E-Paper
Advertisement

Samuthirakani: ఈఎమ్‌ఐ లను కట్టే వారికి ఈ సినిమా ఒక లెసన్!

Samuthirakani: ఈఎమ్‌ఐ లను కట్టే వారికి ఈ సినిమా ఒక లెసన్!
Advertisement

Samuthirakani: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చక్రి (Ram Chakri) దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో అరుణ్ రంగరాజులు నిర్మిస్తోన్న ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’ (Carmeni Selvam). విలక్షణ నటుడు సముద్రఖని (Samuthirakani) ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మీ ప్రియా, అభినయ ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం థియేటర్స్‌లోకి రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌, టీజర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేయగా, గురువారం (మార్చి 26) చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ (Carmeni Selvam Trailer)ను మేకర్స్ వదిలారు. ప్రస్తుత ట్రెండ్‌కు కనెక్ట్ అయ్యే విధంగా ఫ్యామిలీ ఎమోషన్స్‌తో వచ్చిన ఈ ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసింది.

Also Read- Duvvada Madhuri: వాళ్లంతా జెండా కూలీలే.. ఈసారి ఎన్నికల్లో గెలిచేది ఎవరంటే?

జీవితంలో ఏది ముఖ్యం?

Advertisement

ట్రైలర్‌ని గమనిస్తే.. ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తి తన భార్య, కొడుకుతో కలిసి సంతోషంగా ఉంటూనే, సొంత ఇల్లు కట్టుకోవాలనే కలని ఎలా నెరవేర్చుకోవాలనుకుంటాడు అనే పాయింట్ చుట్టూ ఈ కథ నడుస్తుందనే విషయాన్ని ఈ ట్రైలర్ తెలియజేస్తుంది. ఇందులో తండ్రీ కొడుకుల మధ్య వచ్చే సీన్స్ ఎమోషనల్‌గా టచ్ చేస్తున్నాయి. ‘నువ్వు తెలివైనోడివి నాన్నా’ అని అబ్బాయి అనడం, సమాజంతో సముద్రఖని చేసే పోరాటం ఆకట్టుకునేలా ఉంది. అప్పులు చేసి సంతోషాన్ని కొనాలనుకోవడం వల్ల వచ్చే ఇబ్బందులు, సామాజిక హోదా కోసం పడే తపనను ఈ ట్రైలర్‌లో బాగా చూపించారు. ‘అప్పు చేయాలి, అప్పు చేస్తేనే పెద్దవాళ్ళం అవుతాం’ అనే డైలాగ్ మధ్యతరగతి జీవితాల్లోని కోణాన్ని ఆవిష్కరిస్తోంది. సముద్రఖని ఎప్పటిలాగే సహజమైన నటనతో ఆకట్టుకోగా, ఆయన భార్య పాత్రలో ఉన్న నటికి చాలా ఇంపార్టెన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎమోషన్‌ని సరిగ్గా క్యారీ చేస్తున్నాయి. సముద్రఖని కెరీర్‌లో ఒక మంచి ఫిల్మ్‌గా ఈ సినిమా ఉంటుందని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా ‘జీవితంలో ఏది ముఖ్యం, ఆస్తులా లేక అనుబంధాలా?’ అని ఆలోచింపజేసే ఒక మంచి మెసేజ్ కూడా ఉందని అనిపిస్తోంది.

Also Read- Jr.NTR Pranathi: భార్య ప్రణతి పుట్టినరోజు.. గ్రాండ్ పార్టీ ఇచ్చిన తారక్.. ఫోటోలు వైరల్!

మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే చిత్రం

Advertisement

ఇక హైదరాబాద్‌లో జరిగిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సముద్రఖని మాట్లాడుతూ.. మనం లైఫ్‌ను చూసే విధానాన్ని ఎన్ని రకాలుగా అయినా చెప్పుకోవచ్చు. ఇందులో కూడా డిఫరెంట్‌గా చెబుతున్నాం. రామ్ చక్రి వెరీ ఇంటెన్స్ క్రియేటర్. ఇలాంటి మంచి కథను నా దగ్గరకు తీసుకొచ్చిన తనకు థ్యాంక్స్. లక్ష్మి ప్రియా, అభినయ పెర్ఫార్మెన్స్‌లు అందరికీ నచ్చుతాయి. సినిమా చూసి థియేటర్స్‌ నుంచి బయటకు వచ్చిన ప్రతి ప్రేక్షకుడిని ఆలోచింపజేసేలా ఈ చిత్రం ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరూ తమ లోన్ ఈఎమ్‌ఐలను కూడా తక్కువ చేసుకోవాలనుకుంటారు. అలాంటి మెసేజ్ ఈ చిత్రం ఇస్తుంది. మనపై ఉన్న బరువులను తగ్గించుకుంటేనే.. మన డ్రీమ్స్‌ను నెరవేర్చుకోగలుగుతాం.. ప్రతి ఒక్కరూ వెల్త్‌గా ఉంటే కచ్చితంగా గెలుస్తారు అని చెప్పే చిత్రమిదని అన్నారు. ‘ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఈ చిత్రం కనెక్ట్ అవుతుందని, ప్రతి ఒక్కరూ తమ అప్పులను తగ్గించుకుని ఆనందంగా ఉండాలని ఈ చిత్రం ద్వారా చూపించబోతున్నాం’ అని అన్నారు దర్శకుడు రామ్ చక్రి. మా డిస్ట్రిబ్యూషన్ పార్టనర్‌‌గా వ్యవహరిస్తున్న పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్‌ ద్వారా ఈ సినిమా థియేటర్లలోకి వస్తుందని తెలిపారు నిర్మాత అరుణ్ రంగరాజులు. ఇంకా హాజరైన పలువురు ప్రముఖులు సినిమా గ్రాండ్ సక్సెస్ కావాలని కోరారు.

Also Read- Kissik Talks: ప్రతి నెలా రూ. 50 లక్షల గోల్డ్ కొంటా.. వర్కర్స్‌కి శాలరీ ఎంత ఇస్తానంటే – మాధురి

Related News

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్!

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

Big Stories

Advertisement
×