోర్ ఫీలవకుండా ఎక్కువగా ఎంగేజ్ అవుతారు.

Also Read: యవ్వనంలోనే ముసలితనం ఛాయలు.. దేశంలో పెరుగుతున్న సమస్య.. ధృడమైన శరీరం కోసం ఈ టిప్స్

బోధించే సమయంలో ప్రశాంతంగా, సానుకూలంగా ఉండండి

పిల్లలు పాఠాలు అర్థం చేసుకోవడం లేదని వారి పట్ల కోపం చూపించకూడదు. ఇలా చేస్తే వారిలో భయం వల్ల చదువు పట్ల ఆసక్తి తగ్గుతుంది. ఓర్పుతో ఇంట్లో సానుకూల, వారికి మానసిక మద్దతు ఇచ్చే వాతావరణం సృష్టించండి. ఫలితాల కంటే వారు చేసే ప్రయత్నాలను ప్రోత్సహించండి. మీ ప్రశాంత వైఖరి.. పిల్లల్లో నమ్మకం, విశ్వాసాన్ని పెంచుతుంది.

పిల్లలు చదువుకోవాలంటే సరైన మార్గదర్శకత్వం, ఓర్పు, ప్రోత్సాహం అవసరం. తల్లిదండ్రులు చేసే ఈ చిన్న చిన్న మార్పులు బోధన విధానాల్లో పెద్ద తేడా తీసుకురావచ్చు. ఈ సాధారణ ట్రిక్స్ ఉపయోగించి మీ పిల్లలు చదువు పట్ల ఆసక్తి చూపుతారు, ఇష్టపడి నేర్చుకుంటారు.

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×