E-Paper
Advertisement

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!
Advertisement

Tea Detox: చాయ్ ..పొద్దున్న లేస్తే మనం కలవరించేది దీన్నే. చాలా మందికి ఇది లోనికి పోనిదే అడుగు ముందుకు కదలదు .అలా ఈ టీ  కోట్లాది మందికి ఒక ఎమోషన్. పొగలు గక్కే కప్పు టీ పడకపోతే చాలామందికి రోజూ గడవడం కష్టం. అయితే, నిరంతరం మనల్ని ఉత్సాహపరిచే ఈ అమృతం లాంటి చాయ్‌ వెనుక కొన్ని సైలెంట్ హెల్త్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయనేది కాదనలేని నిజం. ఒకవేళ మీరు గుండె నిబ్బరం చేసుకుని, కేవలం 30 రోజులు టీకి పూర్తి దూరంగా ఉంటే మీ శరీరంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసా? ఆ క్రేజీ రీబూట్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు డీటెయిల్డ్‌గా చూద్దాం!

చర్మంపై ‘గ్లో’ నెక్స్ట్ లెవెల్!

Advertisement

టీలో ఉండే కెఫీన్ ఒక సహజ ‘డైయూరిటిక్’ (Diuretic). అంటే ఇది శరీరం నుండి నీటిని త్వరగా బయటకు పంపేస్తుంది. దీనివల్ల చర్మకణాలు తేమను కోల్పోయి, డ్రైగా, కాంతివిహీనంగా మారతాయి. మీరు చాయ్ మానేసిన మొదటి వారంలోనే మీ చర్మానికి మళ్లీ జీవం వస్తుంది. బాడీలో హైడ్రేషన్ లెవెల్స్ స్థిరంగా ఉండటం వల్ల ముఖం, బుగ్గలు సహజమైన కాంతితో మెరుస్తాయి.

మొటిమలు, మచ్చలకు శాశ్వత చెక్

Advertisement

చాయ్‌లో మనం వాడే పాలు, చక్కెర.. మొటిమలకు (Acne) ప్రాణ స్నేహితులు. చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. ఇది చర్మంలోని సెబమ్ (నూనె గ్రంథులను) ప్రేరేపించి, విపరీతంగా ఆయిల్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. ఫలితంగా చర్మ రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు వస్తాయి. పైగా పాలలోని కొన్ని హార్మోన్లు వీటిని మరింత పెంచుతాయి. చాయ్ పక్కన పెడితే నూనె ఉత్పత్తి తగ్గి, మొటిమలు మాయమవుతాయి.

వృద్ధాప్య ఛాయలు మాయం.. ఎప్పటికీ యంగ్‌గా!

అధిక చక్కెర వాడకం వల్ల చర్మాన్ని యవ్వనంగా, టైట్‌గా ఉంచే ‘కొలాజెన్’, ‘ఎలాస్టిన్’ అనే ప్రొటీన్లు దెబ్బతింటాయి. దీనివల్ల వయసు పెరగక ముందే ముఖంపై ముడతలు, ఎర్రటి మచ్చలు, వాపు వస్తాయి. నెల రోజులు టీ మానేస్తే బాడీలో కొలాజెన్ వ్యవస్థ రీబూట్ అయి, ముఖంపై వృద్ధాప్య ఛాయలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారు.

 కళ్ల కింద డార్క్ సర్కిల్స్‌కు గుడ్‌బై

కళ్ల కింద నల్లటి వలయాలు (Dark Circles) రావడానికి ప్రధాన కారణం ప్రశాంతమైన నిద్ర లేకపోవడం. టీలో ఉండే కెఫీన్ మెదడులో నిద్రను ప్రేరేపించే ‘అడెనోసిన్’ అనే రసాయనాన్ని అడ్డుకుంటుంది. చాయ్ మానేయడం వల్ల మీ శరీరం మళ్లీ తన సహజమైన ‘స్లీప్ సైకిల్’ను పొందుతుంది. రాత్రిపూట గాఢ నిద్ర పట్టడం వల్ల కళ్ల చుట్టూ ఉండే రక్తనాళాలు విశ్రాంతి పొంది, కళ్ల కింద వాపు, నలుపు క్రమంగా తగ్గిపోతాయి.

అంతర్గత అవయవాల ‘డిటాక్సిఫికేషన్’

టీని దూరం పెట్టి.. ఆ ప్లేస్‌లో నీళ్లు, హెర్బల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల లివర్, కిడ్నీలపై భారం తగ్గుతుంది. ఇవి మరింత చురుగ్గా పనిచేస్తూ రక్తంలోని వ్యర్థాలను సమర్థవంతంగా శుద్ధి చేస్తాయి. జీర్ణక్రియ మెరుగుపడి, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలు పూర్తిగా నయమవుతాయి.

ఒక్కసారిగా చాయ్ మానేయడం వల్ల మొదటి 3 నుండి 7 రోజులు బాడీ విత్‌డ్రాయల్ సింప్టమ్స్ చూపిస్తుంది. తేలికపాటి తలనొప్పి, నీరసం, కాస్త చిరాకుగా అనిపించవచ్చు. అది కెఫీన్ అడిక్షన్ నుండి మీ శరీరం కోలుకుంటుంది అనడానికి సంకేతం. ఆ సమయంలో చాయ్‌కి ప్రత్యామ్నాయంగా గోరువెచ్చని నిమ్మరసం నీళ్లు, కొబ్బరినీళ్లు తాగితే టాక్సిన్స్ త్వరగా బయటకు పోతాయి.

నెల రోజుల ఈ ‘టీ డిటాక్స్ ఛాలెంజ్’ మీ శరీరానికి ఒక కొత్త లైఫ్ ఇస్తుంది. బాహ్య సౌందర్యమే కాకుండా, అంతర్గత అవయవాలు సైతం పునరుజ్జీవింపబడి మీలో ఒక కొత్త ఉత్సాహం ఉరకలేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ బాడీని రీబూట్ చేయడానికి ఈ రోజే ఈ ఛాలెంజ్‌ను మొదలెట్టేస్తారు కదూ !

Also read :పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×