E-Paper
Advertisement

బైక్ రైడర్స్ జాగ్రత్త.. ఆ తప్పు చేస్తే పిల్లలు పుట్టరు

బైక్ రైడర్స్ జాగ్రత్త.. ఆ తప్పు చేస్తే పిల్లలు పుట్టరు
Advertisement

Bike Parking| ఈ రోజుల్లో రవాణా కోసం అత్యధికంగా మోటార్ బైక్‌లు ఉపయోగిస్తున్నారు. అయితే ఇంటి వద్ద పార్కింగ్ లేక బయట ఖాళీ స్థలంలో పార్క్ చేస్తున్నారు. వేసవి కాలంలో కూడా చాలా మంది తమ బైక్‌ను నేరుగా ఎండలో పార్క్ చేస్తారు. దీని వల్ల వచ్చే పరిణామాల గురించి ఆలోచించరు. కానీ ఈ సాధారణ అలవాటు పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ వేడి వల్ల శుక్రకణాల నాణ్యత తగ్గి, కాలక్రమేణా సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు.

శుక్రకణాల నాణ్యతపై ఉష్ణోగ్రత ప్రభావం

ఉష్ణోగ్రత మార్పులకు శుక్రకణాలు చాలా సున్నితంగా ఉంటాయి. అండకోశాలు.. శరీరం బయట ఉండటం వల్ల చల్లగా ఉంటాయి. సాధారణంగా శరీర ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఉంటాయి. ఈ చల్లని వాతావరణం సరైన శుక్రకణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. బయటి వేడి పెరిగితే ఈ సమతుల్యత త్వరగా దెబ్బతింటుంది.

బైక్ సీటు వేడిగా ఉంటే ఎంతో నష్టం

Advertisement

ఎండలో ఎక్కువసేపు పార్కింగ్‌లో ఉన్న బైక్ సీటు చాలా వేడిగా ఉంటుంది. దానిపై కూర్చున్నప్పుడు వేడి నేరుగా అంగం కింది భాగానికి తాగుతుంది. దీంతో అండకోశాల ఉష్ణోగ్రతను త్వరగా పెరిగిపోతుంది. ఎక్కువసేపు ఇలా ఉండటం వల్ల శుక్రకణాల సంఖ్య తగ్గి, నాణ్యత తగ్గుతుంది. అధిక ఉష్ణోగ్రత శుక్రకణాల కదలికను నెమ్మదిగా చేసి, గర్భధారణ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.

శుక్రకణాల నాణ్యత, డిఎన్ఏపై ప్రభావం

అధిక వేడి శుక్రకణాల సంఖ్యను మాత్రమే తగ్గించదు. శుక్రకణాల నిర్మాణం, డిఎన్ఏను కూడా దెబ్బతీస్తుంది. దెబ్బతిన్న డిఎన్ఏ గర్భధారణను ప్రభావితం చేసి, భవిష్యత్ శిశువు అభివృద్ధికి సమస్యలు కలిగించవచ్చు. వేడి, స్ట్రెస్ శుక్రకణాల కదలిక, ఆకార నాణ్యతను తగ్గిస్తుంది.

హార్మోన్ల అసమతుల్యత, అంతర్గత ప్రభావాలు

Advertisement

బైక్ సీటు ద్వారా వచ్చే వేడి హార్మోన్ల స్థాయిని దెబ్బతీస్తుంది. టెస్టోస్టెరాన్ శుక్రకణాల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. అధిక ఉష్ణోగ్రత వల్ల టెస్టోస్టెరాన్ స్థాయి తగ్గవచ్చు. వేడి శరీరంలో ఆక్సిడేషన్.. ఒత్తిడిని పెంచి, అండకోశ కణాలను దెబ్బతీసి, సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.

నీటి లోపం సమస్యను మరింత పెంచుతుంది

వేసవిలో నీటి లోపం సాధారణం. నీరు తక్కువగా ఉంటే రక్తప్రసరణ, హార్మోన్ల రవాణా ప్రభావితమవుతాయి. ఇది శుక్రకణాల ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. వీర్యంలో ఎక్కువ భాగం నీరు ఉంటుంది కాబట్టి, నీటి లోపం మొత్తం సంతానోత్పత్తి సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది.

సంతానోత్పత్తి సామర్థ్యం దెబ్బతీసు ఇతర రోజువారీ అలవాట్లు

టైట్ బట్టలు వేడిని బంధించి, గాలి ప్రసరణను తగ్గిస్తాయి. ఎక్కువసేపు కూర్చోవడం కూడా స్థానిక ఉష్ణోగ్రతను పెంచుతుంది. హీటెడ్ సీట్లు లేదా ల్యాప్‌టాప్ తొడపై ఉంచడం వల్ల మరింత వేడి పెరుగుతుంది. ఈ అలవాట్లు అన్ని కలిసి శుక్రకణాల ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తాయి.

Also Read: ఫ్రూట్ జ్యూస్ తాగితే ప్రాణాలకే ప్రమాదం.. అ సమస్యలు ఉన్నవారు అసలు తాగకూడదు

సంతానోత్పత్తిని రక్షించడానికి చిట్కాలు

బైక్‌ను ఎక్కువసేపు నేరుగా ఎండలో పార్క్ చేయకండి. బైక్ కవర్ వాడండి లేదా నీడలో పార్క్ చేయండి. సీటు చల్లబడిన తరువాతే కూర్చోకండి. వదులుగా, గాలి ప్రసరణ ఉన్న బట్టలు వేసుకోండి. రోజంతా తగినంత నీరు తాగండి. లాంగ్ రైడ్స్‌ చేసే సమయంలో విరామాలు తీసుకోండి.

బైక్ సీటు సౌకర్యవంతంగా అనిపించినా, వేసవి వేడి పురుషుల సంతానోత్పత్తికి హాని చేస్తుంది. చిన్న చిన్న జీవనశైలి మార్పులతో శుక్రకణాల ఆరోగ్యాన్ని సులభంగా రక్షించవచ్చు.

Related News

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

ప్రతిరోజూ హెల్మెట్ ధరిస్తే జుట్టు డ్యామేజ్.. ఈ సులభమైన హెయిర్ కేర్ చిట్కాలు మీ కోసం

పాము, ముంగీస లాంటి స్వభావం వీరిది.. ఈ తేదీల్లో పుట్టినవారు పెళ్లి తరువాత గొడవపడుతూనే ఉంటారు

మద్యం లేదా సిగరెట్.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రమాదకరం.. ఏది ముందుగా మానేయాలి?

ఉద్యోగం చేసే భార్యభర్తల మధ్య ఒత్తిడి, గొడవలు.. దాంపత్య జీవితం కాపాడుకోవడానికి ఇలా చేయడం తప్పనిసరి

ఆలుగడ్డలు 5 నెలల పాటు తాజాగా ఉండాలా? అయితే ఆ ప్రదేశంలో పెట్టండి!

రోగాలు మాయం.. వర్షాకాలంలో కచ్చితంగా తినాల్సిన కూరగాయలు

Big Stories

Advertisement
×