E-Paper
Advertisement

Sri Rama Navami 2026 Wishes: శ్రీరామ నవమి స్పెషల్.. మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Sri Rama Navami 2026 Wishes: శ్రీరామ నవమి స్పెషల్.. మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు చెప్పండిలా !
Advertisement

Sri Rama Navami 2026 Wishes: శ్రీరామ నవమి అంటే కేవలం ఒక పండగ మాత్రమే కాదు, అది ధర్మానికి, సత్యానికి లభించిన విజయం. వసంత నవరాత్రుల ముగింపులో చైత్ర శుద్ధ నవమి నాడు లోక రక్షకుడైన శ్రీ మహావిష్ణువు ‘రాముడి’గా అవతరించిన రోజు ఇది. తండ్రి మాట కోసం అడవులకు వెళ్లిన పితృవాక్య పరిపాలకుడు, ఏకపత్నీ వ్రతుడు, ఆదర్శ పురుషుడైన రాముడి జన్మదినాన్ని, సీతారాముల కళ్యాణాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ ప్రత్యేకమైన రోజున మీ కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలియజేయండిలా..

కోట్స్ :

Advertisement

“ధర్మానికి మారుపేరు… ఆదర్శానికి నిలువుటద్దం.. మన రామయ్య. అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు!”

“రామ నామ స్మరణం – సకల పాప హరణం. జై శ్రీరామ్! శ్రీరామ నవమి శుభాకాంక్షలు!

Advertisement

“నీ కష్టాలన్నీ తీరి, సుఖశాంతులు కలగాలని ఆ కోదండ రాముడిని కోరుకుంటూ.. హ్యాపీ శ్రీరామ నవమి.”

“రామ నామ స్మరణం.. సకల పాప హరణం. ఆ రామచంద్రుడి కృపాకటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ.. శ్రీరామ నవమి శుభాకాంక్షలు!”

“లోక బాంధవుడు, ధర్మ స్వరూపుడు అయిన ఆ కోదండ రాముడి ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ కలగాలి.” హ్యాపీ శ్రీరామ నవమి

“ఎక్కడ రామ నామం వినబడుతుందో.. అక్కడ హనుమంతుడు కొలువై ఉంటాడు. జై శ్రీరామ్!” అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు!

“అయోధ్య రాముడు.. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఆ స్వామి చల్లని చూపు మీపై ఉండాలి.” మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు!

“శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే.. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు!”

“మాట తప్పని నైజం.. మడమ తిప్పని ధైర్యం.. రాముడి తత్వం మనందరికీ ఆదర్శం.” మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు!

“కష్టాల్లో ఉన్నప్పుడు అధర్మం వైపు వెళ్లకుండా.. రాముడిలా ధర్మం వైపు నిలబడదాం.” శ్రీరామ నవమి శుభాకాంక్షలు!

“రామరాజ్యం అంటే కేవలం పాలన కాదు.. ప్రతి ఒక్కరూ నీతిగా, నిజాయితీగా బ్రతికే సమాజం.”మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు!

“తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలిన త్యాగమూర్తి.. ఆదర్శవంతమైన జీవనానికి నిలువుటద్దం మా రామయ్య.” మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు!

“అన్యోన్యతకు నిదర్శనం సీతారాముల బంధం.. మీ వైవాహిక జీవితం కూడా వారిలాగే సుఖ సంతోషాలతో నిండాలి.” మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు!

“జనక నందిని సీతమ్మ.. దశరథ నందన రామయ్య.. వీరిద్దరి జంట లోకానికే ఆదర్శం.”మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు!

“రామ నామం మధురం.. ఆ స్మరణం మనసుకు ఎంతో హాయి. హ్యాపీ శ్రీరామ నవమి!”

“పానకం ఘుమఘుమలు.. వడపప్పు రుచులు.. రామయ్య ఆశీస్సులు! అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.”

“మీ కష్టాలన్నీ తీరి, కోరికలన్నీ నెరవేరాలని ఆ రాముడిని మనసారా వేడుకుంటున్నాను.”మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు!

“చెడుపై మంచి సాధించిన విజయం.. ధర్మం గెలిచిన పర్వదినం. జై శ్రీరామ్!”

“ఈ శ్రీరామ నవమి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను.” అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

Related News

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

Big Stories

Advertisement
×