E-Paper
Advertisement

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్
Advertisement

Dridam OTT Release : మలయాళ సినిమాలు సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌ లో మళ్లీ తన మార్క్ చూపిస్తున్నాయి. అలాంటి ఒక ఉత్కంఠభరితమైన చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. షేన్ నిగమ్ నటించిన ‘దృడం’ (Dridam) మూవీ 2026 మే 8న థియేటర్లలో విడుదలై మంచి స్పందన అందుకుంది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలోకి రానుంది ? ఎప్పటి నుంచి చూడవచ్చు ? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం పదండి.

ఏ ఓటీటీలో చూడవచ్చు ?

‘దృడం’ మూవీ 2026 జూన్ 12 నుంచి Jio Hotstarలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా OTT రిలీజ్ వివరాలు జియో హాట్‌స్టార్ మలయాళం ట్విట్టర్ ఖాతాలో అధికారికంగా ప్రకటించారు. మలయాళం ఒరిజినల్‌తో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో డబ్ చేసి అందుబాటులో ఉంచనున్నారు.

కథ ఏమిటి ?

Advertisement

ప్రశాంతమైన, నేరాలు లేనట్లుగా కనిపించే చిన్న ప్రాంతానికి బదిలీ అయిన ఒక యువ పోలీస్ అధికారి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. స్టేషన్ బాధ్యతలు చేపట్టిన కొద్దికాలానికే అక్కడ ఒక మానవ అవశేషం బయట పడటంతో ప్రశాంతం ఉన్న ప్రాంతం కలకలం రేపుతుంది. తర్వాత ఒక బ్యాంకు దోపిడీ కూడా జరగడంతో పరిస్థితి మరింత దిగజారుతుంది.

కథ అంతా ప్రశాంతమైన ‘కుజినిలం’ అనే గ్రామీణ ప్రాంతంలో షురూ అవుతుంది. విజయ్ రాధాకృష్ణన్ (షేన్ నిగమ్) అనే ఎస్ఐ అక్కడ తన తొలి పోస్టింగ్‌ గా బాధ్యతలు చేపట్టాక కథ మలుపు తిరుగుతుంది. విజయ్ అక్కడ బాధ్యతలు తీసుకున్న కొద్ది రోజులకే ఆ ఊరిలో ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఒక డెడ్ బాడీ బయటపడటం, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో భారీ దోపిడీ జరగడం, ఆ తర్వాత మరొక గుర్తుతెలియని శవం దొరకడం వంటి వరుస నేరాలు అందరినీ ఉలిక్కిపడేలా చేస్తాయి. అనుభవం లేని ఆ ఎస్ఐ  విజయ్, తన తోటి పోలీసుల (శోభి తిలకన్ తదితరులు) సహాయంతో ఈ హత్యలు, దోపిడీల వెనుక ఉన్న మిస్టరీని ఛేదించడానికి ట్రై చేస్తాడు. సినిమా చివరి 15-20 నిమిషాల్లో ఊహించని షాకింగ్ ట్విస్ట్‌లు ఉంటాయి. ఈ సవాళ్లను ఆ యువ పోలీస్ అధికారి ఎలా ఎదుర్కొంటాడు ? ఏం చేసి కేసును పరిష్కరిస్తాడు ? అనేది ఈ సినిమా ప్రధాన ఆకర్షణ. ప్రతి సన్నివేశం నరాలు తెగే ఉత్కంఠతో నిండి ఉంటుంది. మలయాళ సినిమాల్లో సాధారణంగా కనిపించే తీవ్రమైన ట్విస్టులు ఈ చిత్రంలో కూడా ఉన్నాయి.

Advertisement

Also Read : IMDbలో బెస్ట్ రేటింగ్ ఉన్న బయోపిక్స్… అన్నీ ఒకే ఓటీటీలో

ఎందుకు చూడాలి ?

మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్లకు ఇది తప్పకుండా చూడాల్సిన సినిమా. షేన్ నిగమ్ నటన చాలా బాగుంటుందని థియేటర్ లో ఈ సినిమాను చూసిన వారు చెబుతున్న మూవీ. కథలో ఊహించని ట్విస్టులు, మంచి స్క్రీన్‌ప్లే ఉన్నాయి. బహుభాషా డబ్బింగ్ ఉండటం వల్ల దక్షిణాది ఫ్యాన్స్‌ కు సులభం. థియేటర్లలో మిస్ అయిన వాళ్లు ఇప్పుడు ఇంట్లోనే ఈ థ్రిల్లర్‌ ను చూసి ఎంజాయ్ చేయవచ్చు. సస్పెన్స్, మిస్టరీ, థ్రిల్ ఇష్టపడే వాళ్లు ఈ సినిమాను మిస్ కాకండి.

Tags

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×