E-Paper
Advertisement

ఫ్రూట్ జ్యూస్ తాగితే ప్రాణాలకే ప్రమాదం.. అ సమస్యలు ఉన్నవారు అసలు తాగకూడదు

ఫ్రూట్ జ్యూస్ తాగితే ప్రాణాలకే ప్రమాదం.. అ సమస్యలు ఉన్నవారు అసలు తాగకూడదు
Advertisement

Fruit Juice Harmful| ఆరోగ్యానికి పండ్లు, కూరగాయలు ఎంతో మేలు చేస్తాయి. అందుకే వేసవిలో అందరూ ఫ్రూట్ జ్యూస్ తాగడానికి ఇష్టపడతారు. ఇందులోని పోషకాలు త్వరగా రిఫ్రెష్‌మెంట్ అందిస్తాయి. ఈ కారణంగానే చాలా మంది ప్రతి రోజు ఫ్రూట్ జ్యూస్ తాగుతారు. అయితే ఫ్రూట్ జ్యూస్ అందరికీ ఆరోగ్యకరం కాదు. కొన్ని రకాల ఫ్రూట్ జ్యూస్ తాగడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. మధుమేహం ఉన్నవారైతే ఫ్రూట్ జ్యూస్ తాగకూడదు.

ఫ్రూట్ జ్యూస్ రక్తపోటు ఉన్నవారికి హానికరమా?

ఈ విషయంపై కొన్ని అధ్యయనాలు మిశ్రమ ఫలితాల చూపించాయి. ఫ్రూట్ జ్యూస్ పరిమితంగా తాగడం వల్ల రక్తపోటు పెరిగే ప్రమాదం లేదు. అయితే అధిక మొత్తంలో తాగితే బిపి ఉన్న వారికి ప్రాణాలకే ప్రమాదం ఉంది.

అధిక ఫ్రూట్ జ్యూస్ రక్తపోటుపై ఎలా ప్రభావం చూపుతుంది?

Advertisement

ఫ్రూట్ జ్యూస్‌లో సహజ చక్కెర ఉంటుంది కానీ ఫైబర్ ఉండదు. అధిక చక్కెర దీర్ఘకాలంలో రక్తపోటు పెంచే అవకాశం ఉంది. ఎక్కువ మొత్తంలో ఫ్రూట్ జ్యూస్ తాగడం వల్ల బరువు పెరగడం, జీవక్రియ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని అధ్యయనాలు తరచూ రసం తాగడం రక్తపోటు పెరగడానికి సంబంధం ఉండవచ్చని సూచిస్తున్నాయి. రసంలో అదనపు చక్కెర ఉంటే ఈ ప్రమాదం మరింత ఎక్కువవుతుంది.

ఫ్రూట్ జ్యూస్, షుగర్ డ్రింక్స్ మధ్య తేడా

అన్ని పానీయాలు రక్తపోటుపై ఒకేలా ప్రభావం చూపవు. సోడా కలిగిన వంటి చక్కెర డ్రింక్స్ (పెప్సీ, 7 అప్, స్ప్రైట్) వల్ల రక్తపోటు కచ్చితంగా పెరుగుతుంది. కానీ స్వచ్ఛమైన, సహజ ఫ్రూట్ జ్యూస్ అలా కాదు. ఫ్రూట్ జ్యూస్‌లోని ఫ్రక్టోజ్.. సాధారణ కూల్ డ్రింక్స్ లాంటి హాని కలిగించదు. అయినప్పటికీ మితంగా తాగడం చాలా ముఖ్యం.

ఫ్రూట్ జ్యూస్.. రక్తపోటు తగ్గించడానికి సహాయపడుతుందా?

Advertisement

కొన్ని ఫ్రూట్ జ్యూస్‌లు రక్తపోటు తగ్గించడంలో సహాయపడవచ్చు. ఉదాహరణకు దానిమ్మ జ్యూస్, కొంతమందిలో సిస్టోలిక్, డయాస్టోలిక్ రక్తపోటును తగ్గిస్తుంది. బీట్‌రూట్ రసం, బెర్రీ ఫ్రూట్ జ్యూస్‌లు కూడా రక్తపోటుని తగ్గేందుకు సాయపడతాయి. ఈ ఫ్రూట్ జ్యూస్‌ల్లో ఉన్న యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

మధుమేహం లేదా రక్తపోటు ఉన్నవారికి ప్రమాదాలు

మధుమేహం ఉన్నవారు ఫ్రూట్ జ్యూస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పండ్ల నుంచి జ్యూస్ తీస్తే అందులో ఫైబర్ పోషకాలు నష్టపోతాయి. ఫైబర్ లేకపోవడం వల్ల జ్యూస్‌.. రక్తంలో చక్కెరను త్వరగా పెంచుతుంది. ఇది పరోక్షంగా రక్తపోటు, గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అధిక షుగర్ వల్ల ఒక్కసారిగా షుగర్ లెవెల్స్ పెరగడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.

ఎంత తాగితే సురక్షితం?

పరిమిత మొత్తంలో ఫ్రూట్ జ్యూస్ తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రోజుకు ఒక చిన్న గ్లాసు తాగితే ఎటువంటి ప్రమాదం ఉండదు. పెద్ద మొత్తాల్లో క్రమం తప్పకుండా తాగకూడదు. ప్యాకెట్ జ్యూస్ కంటే తాజా, చక్కెర లేని జ్యూస్ ఎంచుకోండి.

ఫ్రూట్ జ్యూస్ కు మంచి ప్రత్యామ్నాయాలు

ఫ్రూట్ జ్యూస్ కంటే నేరుగా పండ్లు తినడం మంచిది. అందులో ఫైబర్ ఉండటం వల్ల చక్కెర నెమ్మదిగా రక్తంలోకి వెళుతుంది. కొబ్బరి నీరు, హెర్బల్ డ్రింక్స్.. రోజువారీ తాగడానికి ఆరోగ్యకరమైన ఎంపికలు. ఇవి రక్తపోటును స్థిరంగా ఉంచడానికి సహాయపడతాయి.

Also Read: డాన్స్ చేసే సమయంలో గుండెపోటు.. పెరుగుతున్న కేసుల సంఖ్య.. ఇలా నివారించండి

ఫ్రూట్ జ్యూస్ సురక్షితంగా తాగడానికి చిట్కాలు

చక్కెర లేని తాజా, సహజ జ్యూస్ మాత్రమే తాగండి. ప్రిజర్వేటివ్స్, స్వీటెనర్స్ ఉన్న ప్యాకెట్ రసాలు తాగకూడదు. భోజనంతో పాటు ఫ్రూట్ జ్యూస్ కొద్దిగా తాగితే.. షుగర్ స్పైక్స్ తగ్గుతాయి. శరీరంలో పోషణ కోసం మాత్రమే జ్యూస్ తాగకూడదు.

 

Related News

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

Big Stories

Advertisement
×