Early Aging| భారతదేశంలో కండరాల బలహీనతతో బాధపడే వారి సంఖ్య వేగంగా పెరుగుతొందని తాజాగా ఒక అధ్యయనంలో తేలింది. యువతలో 71 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగం చేసే యువతి యువకులు ఈ ఆరోగ్య సమస్య ఎదుర్కొంటున్నారు. ఒక్క లక్నో నగరంలోనే 80 శాతం కంటే ఎక్కువ మంది కండరాల బలహీననతో బాధపడుతున్నారు.
సరైన పోషకాహారం లేకపోవడం, నిద్ర లేమి, తప్పుడు జీవనశైలి ఈ సమస్యకు అసలు కారణం. ఆయుర్వేదం ఈ సమస్యకు ప్రభావ వంతమైన, సులభమైన పరిష్కారాలు చూపుతోంది. ఈ చిట్కాలు మీ కోసం.
కండరాల బలహీనత వృద్ధుల సమస్య మాత్రమే కాదు. యువతలో కూడా ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. అధ్యయనంలో వెలుగుచూసిన కారణాలు ఇలా ఉన్నాయి.
ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం అంటే వ్యాయామం చేయకపోవడం. ఈ రెండూ ముఖ్య కారణాలు. వీటి వల్లే ముందస్తు వృద్ధాప్యం కనిపిస్తోంది.
చలికాలంలో కండరాల సమస్యలు 20-30% పెరుగుతాయి. తక్కువ టెంపరేచర్‌లో కండరాలు బిగుతుగా మారిపోతాయి. శరీరంలో రక్త ప్రసరణ నెమ్మదిస్తుంది. ఇలాంటి సమయంలో చిన్న దెబ్బ తగిలినా పెద్ద గాయం అయ్యే ప్రమాదమవుతుంది. వాతవరణ మార్పులతో శరీరం త్వరగా అడాప్ట్ చేసుకోవడం కష్టంగా మారుతుంది. అందుకే కండరాల ఆరోగ్యానికి ఎక్స్‌ట్రా కేర్ తీసుకోవాలి.
కండరాలు బలహీనంగా ఉంటే దీని వల్ల సీరియస్ సమస్యలు తలెత్తుత్తాయి. గుండె సంబంధిత రోగాల ప్రమాదం బాగా పెరుగుతుంది. స్ట్రోక్ ఛాన్స్ విపరీతంగా పెరిగిపోతుంది. న్యూరోలాజికల్ డిసార్డర్స్ కూడా రావొచ్చు. శరీరంలో కదలికలు కూడా కష్టతరమవుతాయి. కండరాలు బలహీనమైతే జీవనశైలి ప్రభావితమవుతుంది.
డైలీ వాకింగ్ చేస్తే కండరాల ఆరోగ్యంగా ఉంటాయి. కాల్షియం కోసం రెగ్యులర్‌గా పాటు తాగండి. ఫ్రెష్ ఫ్రూట్స్, ఆకుపచ్చని కూరగాయలు తినండి. ఎక్కువసేపు కూర్చునే అలవాటుని మానుకోవాలి. శరీర బరువుని నియత్రించాలి. ఈ సింపుల్ స్టెప్స్ కండరాలను బలంగా మారుస్తాయి.
జీవనశైలిలో మార్పు
రెగ్యులర్‌గా వ్యాయామం మీ రొటీన్ లైఫ్ లో ఇన్‌క్లూడ్ చేయండి. జంక్ ఫుడ్ పూర్తిగా అవాయిడ్ చేయండి. డైలీ యోగా, ప్రాణాయామం ప్రాక్టీస్ చేయడం మంచిది. యాక్టివ్ లైఫ్‌స్టైల్ ఫాలో అవ్వండి. ఈ మంచి అలవాట్లు ముందస్తు వృద్ధాప్యాన్ని రివర్స్ చేస్తాయి.
శరీరంలో రక్తం తక్కువగా ఉంటే కండరాలు కూడా బలహీనంగా ఉంటాయి. జన్యు సమస్యలు కూడా కండరాల బలహీనతకు కారణమవుతాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే కండరాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఇన్ఫెక్షన్స్ కూడా కండరాలను వీక్ చేస్తాయి.
డైలీ మార్నింగ్ వాకింగ్ స్టార్ట్ చేయండి. వెయిట్ ట్రైనింగ్ ఎక్సర్‌సైజ్ కూడా చేయండి. ప్రోటీన్-రిచ్ హెల్తీ ఫుడ్స్ తినండి. ప్రాసెస్డ్ ఫుడ్స్ పూర్తిగా మానేయండి. ఈ అలవాటకలే కండరాలను బలం మారుస్తాయి.
ఈ ఆయుర్వేద టిప్స్ కండరాల బలహీనతను నివారిస్తాయి. మంచి ఆరోగ్యకరమైన జీవనశైలి ముందస్తు వృద్ధాప్యం ఆపుతుంది. బాడీ ఫిట్‌గా ఉంటుంది, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. గుండె పోటు వంటి ప్రమాదాల అవకాశం తగ్గుతుంది. ఇప్పుడే ఈ ఆయుర్వేద చిట్కాలు పాటించండి.
Also Read: డాన్స్ చేసే సమయంలో గుండెపోటు.. పెరుగుతున్న కేసుల సంఖ్య.. ఇలా నివారించండి