E-Paper
Advertisement

Malavika Mohanan: విజయ్ దేవరకొండతో రాజా సాబ్ బ్యూటీ మూవీ … చివరి నిమిషంలో ఆగిపోయిందా?

Malavika Mohanan: విజయ్ దేవరకొండతో రాజా సాబ్ బ్యూటీ మూవీ … చివరి నిమిషంలో ఆగిపోయిందా?
Advertisement

Malavika Mohanan: ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ది రాజా సాబ్ (The Raja Saab). ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా 9వ తేదీ విడుదల కాగా 8వ తేదీ సాయంత్రమే ప్రీమియర్లు ప్రసారం కానున్నాయి. ఈ సినిమా విడుదలకు కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించిన విషయం తెలిసిందే. ఇలా ఈ ముగ్గురు వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమాకు కావలసినంత హైప్ ఇస్తున్నారు.

విజయ్ దేవరకొండతో మాళవిక మూవీ..

ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లలో ఒకరైన మాళవిక మోహనన్తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె టాలీవుడ్ ఎంట్రీ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ప్రభాస్ తో నటించిన ఈ సినిమా ద్వారా మాళవిక టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. అయితే తనకు ప్రభాస్ కంటే ముందుగానే విజయ్ దేవరకొండతో నటించే అవకాశం వచ్చిందని చివరి నిమిషంలో ఈ సినిమా ఆగిపోయిందని మాళవిక తెలియజేశారు. మరి విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో ఈమె నటించాల్సిన ఆ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే..

విజయ్ దేవరకొండ తో ఆగిపోయిన సినిమా..

Advertisement

విజయ్ దేవరకొండ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన డియర్ కామ్రేడ్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండకు హీరో(Hero) అనే సినిమాలో నటించే అవకాశం వచ్చిందట ఈ సినిమాలో మాళవికను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలి అనుకున్న సమయంలో కొన్ని కారణాల వల్ల ఆగిపోయిందని తెలియజేశారు. ఈ సినిమా ఆగిపోయిన అనంతరం విజయ్ దేవరకొండ లైగర్ సినిమా పనులలో బిజీ అయ్యారని తద్వారా తన టాలీవుడ్ ఎంట్రీ కూడా ఆగిపోయిందని తెలియజేశారు.

ప్రభాస్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ..

Advertisement

ఇక అనుకోకుండా తనకు రాజా సాబ్ సినిమాలో అవకాశం వచ్చిందని తెలిపారు. ముంబైలో తను తన ఇంటి నుంచి మరొక ఇంటికి షిఫ్ట్ అవుతున్న నేపథ్యంలో ఆ పనులలో బిజీగా ఉన్నాను అనుకోకుండా రాజా సాబ్ టీం నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని ఈ సందర్భంగా మాళవిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ హీరో సినిమాతో తాను తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. మరి ప్రభాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా ద్వారా ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో మాళవికతో పాటు
నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా హర్రర్ కామెడీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Also Read: MSVPG Film: మన శంకర్ వరప్రసాద్ గారు సెన్సార్ పూర్తి.. రన్ టైం ఎంతంటే!

Related News

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

Big Stories

Advertisement
×