E-Paper
Advertisement

daughter-in-law: ఎలాంటి  అమ్మాయి కోడలిగా వస్తే అత్తమామలకు అదృష్టం పడుతుందో తెలుసా..?

daughter-in-law: ఎలాంటి  అమ్మాయి కోడలిగా వస్తే అత్తమామలకు అదృష్టం పడుతుందో తెలుసా..?

daughter-in-law: ఎలాంటి అమ్మాయి ఇంటి  కోడలిగా వస్తే  ఆ ఇంట్లో వాళ్లకు అదృష్టం పడుతుందో తెలుసా..? ముఖ్యంగా ఆ కోడలిగా వచ్చిన అమ్మాయి అత్తమామలకు ఎలాంటి శుభప్రదాలను తీసుకొస్తుందో తెలుసా..?

హిందూ సంప్రదాయంలో కోడలిని ఇంటి మహాలక్ష్మిగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం, సాముద్రిక శాస్త్రం, పెద్దల అనుభవాల ప్రకారం, ఒక కుటుంబంలోకి అడుగుపెట్టిన అమ్మాయి వల్ల ఆ కుటుంబం సుభిక్షంగా, సంతోషంగా ఉంటుందని నమ్మడానికి కొన్ని ప్రధాన లక్షణాలు ప్రాతిపదికగా ఉన్నాయంటున్నారు పండితులు. ఆ లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సహనం, ఓర్పు (Patience): ఏ ఇంట్లోనైనా చిన్న చిన్న గొడవలు, అభిప్రాయభేదాలు సహజం. వచ్చిన కోడలు సహనంతో ఉండి, సమస్యలను పెద్దగా చేయకుండా సర్దుకుపోయే స్వభావం కలిగి ఉంటే, ఆ కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. ఓర్పు ఉన్న కోడలు కుటుంబ బంధాలను బలోపేతం చేస్తుందని పండితులు సూచిస్తున్నారు.

పెద్దల పట్ల గౌరవం: ఇంటికి వచ్చిన కొత్త కోడలు అత్తమామలను తన సొంత తల్లిదండ్రులుగా భావించి, వారిని గౌరవించే అమ్మాయి ఇంట్లోకి వస్తే లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువై ఉంటుందని పెద్దల మాట. పెద్దలకు ఇచ్చే గౌరవం, ఆ ఇంట్లోని ఆత్మీయతను పెంచుతుందట.

మితభాషి మరియు వినయం: ఇంట్లోకి కొత్తగా వచ్చిన కోడలు అతిగా మాట్లాడకుండా, సందర్భోచితంగా, మృదువుగా మాట్లాడే అమ్మాయి అయితే ఆ ఇంట్లో అనవసరమైన గొడవలకు తావుండదట. వినయం గల అమ్మాయి తన మాటలతో అత్తమామల మనసును సులభంగా గెలుచుకుంటుందట.

ఇంటి బాధ్యతలను స్వీకరించడం: ఇంటికి వచ్చిన కోడలుగా వచ్చిన అమ్మాయి ఆ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం, కుటుంబం కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం వంటి బాధ్యతలు స్వీకరిస్తే.. ఆ ఇంటికి అదే నిజమైన ఆస్తి అంటున్నారు పండితులు. అటువంటి అమ్మాయి ఇంటిని చక్కదిద్దే తీరు అత్తమామలకు ఎంతో అదృష్టాన్ని తెస్తుందట.

మంచి సంస్కారం, కుటుంబ విలువలు: సనాతన ధర్మం మరియు కుటుంబ విలువలను గౌరవించే అమ్మాయి, భవిష్యత్ తరాలకు కూడా మంచి సంస్కారాన్ని అందిస్తుంది. అత్తమామలు తమ కుటుంబ సంప్రదాయాలు కొనసాగుతున్నాయని చూడటంలోనే ఎంతో ఆనందాన్ని పొందుతారు.

 ధైర్యం మరియు సమస్యలను ఎదుర్కోవడం: ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు కృంగిపోకుండా, కుటుంబానికి అండగా నిలబడి, ధైర్యం చెప్పే కోడలు ఆ ఇంటికి కొండంత అండగా మారుతుందని పండితులు సూచిస్తున్నారు.

జ్యోతిష్య దృక్కోణం (సాముద్రిక శాస్త్రం): జ్యోతిష్య శాస్త్రంలో  స్త్రీ పురుషుల జాతక ఫలితాలు  కేవలం వ్యక్తిగతమే కాకుండా, వారి రాకతో కుటుంబంలో వచ్చే మార్పులను కూడా సూచిస్తాయి. జాతకంలో శుక్రుడు (సుఖకారకుడు) గురువు (జ్ఞానకారకుడు) బలంగా ఉన్న స్త్రీలు కుటుంబానికి శుభాన్ని చేకూరుస్తారని పండితుల చెప్తున్నారు.   ఎవరైనా అమ్మాయి అదృష్టాన్ని తీసుకు వస్తుందంటే, అది కేవలం ఆ అమ్మాయి వల్లే కాకుండా, అత్తమామలు కూడా ఆమెను సొంత కూతురిలా ఆదరించి, ప్రేమిస్తేనే సాధ్యమవుతుందని. ఒక కోడలు మంచిగా ఉండాలంటే, ఆమెకు అత్తమామల నుంచి వచ్చే ప్రోత్సాహం, ప్రేమ, భరోసా కూడా చాలా ముఖ్యమని పండితులు సూచిస్తున్నారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: వాహనాలకు నిమ్మకాయలు, మిరపకాయలు ఎందుకు కడతారో తెలుసా

 

Related News

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే10: ఆ రాశి స్థిరాస్థి వ్యాపారులకు లాభాలు – నిరుద్యోగులకు శుభవార్తలు

Weekly Horoscope May 10 To May 16: ఈ వారం ఆ రాశి రాజకీయ నాయకులకు అద్బుతంగా ఉంటుంది

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 09: ఆ రాశి వారికి వ్యాపారంలో లాభాలు – విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 08: ఆ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది – వారికి వ్యాపారంలో లాభాలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 07: ఆ రాశి వారికి అకస్మిక ధన లాభం – వారికి వ్యాపారాలలో లాభాలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 06: ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం – వారికి ప్రముఖులతో పరిచయం

Big Stories

×