E-Paper
Advertisement

Sugarcane Juice: జాగ్రత్త సుమీ.. ఆ సమస్యలు ఉన్నవాళ్లు చెరుకు రసం అస్సలు తాగొద్దట!

Sugarcane Juice: జాగ్రత్త సుమీ.. ఆ సమస్యలు ఉన్నవాళ్లు చెరుకు రసం అస్సలు తాగొద్దట!
Advertisement

Sugarcane Juice: కొబ్బరి నీళ్లు తర్వాత అందరూ చాలా ఇష్టంగా తాగే పానీయం చెరుకు రసం. రోడ్డు పక్కన దొరికే ఈ సహజ పానీయం తాగగానే శరీరం చల్లబడటమే కాకుండా తక్షణ శక్తి కూడా లభిస్తుంది. అయితే ఈ చెరుకు రసం కొందరికి ఆరోగ్యకరమై అయినప్పటికీ.. మరికొందరికి ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. అలాంటి వారు చెరుకు రసం తాగకూడదని, వీలైనంత దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అత్యధిక పోషక విలువలు:

చెరకు రసంలో కేవలం తీపి మాత్రమే కాదు.. మన శరీరానికి అవసరమైన పోషకాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి. దీనిలో ఉండే సహజ కార్బోహైడ్రేట్స్ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. కాబట్టి.. శరీరం అలసటకు గురైనప్పుడు చెరుకు రసం తాగడం మంచిది. అంతేకాదు దీనిలోని పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎముకల దృఢత్వానికి, గుండె పనితీరుకు ఎంతగానో తోడ్పడతాయి. చెరుకు రసంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ కణాల నష్టాన్ని తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాదు.. ఈ రసంలోని పోషకాల వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.

ప్రమాదమని ఎందుకంటారు?

Advertisement

చెరుకు రసంలో అనేక విలువలు కలిగిన పోషకాలు ఉన్నప్పటికీ.. దాని వల్ల బోలెడు ప్రయోజనాలు కలుగుతున్నప్పటికీ ఈ పానీయంలో చక్కెర స్థాయులు, క్యాలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి. .అధిక మొత్తంలో చెరుకు రసం తీసుకుంటే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను అకస్మాత్తుగా పెంచుతుంది. దీంతో అనారోగ్యం బారీన పడాల్సి ఉంటుంది.

అలాంటి వాళ్లు దూరంగా ఉండాలి:

* రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగే అవకాశం ఉన్నందున మధుమేహులు/ ప్రీ డయాబెటిస్ ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి.
* చెరుకు రసంలో అధిక క్యాలరీలు ఉండటం వలన బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఇబ్బందిగా మారవచ్చు.
* అలాగే ఫ్యాటీ లివర్ లేదా మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న రోగులు చెరుకు రసాన్ని తీసుకోకపోవడమే ఉత్తమం.
* చక్కెర శాతం ఎక్కువగా ఉండటం వల్ల దంతక్షయం సమస్య ఉన్నవాళ్లు దీనిని పూర్తిగా దూరం పెట్టాలి.

Advertisement

ముఖ్యంగా చెరకు రసాన్ని తాజాగా ఉన్నప్పుడే తాగాలి. నిల్వ ఉంచిన రసంలోకి బ్యాక్టీరియా త్వరగా చేరిపోతుంది. ఏ సమస్యలూ లేకుండా ఉన్నవాళ్లు కూడా చెరుకు రసాన్ని అప్పుడప్పుడు, పరిమిత పరిమాణంలో తాగడం ఉత్తమం. దీంతోపాటు రసం తీసే యంత్రాలు, పరిసరాలు శుభ్రంగా ఉన్నాయో, లేదో చూసుకోవాలి.

 

 

Related News

లెక్కలో యమ ఫాస్ట్.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆర్థిక లావాదేవీల్లో నిపుణులు

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

Big Stories

Advertisement
×