Summer Superfoods: సమ్మర్ వచ్చేసింది. బయట ఎండలు సెగలు పుట్టిస్తుంటే.. బాడీ లోపల కూడా వేడి పెరిగిపోయి నీరసంగా అనిపిస్తుంటుంది. మనం తీసుకునే ఆహారం మన శరీరంపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఈ ఎండల వల్ల వచ్చే.. డీహైడ్రేషన్, వడదెబ్బ, చర్మ సమస్యల నుంచి తప్పించుకోవాలంటే మన ప్లేట్‌లో ఏముండాలి? ఏది ఉండకూడదు? అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ట్రెండీగా, హెల్తీగా ఈ సమ్మర్‌ను ఎంజాయ్ చేయడానికి ఎలాంటి ఆహార పదార్థాలు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సమ్మర్ లో ఏం తినాలి? ఏం తినకూడదు?
వేసవి కాలం అంటేనే మామిడి పళ్లు, ఐస్ క్రీములు, చల్లటి డ్రింక్స్ గుర్తుకొస్తాయి. కానీ.. నాలుకకు రుచిగా ఉండే ప్రతిదీ మన శరీరానికి మేలు చేయదు. ముఖ్యంగా 40 డిగ్రీల ఎండల్లో మన జీర్ణక్రియ కాస్త నెమ్మదిస్తుంది. అందుకే ఈ సమ్మర్‌లో మనం పక్కాగా పాటించాల్సిన డైట్ టిప్స్ ఇవే.
ఏం తినాలి?
నీటి శాతం ఎక్కువగా ఉండే పళ్లు: పుచ్చకాయ, కర్బూజ ఈ సీజన్‌లో బెస్ట్ ఫ్రెండ్స్. వీటిలో 90% పైగా నీరు ఉంటుంది. అలాగే కివీ, స్ట్రాబెర్రీస్, నారింజ పండ్లను డైట్‌లో చేర్చుకోండి.
పెరుగు & మజ్జిగ: మన పెద్దలు చెప్పినట్టు సమ్మర్‌లో మజ్జిగను మించిన అమృతం లేదు. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ పొట్టను చల్లబరుస్తాయి. కమ్మని పెరుగు అన్నం లేదా ఒక గ్లాసు పల్చటి మజ్జిగ తీసుకుంటే నీరసం దరిచేరదు.
కీర దోసకాయ : బాడీని ఇన్‌స్టంట్‌గా కూల్ చేయడానికి కీరదోస అద్భుతంగా పనిచేస్తుంది. సలాడ్స్ రూపంలో దీన్ని రోజూ తీసుకోవడం వల్ల చర్మం కూడా కాంతివంతంగా ఉంటుంది.
కొబ్బరి నీళ్లు: ఎలక్ట్రోలైట్స్ లోపాన్ని భర్తీ చేయడంలో కొబ్బరి నీళ్లది పైచేయి. ఎనర్జీ డ్రింక్స్‌కు బదులు ప్రకృతి ప్రసాదించిన ఈ స్వచ్ఛమైన నీటిని తాగండి.
సబ్జా గింజలు: వీటిని నీటిలో నానబెట్టి నిమ్మరసం లేదా మజ్జిగలో కలిపి తాగితే బాడీ హీట్ ఇట్టే తగ్గిపోతుంది.
ఏం తినకూడదు?
మసాలాలు & ఆయిలీ ఫుడ్స్: బిర్యానీలు, నూనెలో వేయించిన పకోడీలు, ఘాటైన మసాలాలు ఈ సీజన్‌లో జీర్ణం కావడం కష్టం. ఇవి శరీర ఉష్ణోగ్రతను మరింత.. పెంచుతాయి.
టీ & కాఫీ: కెఫీన్ ఎక్కువగా ఉండే డ బాడీని డీహైడ్రేట్ చేస్తాయి. అతిగా టీ, కాఫీలు తాగితే తలనొప్పి, గ్యాస్ సమస్యలు రావచ్చు.
Also Read: వేసవిలో చన్నీటి స్నానం చేస్తున్నారా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవడం గ్యారంటీ
కూల్ డ్రింక్స్ & షుగరీ సోడా: చల్లగా ఉందని సాఫ్ట్ డ్రింక్స్ తాగితే, అందులోని చక్కెర వల్ల బాడీ మరింత నీటిని కోల్పోతుంది. దీని వల్ల దాహం ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు.
రెడ్ మీట్: చికెన్, మటన్ లాంటి మాంసాహారం అరగడానికి ఎక్కువ శక్తి కావాలి. ఇది శరీరంలో వేడిని పుట్టిస్తుంది. సాధ్యమైనంత వరకు వీటిని తగ్గించడం మంచిది.
ట్రెండింగ్ టిప్స్:
ప్రస్తుతం “ఇన్ఫ్యూజ్డ్ వాటర్” ట్రెండ్ నడుస్తోంది. ఒక బాటిల్ నీటిలో కొన్ని పుదీనా ఆకులు, నిమ్మకాయ ముక్కలు, కీర దోస ముక్కలు వేసి రోజంతా ఆ నీటిని తాగుతూ ఉండండి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేయడమే కాకుండా మిమ్మల్ని రోజంతా యాక్టివ్‌గా ఉంచుతుంది.
సమ్మర్ అంటే కేవలం ఎండలు మాత్రమే కాదు, అది మన బాడీని మనం కేర్ తీసుకోవాల్సిన సమయం. సరైన ఆహారం తీసుకుంటే.. ఈ సీజన్‌ను కూడా ఎంతో హ్యాపీగా గడిపేయొచ్చు. గుర్తుంచుకోండి. ఎంత తిన్నా తినకపోయినా… రోజూ 3-4 లీటర్ల నీటిని తాగడం మాత్రం మర్చిపోకండి.